భర్త కోసం భార్య ఆందోళన | Wife protest at outside Husband house in Alwal hyderabad | Sakshi
Sakshi News home page

భర్త కోసం భార్య ఆందోళన

Published Sat, Jun 18 2016 11:15 AM | Last Updated on Fri, Jul 27 2018 2:26 PM

Wife protest at outside Husband house in Alwal hyderabad

హైదరాబాద్‌: నగరంలోని ఆల్వాల్లోని అత్తింటి ముందు భర్త కోసం ఓ భార్య ఆందోళనకు దిగింది. ఆరు నెలల క్రితం మీనాక్షి, తిరుమల్ అనే ఇద్దరు యువతీ యువకులు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే ఇపుడు భర్త తిరుమల్ ఇల్లు వదిలి పారిపోయాడు. ప్రేమించిన వాడిని నమ్ముకుని మీనాక్షి అందరినీ కాదని ఇల్లు వదిలి వచ్చేసింది. న్యాయం చేయమని అడిగితే సెటిల్ మెంట్ చేసుకోమని పోలీసులు సలహా ఇచ్చారని, తనకు న్యాయం జరగకపోతే అత్తింటి ముందు ఆత్మహత్య చేసుకుంటానని బాధితురాలు తెలిపింది. తిరుమల్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. మూడు నెలలుగా మీనాక్షి ఇంటి అద్దె చెల్లించలేని స్థితిలో ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement