శిశువుతో ధర్నా చేస్తున్న బాధితురాలు
తిరువొత్తియూరు: కుటుంబంలో ఏర్పడిన మనస్పర్థలతో ఇంట్లోకి అనుమతించని భర్త ఇంటి ముందు ఓ ఇల్లాలు సోమవారం చంటి బిడ్డ సహా మౌన పోరాటం చేసింది. వివరాలు.. వెస్టు ముగపేర్ కార్పెంటర్ వీధికి చెందిన దినేష్ (35) ప్రైవేట్ సంస్థ ఉద్యోగి. అతని భార్య ప్రణీత (32). వీరికి రోహిత్ (9 నెలల) మగ బిడ్డ ఉన్నాడు. ప్రణీత వారం రోజుల ముందు అంబత్తూర్‌లో ఉన్న తల్లిదండ్రుల ఇంటికి వెళ్లింది. సోమవారం ఉదయం తన బిడ్డతో భర్త ఇంటికి వచ్చింది.
ఆమెను వదిలి పెట్టడానికి తండ్రి బాలకన్నన్ వెంట వచ్చినట్టు తెలిసింది. భర్త దినేష్, అతని బంధువులు ప్రణీతను ఇంట్లోకి అనుమతించలేదు. బాలకన్నన్ వారికి సర్ది చెప్పినప్పటికీ వారు ససేమిరా అన్నారు. దీంతో ప్రణీత తన చంటి బిడ్డలో దినేష్ ఇంటి ముందు కూర్చుని మౌన పోరాటం చేశారు. ఆమె తండ్రి అక్కడే ఉన్నాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని భార్య, భర్తకు సర్దిచెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment