‘చంద్రబాబుపై ఎమ్మెల్యే అనిత కేసు పెట్టాలి’ | ysrcp leader golla baburao demands to mla anitha withdrawal of case over political punch ravikiran | Sakshi
Sakshi News home page

‘చంద్రబాబుపై ఎమ్మెల్యే అనిత కేసు పెట్టాలి’

Published Sat, May 13 2017 1:12 PM | Last Updated on Mon, Sep 17 2018 5:10 PM

‘చంద్రబాబుపై ఎమ్మెల్యే అనిత కేసు పెట్టాలి’ - Sakshi

‘చంద్రబాబుపై ఎమ్మెల్యే అనిత కేసు పెట్టాలి’

హైదరాబాద్‌ : పొలిటికల్‌ పంచ్‌ అడ్మిన్‌ రవికిరణ్‌పై పెట్టిన కేసు విషయంలో టీడీపీ ఎమ్మెల్యే అనిత పునరాలోచించుకోవాలని వైఎస్‌ఆర్‌ సీపీ నేత గొల్ల బాబురావు కోరారు. రవికిరణ్‌ వేసిన కార్టున్‌లో ఎక్కడా ఆమెను కించపరచలేదని ఆయన శనివారమిక్కడ అన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని దుర్వినియోగం చేయొద్దని, రాజకీయ ప్రోద్భలంతో కేసులు పెట్టడం వల్ల చట్టం దుర్వినియోగం అవుతుందని గొల్ల బాబురావు తెలిపారు. ఒకవేళ ఎమ్మెల్యే అనిత నిజంగా బాధపడి ఉంటే దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అన్న చంద్రబాబుపై కేసు పెట్టాలని ఆయన అన్నారు.

యావత్‌ దళిత జాతిని అవమానించేలా చంద్రబాబు మాట్లాడారని, ఆయనపై కేసు పెడితే దళిత జాతి హర‍్షిస్తుందన్నారు. అనితకు సోదరుడిగా ఇది తన సూచన మాత్రమే అని గొల్ల బాబురావు పేర్కోన్నారు. కాగా తనను కించపరిచేలా  కార్టున్స్‌ వేశారంటూ ఎమ్మెల్యే అనిత రవికిరణ్‌పై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో అతడిని అరెస్ట్‌ చేయగా, ప్రస్తుతం రవికిరణ్‌ విశాఖ జైల్లో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement