
భర్త ఇంటి ఎదుట బైఠాయించిన కవిత
మానకొండూర్(కరీంనగర జిల్లా): న్యాయం చేయాలని ఓ భార్య భర్త ఇంటి ఎదుట బైఠాయించింది. వివరాలిలా ఉన్నాయి. వరంగల్ జిల్లాకు చెందిన కవిత, మానకొండూర్‌కు చెందిన శ్రీనివాస్ కొన్నేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి పాప సంతానం. కరీంనగర్‌లో అద్దె ఇంట్లో నివాసముంటున్నారు.
చదవండి: నిజామాబాద్‌లో గుట్టుగా వ్యభిచారం.. 11 మంది అరెస్ట్
కొద్ది రోజుల నుంచి శ్రీనివాస్ ఇంటికి వెళ్లడం లేదు. దీంతో కవిత మానకొండూర్‌లోని శ్రీనివాస్ ఇంటి ఎదుట శనివారం బైఠాయించింది. తనకు, కూతురుకు న్యాయం చేయాలంటూ ఆందోళన చేపట్టింది. విషయం తెలుసుకున్న సీఐ కృష్ణారెడ్డి సదరు భార్యాభర్తలను పోలీస్‌స్టేషన్‌కు పిలుపించుకొని కౌన్సెలింగ్ నిర్వహించారు. కలిసి ఉండాలని చెప్పి స్టేషన్ నుంచి పంపించారు.
Comments
Please login to add a commentAdd a comment