Telangana speaker
-
బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై నాలుగు కేసులు.. స్పీకర్‌కు ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు ఫిర్యాదు వెళ్లింది. ఆయన ప్రవర్తన మీద జగిత్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్ స్పీకర్‌కు సోమవారం ఫిర్యాదు చేశారు. తనతో దురుసుగా ప్రవర్తించారని, కాబట్టి కౌశిక్‌పై చర్యలు తీసుకోవాలని స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను కోరారాయన. కరీంనగర్ కలెక్టరేట్లో అభివృద్ధి కార్యక్రమాల సన్నద్ధతపై ఆదివారం నిర్వహించిన సమావేశం రసాభాసగా మారింది. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్‌కార్డుల జారీ సన్నద్ధతపై నిర్వహించిన కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్(MLA Sanjay) మాట్లాడే సమయంలో.. ఆయన పక్కనే కూర్చున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి లేచి అభ్యంతరం తెలిపారు. ‘ఈయనకు మైకు ఇవ్వొద్దు.. నువ్వు ఏ పార్టీవయా..?’ అంటూ వేలెత్తి చూపిస్తూ మాటల దాడికి దిగారు. దీంతో డాక్టర్ సంజయ్ ‘నీకేం సంబంధం.. నాది కాంగ్రెస్ పార్టీ.. నువ్వు కూర్చో’ అన్నారు. దీంతో.. తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఒక దశలో సంజయ్ చేతిని కౌశిక్‌రెడ్డి తోసేశారు. అనంతరం కౌశిక్‌రెడ్డి పరుష పదజాలం వాడటంతో గొడవ పెద్దదై పరస్పరం తోసుకునే స్థాయికి చేరింది. ఆ అనూహ్య పరిణామానికి వేదికపై ఉన్న మంత్రులతో పాటు ప్రజాప్రతినిధులు నిర్ఘాంతపోయారు. పక్కనే ఉన్న ప్రజాప్రతినిధులు వారించే యత్నం చేసినా కౌశిక్‌రెడ్డి వినలేదు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ఆయనను బలవంతంగా సమావేశం నుంచి బయటకు తీసుకెళ్లారు. కౌశిక్ వెంట మిగతా బీఆర్ఎస్ ప్రతినిధులు వెళ్లిపోయారు.నీటిపారుదల శాఖ మంత్రి, ఉమ్మడి కరీంనగర్(Karimnagar) జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమక్షంలో ఈ ఘటన జరగడం గమనార్హం. ఏడుసార్లు గెలిచిన తాను రాజకీయంగా ఇలాంటి ప్రవర్తనను ఎన్నడూ చూడలేదంటూ తోటి శాసనసభ్యుడితో కౌశిక్‌రెడ్డి ప్రవర్తించిన తీరును ఉత్తమ్ తప్పుబట్టారు. నాలుగు కేసులు నమోదుహుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై (Padi kaushik Reddy) పలు సెక్షన్ల కింద మూడు కేసులు నమోదయ్యాయి. ఎమ్మెల్యే సంజయ్‌తో దురుసుగా ప్రవర్తించారని.. ఆయన పీఏ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. సమావేశంలో గందరగోళం, పక్కదారి పట్టించారని ఆర్డీవో మహేశ్వర్ ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదైంది. తన పట్ల దురుసుగా ప్రవర్తించారని గ్రంథాలయ ఛైర్మన్ మల్లేశం ఇచ్చిన ఫిర్యాదుపై ఇంకో కేసును ఫైల్ చేశారు. వీటితో పాటు గేమ్ ఛేంజర్ టికెట్ రేట్ల పెంపుపై సీఎం రేవంత్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ కాంగ్రెస్ మరో ఫిర్యాదు చేసింది. ఈమేరకు వేర్వేరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై నాలుగు కేసులను పోలీసులు నమోదు చేశారు. -
స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను సన్మానించిన FNCC సభ్యులు
తెలంగాణ శాసనసభ స్పీకర్‌గా ఎన్నికైన గడ్డం ప్రసాద్ కుమార్‌కు ఫిలింనగర్ కల్చరల్ కమిటీ(FNCC) సభ్యులు తాజాగా సన్మానం చేసి గౌరవించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఫిలింనగర్ కల్చరల్ కమిటీ(FNCC) సభ్యులు ప్రెసిడెంట్ ఆదిశేష గిరి, సెక్రటరీ ముళ్ళపూడి మోహన్, జాయింట్ సెక్రటరీ పెద్దిరాజు, ఎక్స్ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణతో పాటుగా ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. గడ్డం ప్రసాద్‌కు FNCC ప్రెసిడెంట్, సెక్రటరీ పుష్పగుచ్చము ఇచ్చి శాలువా కప్పి సన్మానం చేయడం జరిగింది. ప్రొడ్యూసర్, FNCC సెక్రటరీ మోహన్ మాట్లాడుతూ గడ్డం ప్రసాద్ కుమార్ గారు శాసనసభ స్పీకర్‌గా ఎన్నికైనందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. తమ ఆహ్వానాన్ని మన్నించి FNCCకి విచ్చేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారికి ప్రత్యేకంగా కమిటీ సభ్యుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఆపై తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ.. తనను ఇలా ఈ సన్మానానికి ఆహ్వానించడం చాలా ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. FNCC ద్వారా ఇక్కడికి రావడమే కాకుండా తన స్నేహితుల్ని ఇలా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని ఆయన చెప్పారు. FNCC కి తన వంతు కావాల్సిన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ వుంటాయని ఆయన తెలియచేశారు. ఇలా తనను ఆహ్వానించి గౌరవించినందుకు FNCC కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు. -
TS: అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ నామినేషన్.. బీఆర్ఎస్ మద్దతు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక రేపు(గురువారం) జరుగనుంది. ఈ నేపథ్యంలో స్పీకర్ స్థానం కోసం వికారాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలను అసెంబ్లీ కార్యదర్శికి అందజేశారు. కాగా, ప్రసాద్ కుమార్‌కు బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలుమద్దతు ఇవ్వడం విశేషం. స్పీకర్ నామినేషన్ పత్రాలపై సీఎం రేవంత్ రెడ్డి సంతకం చేసిన అనంతరం.. ఆయన నామినేషన్ వేశారు. ఆయన పేరును పార్టీ అధిష్టానం ఖరారు చేసిన విషయం తెలిసిందే. దీంతో, ప్రసాద్ కుమార్ బుధవారం నామినేషన్ వేశారు. ఇక, ప్రసాద్ కుమార్ నామినేషన్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ సహా పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. మరోవైపు.. స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలిపింది. ఈ క్రమంలో స్పీకర్ నామినేషన్ పత్రాలపై బీఆర్ఎస్ తరుపున మద్దతు తెలుపుతున్నట్టు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంతకం చేశారు. ఈ మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏకగ్రీవ ఎన్నికకు మద్దతు తెలిపారు. ఇక, కేటీఆర్ సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి చేరుకుని మద్దతు ప్రకటించారు. అలాగే, ఎంఐఎం తరఫున మాజిద్ ఉస్సేన్ మద్దతు తెలిపారు. ఇదిలా ఉండగా.. సహజంగానే అధికార పార్టీ స్పీకర్ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికవుతారు. గడ్డం ప్రసాద్‌ను స్పీకర్‌గా నియమిస్తే తెలంగాణ రాష్ట్ర తొలి దళిత స్పీకర్ అవుతారు. ప్రస్తుత శాసనసభలో అత్యధికులు అగ్రవర్ణాలకు చెందినవారే కావడం తెలిసిందే. తమను నియంత్రించే సత్తా ఉన్న స్పీకర్ పదవిని ప్రజల్లోకి తీసుకెళ్లి సభలో మాట్లాడే అవకాశం కల్పిస్తున్నారనే భావన ప్రజల్లోకి వెళ్లేందుకు కాంగ్రెస్ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. -
TS: స్పీకర్ ఎన్నిక 14న..ఆయనకే ఛాన్స్ !
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక ఈ నెల 14న జరగనుంది. స్పీకర్ ఎన్నిక తేదీని ఖరారు చేస్తూ అసెంబ్లీ సెక్రటేరియట్ సోమవారం(డిసెంబర్11)నోటిఫికేషన్ విడుదల చేసింది. స్పీకర్ పదవికి పోటీపడే వారే నుంచి ఈ నెల 13న ఉదయం 10.30గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ నుంచే స్పీకర్ ఎన్నికవనున్నారు. వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌కుమార్‌కు స్పీకర్ పదవి ఇవ్వాలని కాంగ్రెస్ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. అయితే స్పీకర్ ఎన్నిక ఏకగగ్రీవం కావాలంటే కాంగ్రెస్ పార్టీ తరపున ఒక్క నామినేషన్ మాత్రమే రావాల్సి ఉంటుంది. ఎవరైనా ఇతర సభ్యులు పోటీలో ఉంటే బ్యాలెట్ ద్వారా స్పీకర్‌ను ఎన్నుకుంటారు. ప్రొటెం స్పీకర్ ఆధ్వర్యంలో స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఇదీచదవండి..కిషన్.. పవన్.. ఓ ప్రచారం -
పోచారంకు సీఎం కేసీఆర్ గట్టిగా చెప్పారా? అందుకే నిర్ణయం మార్చుకున్నారా?
స్పీకర్ గా పని చేసిన వారు ఓడిపోతారనే సాంప్రదాయానికి ప్రస్తుత సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ద్వారా చెక్ పెట్టాలని చూస్తున్నారు సీఎం కేసీఆర్. ఇద్దరు తనయులలో ఎవరికో ఒకరికి టికెట్ ఇవ్వాలని కోరిన పోచారం శ్రీనివాస్ రెడ్డి.. ఇప్పుడు తన పంథాను మార్చుకున్నారా అంటే ఔననే చెప్పాలి. బాన్సువాడ నియోజకవర్గంలోని బీర్కూర్ లో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తానే పోటీ చేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు. జోరుగా రిటైర్మెంట్పై చర్చ.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పోచారం శ్రీనివాస్ రెడ్డి పోటీ చేయరని రిటైర్మెంట్ ప్రకటిస్తారని రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. ఒకవేళ కచ్చితంగా పోటీ చేయాల్సి వస్తే జహీరాబాద్ పార్లమెంట్ కు పోటీ చేస్తారని, తనయులకు అసెంబ్లీ నియోజకవర్గ బాధ్యతలను అప్పగిస్తారని చర్చ జోరుగా సాగింది. ఆ ఊహాగానాలకు తెర దించుతూ రాబోయే ఎన్నికల్లో ఆరో సారి పోటీ చేయడం ఖాయమని తాజాగా ఆయన చేసిన ప్రకటన పుకార్లకు ఫుల్ స్టాఫ్ పెట్టినట్లయింది. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో విస్తరించి ఉన్న బాన్సువాడ నియోజకవర్గంలో ఈ దఫా స్పీకర్, సిట్టింగ్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పోటీ చేయరనే ప్రచారం జోరుగా సాగింది. అందుకు అనుగుణంగా కామారెడ్డి జిల్లాలోని పాత రెండు మండలాల బాధ్యతలను ప్రస్తుత డీసీసీబీ చైర్మన్ భాస్కర్ రెడ్డికి, నిజామాబాద్ జిల్లాలోని పాత రెండు మండలాలను తనయుడు సురేందర్ రెడ్డికి అప్పగించారు. రెండు జిల్లాల్లో విస్తరించిన నియోజకవర్గ బాధ్యతలను వారే చూసుకునేవారు. చదవండి:వరంగల్: చెప్పులతో కొట్టుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు! ఈ నియోజక వర్గంలో సెటిలర్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. గిరిజన లంబాడా తండాలు కూడా బాగా ఉంటాయి. రెండు జిల్లాల పరిధిలో నియోజక వర్గం ఉంటుంది. అయితే సీనియర్ ఎమ్మెల్యే గా మంత్రిగా స్పీకర్ గా బాధ్యతలు చేపట్టి ఎదురులేని లీడర్ గా ఎదిగారు పోచారం. సభాపతిగా హైదరాబాద్ కు పరిమితమవడం, వయస్సు మీద పడడంతో కొంత ఇబ్బంది పడి.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకున్నారని చర్చ జరిగింది. 2018లోనే తనకు టికెట్ వద్దని కోరినప్పటికీ కేసీఆర్ వినకుండా పోచారానికే టికెట్ ఇవ్వడంతో తప్పనిసరిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. సీఎం ఆ తర్వాత ఆయనకు సభాపతి బాధ్యతలను అప్పగించారు. సభాపతి కావడంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉన్నా.. పోచారం ఇటీవల కాలంలో మళ్లీ పార్టీ కార్యక్రమాల్లో, ఆత్మీయ సమ్మేళనాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. సర్వేల్లో ఏం తేలింది? సీఎం కేసీఆర్ ఉమ్మడి జిల్లాలో చేసిన సర్వేల్లో నాలుగు నియోజకవర్గాల్లో వ్యతిరేకత ఉందని సర్వే రిపోర్టులు వచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే క్యాండేట్ మారితే ఓడిపోయే నియోజకవర్గాల్లో బాన్సువాడ కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. అందులో భాగంగానే సీఎం కేసీఆర్ ఈసారి కూడా పోచారంనే పోటీ చేయాలని కోరినట్లు తెలిసింది. ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత తనయుల భవిష్యత్తు గురించి బాధ్యత తీసుకుంటానని కేసీఆర్ హామీ ఇవ్వడంతో పోచారం శ్రీనివాస్ రెడ్డి మరోసారి పోటీకి సిద్దమయ్యారు. సై అనక తప్పలేదా? బాన్సువాడ నియోజకవర్గంలో బీజేపీ క్యాండిడెట్ గా ప్రకటించిన మల్యాద్రి రెడ్డికి సెటిలర్ల మద్దతు దొరికిందని తెలుస్తోంది. అందుకే సీఎం కేసీఆర్ పోచారంతోనే పోటీ చేయించాలని నిర్ణయం తీసుకున్నారనే వాదనలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అక్కడ పోటీ చేసినా వారి పోటీ వల్ల బీఆర్ఎస్ కే బలం చేకూరుతుందనే వాదనలు లేకపోలేవు. బాన్సువాడ నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంతో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉండటం పోచారం కు ప్లస్ పాయింట్. పైగా సమస్యలను ఓపిగ్గా విని పరిష్కరిస్తారని, నియోజకవర్గంలో పనులు కూడా చేస్తారని పోచారానికి మంచి పేరుంది. కానీ, ఈసారి కుమారులు పోటీ చేస్తే జనాల నుంచి మద్దతు పూర్తి స్థాయిలో దొరకదనే విషయం సర్వేలో తేలినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఈ దఫా గెలిచి తరవాత వారసత్వానికి బాధ్యతలు అప్పగించే ఆలోచనతో పోటీకి సై అనాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది. చదవండి:కేసీఆర్ సర్కార్‌పై అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం -
స్పీకర్ నాకు తండ్రిలాంటి వారు: ఈటల రాజేందర్
సాక్షి, హైదరాబాద్: ప్రజాస్వామ్యం ముసుగులో సీఎం కేసీఆర్ రాచరిక పాలన చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు, ఇప్పటికీ ఛాలెంజ్ చేస్తున్నానని, తనను ఎక్కడి నుంచి పోటీ చేయమంటారో సీఎం చెప్పాలని డిమాండ్ చేశారు. చావుకి అయిన సిద్ధపడతాను కానీ రాజీపడనని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నష్టం మీద సందర్శనకు ప్రతిపక్షాలకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ తనకు తండ్రి లాంటి వారని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ప్రజల సమస్యల మీద స్పీకర్ చర్చ జరపాలని కోరారు. స్పీకర్ సభ అధిపతి అని, అందరి హక్కులు కాపాడాలని సూచించారు. అత్యుననతమైన పదవిలో ఉండే వ్యక్తి స్పీకర్, పార్టీలకు అతీతంగా సభ్యలకు అవకాశం కల్పించడం శాసన సభ స్పీకర్ పని అని అన్నారు. ఇప్పటి వరకు తనకు నోటీసులు అందలేదని, నోటీసులు వస్తే అప్పుడు సమాధానం చెప్తానన్నారు ‘నలుగురు సీఎంల దగ్గర పని చేశా. ఎప్పుడు ఇలా వాళ్లు వ్యవహరించలేదు. స్పీకర్ ఇటువంటి చర్యలకు పాల్పడలేదు. హుందాగా బతికిన వ్యక్తి స్పీకర్. అలాంటి వ్యక్తిని అగౌరవపరిచింది మీరు. నేను కాదు. మీరే క్షమాపణలు చెప్పాలి. మా హక్కులను కాలా రాసే స్పీకర్‌ను నేను మర మనిషి అన్నాను. మేము ఏంటనేది ప్రజలు డిసైడ్ చేస్తారు మీరెవరు. శాసన సభ సమావేశాలు ఉన్నాయని ముందస్తుగా సమచారం లేదు. మేము స్పీకర్‌కు దీని మీద కాల్ చేసి అడిగాం. అణచివేతకు అన్యాయానికి గురైన వారి పక్షాన బీజేపీ నిలబడతుంది.’ అని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. చదవండి: కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు -
స్పీకర్‌పై చర్యలు తీసుకోవాలి: బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి తీరుపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ నిప్పులు చెరిగారు. రాజ్యాంగబద్ద పదవిలో ఉంటూ రాజకీయ విమర్శలు చేస్తారా అంటూ స్పీకర్‌పై మండిపడ్డారు. సభలో చర్చ జరగాలని, స్పీకర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీని చూస్తేనే కేసీఆర్ గజగజ వణికిపోతున్నారని విమర్శించారు. అసెంబ్లీ నిర్వహించాలంటే భయపడుతున్నాడని దుయ్యబట్టారు. పార్లమెంట్ కన్వీనర్లు, జాయింట్ కన్వీనర్లు, జిల్లా ఇంఛార్జ్‌లతో బండి సంజయ్ బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ‘ప్రజా సమస్యలపై చర్చించకుండా కుట్ర చేస్తున్నారు. ప్రజా క్షేత్రంలోనే తేల్చుకుంటాం. హిందూ పండుగలకు ప్రాధాన్యత లేకుండా కేసీఆర్ మహా కుట్ర చేస్తున్నాడు. షరతుల పేరుతో కన్ఫ్యూజ్ చేయడం అందులో భాగమే. హిందూ సమాజమంతా సంఘటితం కావాల్సిందే’ నని బండి సంజయ్ పిలుపునిచ్చారు. చదవండి: స్పీకర్‌పై చర్యలు తీసుకోవాలి: బండి సంజయ్ -
స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు.. ఈటల రాజేందర్‌కు నోటీసులు?
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు తెలంగాణ శాసనసభ స్మీకర్ కార్యాలయం నుంచి నోటీసులు జారీ అయ్యే అవకాశం ఉంది.. అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని మర మనిషిగా పేర్కొంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన క్రమంలో ఈటల రాజేందర్‌కు నోటీసులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా సీఎం చెప్తే చేసే మరమనిషిలా కాకుండా స్పీకర్ గతంలో ఉన్న సంప్రదాయాలను కొనసాగించాలని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మంగళవారం అన్నారు. బీఏసీ భేటీకి బీజేపీ సభ్యులను పిలవకపోవడం ఏంటని ప్రశ్నించారు. ముఖ్యమంత్రులు ఉంటారు పోతారు.. అసెంబ్లీ మాత్రం శాశ్వతంగా ఉంటుందన్న విషయం మరిచిపోవద్దని హితవు పలికారు. ‘స్పీకర్ మరమనిషిలా పని చేస్తున్నారు. సభా సంప్రదాయాలను మర్చిపోతున్నారు. దీన్ని కాలరాసే అధికారం సీఎంకు లేదు’ అని వ్యాఖ్యా నించారు. ఐదు నిమిషాలు సభ నడిపి ప్రజా సమస్యల నుంచి తప్పించుకున్నా ప్రజాక్షేత్రంలో తప్పించుకోబోరని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో 80, 90 రోజులపాటు, తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా 20 రోజులపాటు, వర్షాకాల సమావేశాలు నుంచి 20 రోజుల పాటు జరిగేవని, అలాంటప్పుడు కేవలం ఐదు నిమిషాలు, మూడు రోజుల పాటు జరగడం ఏంటని ప్రశ్నించారు. రఘునందన్‌రావు మాట్లాడుతూ ముగ్గురం ఎమ్మెల్యేలుగా ఉన్న మమ్మల్ని బీఏసీ సమావేశానికి పిలవకపోవడం ఏంటని నిలదీశారు. శాసనసభలో ఏమైనా కొత్త రూల్స్ ప్రవేశపెట్టారా? అని అడిగారు. చదవండి: రాజాసింగ్ బెయిల్‌పై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు -
ప్రిన్సిపల్ కాళ్లు మొక్కుతానన్న స్పీకర్ సాబ్
-
హైకోర్టు తీర్పును తుంగలో తొక్కారు..
-
సీఎల్పీ విలీనంపై స్పీకర్‌కు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో కాంగ్రెస్ శాసనసభా పక్షాన్ని టీఆర్ఎస్లో విలీనం చేయడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ దాఖలైన తాజా వ్యాజ్యంలో రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ కింద ట్రిబ్యునల్ అధిపతిగా వ్యవహరించే శాసనసభ స్పీకర్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. శాసనసభ కార్యదర్శి, కేంద్ర ఎన్నికల సంఘం, టీఆర్ఎస్ పార్టీలోకి ఫిరాయించిన 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీ ఫిరాయించిన పైలట్ రోహిత్‌రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, డి.సుధీర్‌రెడ్డి, హరిప్రియ, సబితా ఇంద్రారెడ్డి, ఉపేందర్‌రెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డి, రేగ కాంతారావు, ఆత్రం సక్కు, వనమా వెంకటేశ్వరరావు, జె.సురేందర్, చిరుమర్తి లింగయ్యలకు నోటీసులు ఇచ్చింది. గతంలో ఇదే తరహాలో దాఖలైన మరో రెండు వ్యాజ్యా లతో కలిపి ఈ వ్యాజ్యాన్ని విచారిస్తామని ధర్మాసనం పేర్కొంది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. శాసనమండలిలో కాంగ్రెస్ పక్షాన్ని టీఆర్ఎస్లో విలీనం చేయడం చట్ట వ్యతిరేకంగా ప్రకటించాలని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ ఇప్పటికే రిట్ దాఖలు చేశారు. ఈ కేసులో పదో షెడ్యూల్ నిబంధనల ప్రకారం ట్రిబ్యు నల్గా వ్యవహరించే మండలి చైర్మన్‌కు, ఇతర ప్రతి వాదులకు హైకోర్టు మంగళవారం నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. మండలిలో మాదిరిగా అసెంబ్లీలోనూ చేయనున్నారంటూ గత ఏప్రిల్ 29న కాంగ్రెస్ నాయకులు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క దాఖలు చేసిన కేసులోనూ అదే తరహా నోటీసులు శాసనసభ స్పీకర్, ఇతరులకు జారీ అయ్యా యి. బుధవారం జరిగిన తాజా రిట్‌ను కూడా ఉత్తమ్, భట్టిలే దాఖలు చేశారు. ఈ కేసులన్నింటినీ కలిపి విచారిస్తామని ధర్మాసనం తెలిపింది. -
స్పీకర్ పదవికి నామినేషన్ దాఖలు చేసిన పోచారం
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ శాసనసభాపతి పదవికి సీనియర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి నామినేషన్ దాఖలుచేశారు. అసెంబ్లీ కార్యదర్శి కార్యాలయంలో ఆయన నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌తో పాటు, కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క, ఎంఐఎం ఎమ్మెల్యే బలాల హాజరయ్యారు. స్పీకర్‌గా పోచారంకు అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. దీంతో శాసనసభపతిగా పోచారం ఎన్నిక ఏకగ్రీవం కానుంది. గురువారం ఉదయం పోచారం పేరును ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఖరారు చేశారు. కాంగ్రెస్ పార్టీ కూడా స్పీకర్ ఎన్నికకు మద్దతు తెలపడంతో పోచారం ఎన్నిక ఏకగ్రీవం అయింది. దీనిపై చర్చించడానికి ఉదయం అసెంబ్లీలో కేసీఆర్‌తో పోచారం భేటీ అయ్యారు. బాన్సువాడ అసెంబ్లీ స్థానం నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన పోచారం శ్రీనివాస్‌రెడ్డి పలు కీలక శాఖలకు మంత్రిగా పనిచేశారు. సీనియర్ శాసనసభ్యుడిగా శ్రీనివాస్‌రెడ్డికి మంచి అనుభవం ఉంది. ఆంగ్లంపై పట్టు ఉండటంతో సభ నిర్వహణలో కూడా ఇబ్బందులు ఉండవనే ఉద్దేశంతో శ్రీనివాస్‌రెడ్డి వైపు కేసీఆర్ మొగ్గు చూపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరిన పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉంటున్నారు. కేసీఆర్ గత ప్రభుత్వంలోనూ పోచారానికి కీలకమైన వ్యవసాయ శాఖను అప్పగించారు. -
స్పీకర్ మధుసూదనాచారికి తప్పిన ప్రమాదం
-
స్పీకర్ మధుసూదనాచారికి తప్పిన ప్రమాదం
సాక్షి, జయశంకర్ భూపాల్పల్లి: తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారికి తృటిలో ప్రమాదం తప్పింది. భూపాలపల్లి జిల్లాలోని గణపురం శివారులో స్పీకర్ కాన్వాయిలోని వాహనాన్ని లారీ ఢీకొట్టింది. తన నియోజవర్గమైన గణపురంలో పల్లెనిద్ర ముగించుకుని భూపాలపల్లికి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. లారీ డ్రైవర్ తప్పిదం వల్లే ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. లారీ ఢీకొనడంతో కాన్వాయిలోని వాహనం రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. అంతకుముందు గణపురం మండల కేంద్రంలో మధుసూదనాచారి పల్లె నిద్ర చేశారు. ఉదయం స్థానిక ప్రజలతో కలిసి నడుచుకుంటూ గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. -
మధుసూదనాచారిపై సోషల్ మీడియాలో సెటైర్లు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారిపై సోషల్‌మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. తాజాగా ఆయన పాలాభిషేకం వీడియో ఒకటి నెట్లో వైరల్ అయిన విషయం తెలిసిందే. ప్రజాప్రతినిధి అయివుండి ఇలాంటి పనులను ప్రొత్సహించటమేంటని విమర్శలు గుప్పిస్తున్నారు. ‘పాలను వృధా చేశారు. తెలంగాణలో కనీసం వాటిని కొనలేని ప్రజలు ఉన్నారని గుర్తించండి’ అని కొందరు.. ‘సాధారణంగా సినిమా వాళ్లకు కటౌట్లకు ఇలాంటి పాలాభిషేకం చూస్తుంటాం. కానీ, ఇప్పుడది వేరే మలుపు తీసుకున్నట్లుంది’ అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇంకొందరైతే ఓ మెట్టుదిగి ఆయనపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తెలంగాణలో కొత్తగా గ్రామపంచాయతీలు ఏర్పాటుచేసినందుకు కృతజ్ఞతగా తన నియోజకవర్గం భూపాలపల్లిలోని పెద్దపల్లి గ్రామంలో అనుచరులు మధుసూదనాచారికి పాలాభిషేకం చేసిన విషయం తెలిసిందే. Damn.... is it this hard to see the wastage.... Ironic making a fool out of themselves on April Fool's day... — Manisha Palai (@manishapalai) 1 April 2018 What a wastage of milk! You do realize Telangana has a lot of people who actually don't have money to afford it. — Dr. Sugandha (@sugandhakohli) 1 April 2018 -
శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ స్పీకర్
సాక్షి, తిరుమల : తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని తెలంగాణ శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి గురువారం ఉదయం దర్శించుకున్నారు. స్పీకర్ కుటుంబసభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణ స్పీకర్‌కు టీటీడీ అధికారులు దగ్గరుండి స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులచే ఆశీర్వచనం అందించి, స్వామివారి తీర్థ ప్రసాదాలు, పట్టువస్త్రాలను స్పీకర్ కు అందజేశారు. శ్రీనివాసుని దర్శించుకోవడం, స్వామివారి సన్నిధిలో గడపడం చాలా ఆనందంగా ఉందని మధుసూదనాచారి తెలిపారు. -
తెలంగాణ బీఏసీ సమావేశం
-
పార్టీ ఫిరాయింపులపై సుప్రీం కీలక ఆదేశాలు
-
పార్టీ ఫిరాయింపులపై సుప్రీం కీలక ఆదేశాలు
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ల విషయంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు వెలువరించింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఆయా పార్టీలు చేసిన ఫిర్యాదులను ఎప్పటిలోగా పరిష్కరిస్తారో నవంబర్ 8వ తేదీ లోగా చెప్పాలని తెలంగాణ స్పీకర్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఎమ్మెల్యే సంపత్ కుమార్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ విషయమై తమకు ఇంతవరకు నోటీసులు కూడా ఇవ్వలేదని తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. కానీ తాము ఇప్పటికే ఆ నోటీసులను పంపామని పిటిషనర్ తరఫు న్యాయవాది అన్నారు. ఈ నేపథ్యంలో సుప్రీం ధర్మాసనం.. తెలంగాణ స్పీకర్ ఎంత గడువులోగా చర్యలు తీసుకుంటారో నవంబర్ 8వ తేదీలోగా స్పష్టం చేయాలని తెలిపింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో పార్టీలు మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడటం ఖాయమని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. ఒకవేళ స్పీకర్ నవంబర్ 8లోగా తేల్చకపోతే మాత్రం సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని స్పష్టమైన గడువు విధిస్తుందని, అప్పటికీ ఏ విషయమూ తేలకపోతే సుప్రీంకోర్టే వారిపై అనర్హత వేటు వేయడం కూడా తప్పకపోవచ్చని అంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో వివిధ పార్టీల నుంచి 25 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు ఫిరాయించిన నేపథ్యంలో ఆరు నెలల్లోగా ఉప ఎన్నికలు రావడం తప్పదని కాంగ్రెస్ భావిస్తోంది. మరోవైపు ఇదే అంశం ఆంధ్రప్రదేశ్‌కు కూడా వర్తించే అవకాశం ఉంటుంది. అక్కడ సైతం వైఎస్ఆర్సీపీ నుంచి పలువురు ఎమ్మెల్యేలు అధికార తెలుగుదేశం పార్టీలో చేరడం, వారిపై అనర్హత వేటు వేయాలంటూ ప్రతిపక్షం ఇచ్చిన ఫిర్యాదులను ఇంతవరకు పరిష్కరించకపోవడం తెలిసిందే. -
ఫిరాయింపులపై హైకోర్టు కీలక ఆదేశాలు
హైదరాబాద్: ఎమ్మెల్యేల అనర్హతపై 90 రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారిని హైకోర్టు ఆదేశించింది. తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్షం (టీ-టీడీఎల్పీ) టీఆర్ఎస్లో విలీనమైనట్లు అసెంబ్లీ కార్యదర్శి ఈ ఏడాది మార్చి 10న జారీచేసిన బులెటిన్ అమలును నిలిపేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఈ వ్యాజ్యం పై బుధవారం హైకోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. పార్టీ ఫిరాయించిన 12 మంది ఎమ్మెల్యేలపై దాఖలైన ఫిర్యాదులను పరిష్కరించకుండానే టీఆర్ఎస్లో టీటీడీఎల్పీ విలీనమైనట్లు అసెంబ్లీ కార్యదర్శి బులెటిన్ జారీచేయడం రాజ్యాంగ విరుద్ధమని, దాన్ని కొట్టేయాలంటూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి హైకోర్టులో అనుబంధ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యం తేలేదాకా బులెటిన్ అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. -
ఫిరాయింపులపై హైకోర్టు కీలక ఆదేశాలు
-
చంద్రగిరి కోటను సందర్శించిన స్పీకర్
చంద్రగిరి: ఏపీలోని చంద్రగిరి కోటను అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి ఆదివారం సందర్శించారు. శ్రీకృష్ణదేవరాయలు నిర్మించిన ఈ కోటలోని ఆయుధాలు, అలనాడు ఆరాధించిన దేవేరుల శిలా విగ్రహాలను పరిశీలించారు. రాయల కాలం నాటి వస్తువులతో పాటు బ్రిటిష్ కాలం నాటి నాణేలు, పత్రాలను నేటి తరం వారికి పరిచయం చేయడానికి పురావస్తు శాఖ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. -
చంద్రగిరి కోటలో తెలంగాణ స్పీకర్
ఆంధ్రప్రదేశ్‌లోనే ప్రసిద్ధి చెందిన కోటల్లో ఒకటైన చంద్రగిరి కోటను ఆదివారం తెలంగాణ స్పీకర్ మధుసూదనా ఆచారి ఆదివారం సందర్శించారు. శ్రీక్రిష్ణదేవరాయులు నిర్మించిన కోటలో అలనాటి ఆయుధాలు, ఆరాధించిన దేవేరులను శిలా విగ్రహాలను పరిశీలించారు. అలాగే రాయల వారి కోట పరిసరాలలో ఉన్న పార్కు, ఆహ్లాదరకమైన వాతావరణాన్ని చూసి సిబ్బంది పనితనాన్ని మెచ్చుకున్నారు. ఈ సందర్భంగా రాయల వారి కాలం నాటి వస్తువులతో పాటు బ్రిటీషు కాలం నాటి నాణేలు, పత్రాలను నేటి తరంకు అందించేందుకు పురావస్తుశాఖ వారు చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి కోట అధికారి మోహన్, రమేష్ తదితరులు ఉన్నారు. -
స్పీకర్ నిర్ణయంపై కోర్టును ఆశ్రయిస్తాం
టీ టీడీపీ కార్యాలయం వ్యవహారంపై రేవంత్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్ : తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే టీ టీడీఎల్పీ కార్యాలయాన్ని ఇతరులకు కేటాయిస్తూ తెలంగాణ స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేస్తామని ఆ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి చెప్పారు. అసెంబ్లీ ప్రాంగణంలో టీ టీడీఎల్పీ కార్యాలయం కొనసాగుతున్న 107, 110 నంబర్ గదులను అసెంబ్లీ క మిటీల చైర్మన్లకు కేటాయించడాన్ని నిరసించారు. మంగళవారమిక్కడ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, పార్టీ నేత రమేశ్‌రాథోడ్‌లతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. తమకు నోటీసులు ఇవ్వకుండా, గదులను తాము ఖాళీ చేయకుండానే ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. 107 నంబర్ గదిని ఉమెన్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ రేఖానాయక్‌కు, 110 నంబరు గదిని మైనారిటీ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ షకీల్‌కు కేటాయిస్తూ ఈనెల ఒకటో తేదీన స్పీకర్ మధుసూదనాచారి నిర్ణయం తీసుకున్నారని వివరించారు.తమకు జరిగిన అన్యాయంపై కాంగ్రెస్, బీజేపీ నేతలు సంఘీభావం తెలిపారని, దీనిపై న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు. -
రాఘవేంద్ర స్వామి సేవలో స్పీకర్ మధుసూదనాచారి
కర్నూలు జిల్లా మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్రస్వామిని సోమవారం తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి దర్శించుకున్నారు. అలాగే, తెలంగాణ రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ నిరంజన్‌రెడ్డి, కర్నాటక రాష్ట్రం కడూరు వై.ఎస్.వి దత్త, కర్నూలు డీఐజీ రమణకుమార్, జార్ఖండ్ ఎస్పీ రమేష్ వేర్వేరు సమాయాల్లో మంత్రాలయం వచ్చారు. వీరు ముందుగా గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకున్నారు. అనంతరం శ్రీ రాఘవేంద్రస్వామి మూలబృందావనంను దర్శించుకున్నారు. వీరికి శ్రీ మఠం పీఠాధిపతి ఆశీర్వాచనం అందజేశారు. -
'స్పీకర్ నిర్ణయంపై కామెంట్ కరెక్ట్ కాదు'
హైదరాబాద్: టీడీపీ చెందిన 12 మంది ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ లో విలీనం చేయడం వెనుక తమ పాత్ర లేదని తెలంగాణ మున్సిపల్, పట్టణాభివృద్ది, పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు(కేటీఆర్) తెలిపారు. విలీనంపై స్పీకర్ తీసుకున్న నిర్ణయంలో తమ ప్రమేయం లేదని స్పష్టం చేశారు. అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే స్పీకర్ మధుసూదనాచారి నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. స్పీకర్ నిర్ణయంపై కామెంట్ చేయడం సమంజసం కాదని కేటీఆర్ అన్నారు. టీడీపీ నుంచి టీఆర్ఎస్ లో చేరిన 12 మంది టీడీపీ ఎమ్మెల్యేలు రాసిన లేఖ ఆధారంగా స్పీకర్ గురువారం 'విలీనం' నిర్ణయం తీసుకున్నారు. టీఆర్ఎస్ఎల్పీ సభ్యులుగా గుర్తించేందుకు అంగీకరించి, టీఆర్ఎస్ సభ్యులతో పాటు అసెంబ్లీలో సీట్ల కేటాయించారు. టీడీపీ ఎమ్మెల్యేల చేరికతో శాసనసభలో టీఆర్ఎస్ బలం 85కు పెరిగింది. -
విఐపి రిపోర్టర్ - తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారి
-
‘చాంబర్ల’పై స్పీకర్ల ఏకాభిప్రాయం
* ప్రాధాన్యతా క్రమంలో కేటాయింపులు * సమస్యలు తలెత్తితే మళ్లీ సమావేశం * ఆగస్టు 18 నుంచి 13 వరకు ఏపీ బడ్జెట్ సమావేశాలు * ఆగస్టు రెండో వారంలో తెలంగాణ బడ్జెట్ భేటీలు * సమన్వయంతో ముందుకెళ్తాం: కోడెల, మధుసూదనాచారి సమన్వయంతో ముందుకెళ్తాం: ప్రస్తుతం ఏర్పడిన సమస్యలపై చర్చించి ఏకాభిప్రాయానికి వచ్చాం. స్పీకర్లు, చైర్మన్లు, ఇలా ప్రాధాన్యత క్రమంలో కేటాయింపులు పూర్తిచేస్తాం. అంతిమంగా రెండు రాష్ట్రాల చట్టసభలు బాగా పనిచేసే వాతావరణం ఉండాలని భావించాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చట్టసభల మధ్య ఎలాంటి వివాదాలు లేవు. పవిత్రమైన సభల్లో ప్రజాసమస్యల పైనే చర్చలు జరగాలి. సమస్యలపై ఇప్పటికే మూడుసార్లు చర్చించాం. ఒకరిపై ఒకరం ఏనాడూ ఏమాటా అనుకోలేదు. రాష్ట్రాలుగా విడివడినా ఇరు ప్రాంతాల వారమంతా ఒక్కటే. - మధుసూదనాచారి, తెలంగాణ స్పీకర్ ఏకాభిప్రాయానికి వచ్చాం అసెంబ్లీ, మండలి ప్రాంగణాల్లో వసతుల ఏర్పాటు, సమావేశాల సమయంలో ఇబ్బం దులు లేకుండా తీసుకోవలసిన చర్యలపై ఏకాభిప్రాయానికి వచ్చాం. పరస్పర సహకారంతో రెండు ప్రాంతాల బడ్జెట్ సమావేశాలను సజావుగా నిర్వహించేలా చూస్తాం. సమస్యలున్నా వాటిపై ఎప్పటికప్పుడు చర్చిం చుకొని పరిష్కరిస్తాం. బడ్జెట్ సమావేశాలు ఆగస్టు రెండో వారంలో ఉండవచ్చు. బడ్జెట్ సమావేశాలైనందున కొన్ని రోజులు రెండు అసెంబ్లీలు, మండళ్ల సమావేశా లు ఒకేసారి జరగాల్సి రావచ్చని అపుడు సమస్యలు రాకుండా తీసుకోవలసిన చర్యలపైనా ఓ అవగాహనకు వచ్చాం. - కోడెల శివప్రసాద్, ఏపీ స్పీకర్ సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ చట్టసభలమధ్య నెలకొన్న చాంబర్ల కేటాయింపు వివాదం ఓ కొలిక్కి వచ్చింది. మంగళవారం ఇరు రాష్ట్రాల స్పీకర్లు, మండలి చైర్మన్లు సమావేశమై ఈ వివాదం పరిష్కారంపై ఏకాభిప్రాయానికి వచ్చారు. అసెంబ్లీ ఒకటో నంబర్ కమిటీ హాలులో జరిగిన ఈ సమావేశంలో ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, తెలంగాణ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, ఏపీ మండలి చైర్మన్ డాక్టర్ ఎ.చక్రపాణి, తెలంగాణ మండలి చైర్మన్ కె.స్వామిగౌడ్, ఇరు రాష్ట్రాల శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రులు యనమల రామకృష్ణుడు, టి.హరీష్‌రావు, ఇరు రాష్ట్రాల అసెంబ్లీ కార్యదర్శులు రాజసదారాం, కె.సత్యనారాయణ (ఇన్చార్జి)లు పాల్గొన్నారు. అసెంబ్లీ స్పీకర్లు, మండలి చైర్మన్లు, డిప్యూటీ స్పీకర్లు, వైస్చైర్మన్లు, ప్రతిపక్షనేతలు, మంత్రులు, చీఫ్ విప్‌లు, విప్ లు ఇలా ప్రాధాన్యతా క్రమంలో ముందు చాం బర్లను ఖరారు చేయాలని నిర్ణయించారు. ఆ తరువాత ఇతరనేతలకు, సభ్యులకు అసెంబ్లీలో వసతితో పాటు క్వార్టర్ల కేటాయింపు అంశంపై చర్చించారు. ఇరురాష్ట్రాల అసెంబ్లీ సమావేశాలు ఒకేసారి జరగకుండా వేర్వేరు తేదీల్లో నిర్వహించడం, ఒకే సారి జరిగే రోజుల్లో తలెత్తే సమస్యలపైనా అవగాహనకు వచ్చారు. అవసరమైతే మరోసారి భేటీ... అసెంబ్లీ, మండలి ఆవరణల్లో ఉన్న భవనాలు, వాటిలో అందుబాటులోఉన్న గదులు, ప్రస్తుతం చాంబర్లు కేటాయింపు కావలసిన వివిధ హోదాల్లోని నేతలు, తదితర అంశాలతో నివేదికలను అసెంబ్లీల కార్యదర్శులు సమావేశం ముందుం చారు. కార్యదర్శులు పోటాపోటీగా ఇచ్చిన సర్క్యులర్లనూ స్పీకర్లు సమీక్షించారు. ముందు గా ప్రాధాన్యత ప్రకారం కేటాయింపులు చేయాలని, చివర్లో ఎక్కడైనా సమస్యలు ఏర్పడితే మరోసారి సమావేశమై పరిష్కరించుకోవాలని అభిప్రాయానికి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్‌కు కేటాయించిన చాంబర్‌నే తెలంగాణ డిప్యూటీ స్పీకర్‌కు ఇచ్చిన అంశం ప్రస్తావనకు వచ్చింది. ఈ చాంబర్ ఏపీ అసెంబ్లీ సమావేశమందిరాన్ని అనుకొని ఉన్నందున బుద్ధప్రసాద్‌కు కొనసాగించాలన్న అభిప్రాయానికి వచ్చా రు. తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డికి వేరే చాంబర్‌ను కేటాయించనున్నారు. తెలంగాణ మండలి చైర్మన్ స్వామిగౌడ్‌కు ఇంకా చాంబర్ కేటాయించనందున ముందుగా ప్రాధాన్యతా క్రమంలో కేటాయింపులు చేసుకుంటూ రావాలన్న అభిప్రాయానికి వచ్చారు. తెలంగాణ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేత జానారెడ్డి, ఏపీ అసెంబ్లీకి సంబంధించి ప్రధాన ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డిలకు ఇటీవల కేటాయించిన గదులు, వాటిపై ఏర్పడిన వివాదం అంశంపైనా చర్చించారు. శాసనసభ సచివాలయంలో ఓమూలనున్న చిన్నగదిని వైఎస్సార్ కాంగ్రెస్‌కు కేటాయించడంపై విమర్శలు రావడంతో దాన్ని మార్పు చేయాలని నిర్ణయించారు. ఏపీ అసెంబ్లీ కార్యదర్శి సత్యనారాయణ (ఇన్చార్జి) వినియోగిస్తున్న చాంబర్‌ను ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డికి కేటాయించనున్నారు. తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శికి ఆ రాష్ట్ర స్పీకర్ చాంబర్ పక్కనే ఉన్న (ప్రతిపక్షనేతగా చంద్రబాబు వినియోగించిన) చాంబర్‌ను కేటాయించాలని భావిస్తున్నారు. ఇంకా ఇతరులకు చాంబర్ల కేటాయింపుపై ఒకటిరెండురోజుల్లోనే తుది నిర్ణయం తీసుకోనున్నారు. బడ్జెట్ సమావేశాల్లో కొన్ని రోజుల పాటు ఒకేసారి రెండు అసెంబ్లీల భేటీల సమయంలో ఇరుప్రాంతాల ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడేం దుకు వేర్వేరు ప్రాంతాల్లో మీడియా పాయింట్ల ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వేర్వేరు తేదీల్లో బడ్జెట్ సమావేశాలు రెండు రాష్ట్రాల అసెంబ్లీ సమావేశాల నిర్వహణ తేదీలపైనా సమావేశంలో ప్రస్తావన వచ్చింది. ఏపీ అసెంబ్లీ సమావేశాలను ఈ నెల 18 నుంచి సెప్టెంబర్ 13వరకు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోందని ఆర్థికమంత్రి యనమల వివరించారు. రెండు సమావేశాలు ఒకేసారి జరగకుం డా ఉండేలా ఆ తరువాత తేదీల్లో తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభిస్తే బాగుంటుంద న్న అభిప్రాయం వ్యక్తంచేశారు. సెప్టెంబర్ రెండోవారంలో తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభించే అవకాశంపై ప్రభుత్వంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆ రాష్ట్ర నేతలు పేర్కొన్నారు.