
ఫిరాయింపులపై హైకోర్టు కీలక ఆదేశాలు
హైదరాబాద్: ఎమ్మెల్యేల అనర్హతపై 90 రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారిని హైకోర్టు ఆదేశించింది. తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్షం (టీ-టీడీఎల్‌పీ) టీఆర్‌ఎస్‌లో విలీనమైనట్లు అసెంబ్లీ కార్యదర్శి ఈ ఏడాది మార్చి 10న జారీచేసిన బులెటిన్ అమలును నిలిపేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఈ వ్యాజ్యం పై బుధవారం హైకోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది.
పార్టీ ఫిరాయించిన 12 మంది ఎమ్మెల్యేలపై దాఖలైన ఫిర్యాదులను పరిష్కరించకుండానే టీఆర్‌ఎస్‌లో టీటీడీఎల్‌పీ విలీనమైనట్లు అసెంబ్లీ కార్యదర్శి బులెటిన్ జారీచేయడం రాజ్యాంగ విరుద్ధమని, దాన్ని కొట్టేయాలంటూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి హైకోర్టులో అనుబంధ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యం తేలేదాకా బులెటిన్ అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు.