'స్పీకర్ నిర్ణయంపై కామెంట్ కరెక్ట్ కాదు' | minister kcr not to comment on speaker decision | Sakshi
Sakshi News home page

'స్పీకర్ నిర్ణయంపై కామెంట్ కరెక్ట్ కాదు'

Published Fri, Mar 11 2016 4:06 PM | Last Updated on Fri, Mar 22 2019 6:17 PM

'స్పీకర్ నిర్ణయంపై కామెంట్ కరెక్ట్ కాదు' - Sakshi

'స్పీకర్ నిర్ణయంపై కామెంట్ కరెక్ట్ కాదు'

హైదరాబాద్: టీడీపీ చెందిన 12 మంది ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ లో విలీనం చేయడం వెనుక తమ పాత్ర లేదని తెలంగాణ మున్సిపల్, పట్టణాభివృద్ది, పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు(కేటీఆర్) తెలిపారు. విలీనంపై స్పీకర్ తీసుకున్న నిర్ణయంలో తమ ప్రమేయం లేదని స్పష్టం చేశారు. అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే స్పీకర్ మధుసూదనాచారి నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. స్పీకర్ నిర్ణయంపై కామెంట్ చేయడం సమంజసం కాదని కేటీఆర్ అన్నారు.

టీడీపీ నుంచి టీఆర్ఎస్ లో చేరిన 12 మంది టీడీపీ ఎమ్మెల్యేలు రాసిన లేఖ ఆధారంగా స్పీకర్ గురువారం 'విలీనం' నిర్ణయం తీసుకున్నారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ సభ్యులుగా గుర్తించేందుకు అంగీకరించి, టీఆర్‌ఎస్ సభ్యులతో పాటు అసెంబ్లీలో సీట్ల కేటాయించారు. టీడీపీ ఎమ్మెల్యేల చేరికతో శాసనసభలో టీఆర్‌ఎస్ బలం 85కు పెరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement