golla baburao
-
విశాఖ ఉక్కు కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలి
సీతమ్మధార: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిపివేసేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని టీడీపీ, జనసేన పార్టీలను వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు డిమాండ్ చేశారు. సోమవారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిపివేస్తామంటూ ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్‌కళ్యాణ్, బీజేపీ నేతలు హామీ ఇచ్చారు. నేను పార్లమెంట్లో ప్రశ్నించగా.. ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగదని ఆరి్థక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరి బదులిచ్చారు. పెట్టుబడుల ఉపసంహరణ జరుగుతుందని చెప్పారు. ఎంతోమంది ప్రాణత్యాగంతో ఏర్పడిన స్టీల్‌ప్లాంట్ కోసం పోరాడేందుకు రాష్ట్ర ప్రజలంతా సిద్ధం కావాలి. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర నాయకులు వెంటనే స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై వారి వైఖరిని స్పష్టం చేయాలి.కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గకపోతే.. టీడీపీ, జనసేన పారీ్టలు మద్దతు ఉపసంహరించుకోవాలి. విశాఖ ఎంపీ భరత్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు.. రాష్ట్ర ప్రజల కోసం ఎన్డీయే నుంచి తప్పుకుంటారో? ప్రజలను మోసం చేస్తారో? చెప్పాలి. టీడీపీ, జనసేన వెంటనే ఎన్డీయేకు మద్దతు ఉపసంహరించుకుంటే స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోతుంది. లేకపోతే లక్షలాది మంది ఉద్యోగులు, కారి్మకులు రోడ్డున పడతారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ పోరాటం కొనసాగిస్తుంది’ అని చెప్పారు. సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు ద్రోణంరాజు శ్రీవాత్సవ్, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పార్టీ మార్పు పుకార్లపై గొల్ల బాబూరావు రియాక్షన్
-
YSRCP: రాజ్యసభ పోటీలో ముగ్గురు అభ్యర్థులు వీరే..
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ముగ్గురు రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించింది. రాజ్యసభ బరిలో వైవీ సుబ్బారెడ్డి, గొల్లా బాబురావు, మేడా రఘునాథ రెడ్డి పేర్లను ఖరారు చేశారు. కాగా, రాజ్యసభ బరిలో నిలిచే ముగ్గురు అభ్యర్థుల పేర్లను వైఎస్సార్సీపీ తాజాగా ప్రకటించింది. వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు, మేడా రఘునాథ రెడ్డి ఎన్నికల్లో పోటీలో ఉండనున్నారు. ఇక, నేటి నుంచి ఈనెల 15వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరించనున్నారు. ఏపీలో మూడు రాజ్యసభ స్థానాలకు 27న పోలింగ్ జరుగనుంది. అనంతరం, అసెంబ్లీలో ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిసి గొల్ల బాబూరావు, మేడా రఘునాథరెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ముగ్గురు రాజ్యసభ అభ్యర్ధులను ముఖ్యమంత్రి అభినందించారు. మేడా రఘనాథరెడ్డి నందలూరు మండలం చెన్నయ్యగారి పల్లెకు చెందినవారు. మాజీ టీటీడీ బోర్డు మెంబర్ మేడా రామకృష్ణారెడ్డికి ముగ్గురు కుమారులలో రెండవ కుమారుడు మేడా రఘునాధరెడ్డి. మొదటి కుమారుడు సిట్టింగ్ రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి. మేడా రఘనాథరెడ్డి అదే మండలంలోని టంగుటూరులో విద్యాభ్యాసం పూర్తిచేశారు. డిగ్రి పూర్తైన వెంటనే 20 ఏళ్ల వయస్సులోనే బెంగుళూరు కేంద్రంగా నిర్మాణ రంగంలోకి ప్రవేశించారు. 2006లో MRKR కన్స్ట్రక్షన్స్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ప్రస్తుతం వ్యాపార రంగంలొనే కొనసాగుతున్నారు. ఇదీ చదవండి: కాంగ్రెస్ పాలనలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం : ఎంపీ విజయసాయిరెడ్డి -
నేనూ కూలీ బిడ్డనే: ఎమ్మెల్యే బాబూరావు
కోటవురట్ల: నేనూ కూలీ బిడ్డనే..కష్టమంటే ఏమిటో నాకు బాగా తెలుసు..కష్టపడి చదివా..మంచి ఉద్యోగం చేశా..ఉన్నతాధికారిగా ఊరూరూ తిరిగా..మీ సమస్యలు నాకు తెలుసు..మీ బిడ్డలకు మంచి భవిష్యత్ ఇవ్వాలంటే బాగా చదివించండి.. అంటూ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు ఉపాధి హామీ పథకం వేతనదారులను పలకరించారు. మండలంలోని నీలిగుంట, జి.సన్యాసిరాజుపాలెం గ్రామాల్లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన మార్గంమధ్యలో టి.జగ్గంపేటలో ఉపాధి పనులు చేస్తున్న వేతనదారులతో మాట్లాడారు. వారితో చేయి కలిపి పలుగూ పారా చేత బట్టారు. గునపంతో మట్టి తవ్వి వారి సమస్యలు తెలుసుకుంటూ పరిష్కారానికి వెనువెంటనే అధికారులకు ఆదేశాలిచ్చారు. పిల్లల భవిష్యత్‌పై దృష్టి సారించాలని విద్యతోనే ఉన్నతమైన జీవితం వస్తుందని వారికి హితబోధ చేశారు. పిల్లలను కూలీలుగా మార్చొద్దని, వారిని బడికి పంపి మంచి జీవితాన్ని ఇవ్వాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పిల్లల బంగారు భవితకు నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను సమూలంగా అభివృద్ధి చేసిందన్నారు. చదవండి: (రక్తపింజర పామును మింగేసిన నాగుపాము) -
తప్పుడు ప్రచారం ఆపండి
నక్కపల్లి (అనకాపల్లి జిల్లా): తాను వైఎస్సార్ కుటుంబానికి, వైఎస్సార్సీపీకి వీర విధేయుడినని, సీఎం జగన్ నిర్ణయమే తనకు శిరోధార్యమని పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు చెప్పారు. ఇకనైనా తప్పుడు ప్రచారం ఆపాలని మీడియాకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఆయన అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో మీడియాతో మాట్లాడారు. సోమవారం తాను చేసిన వ్యాఖ్యలను కొన్ని పత్రికలు, చానళ్లు వక్రీకరించాయని చెప్పారు. తాను హింసావాదిని కాదని.. సౌమ్యవాదినని పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన తన మాటలను వేరే రకంగా ప్రచారం చేశారని వాపోయారు. 2009లో వైఎస్ కుటుంబానికి అన్యాయం జరిగినప్పుడు ధర్మం పక్కన నిలబడటం కోసం.. వైఎస్ జగన్‌కు అండగా నిలిచి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని గుర్తు చేశారు. తాను మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచానంటే రాష్ట్ర ప్రజలకు, నియోజకవర్గానికి వైఎస్ కుటుంబం చేసిన సేవలే కారణమన్నారు. వైఎస్ జగన్ దయ వల్లే ఎమ్మెల్యే అయ్యానని చెప్పారు. అలాంటి నేను మంత్రి పదవి ఇవ్వనందుకు హింసావాదిగా మారతానని ఎలా అంటానని ప్రశ్నించారు. మంత్రి పదవులిచ్చే విషయంలో సీఎం జగన్‌కు పూర్తి స్వేచ్ఛ ఉందని.. ఆయన నిర్ణయం శిరోధార్యమన్నారు. సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మామిడి చంటి మంగతాయారు, నాయకులు పి.ఈశ్వరరావు, గొర్ల బాబూరావు, శీరం నర్సింహమూర్తి, నూకినాయుడు, సాయి, వెంకటసూరి, కె.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ఇదే లాస్ట్ వార్నింగ్.. పనితీరు మార్చుకోండి
సాక్షి, ఎస్.రాయవరం(విశాఖపట్నం): సర్వసిద్ధి పీహెచ్సీ సిబ్బంది పనితీరు మార్చుకోవాలని, విధులకు సక్రమంగా హాజరుకాకుంటే సహించేది లేదని పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు హెచ్చరించారు. సర్వసిద్ధి గ్రామంలోని ప్రైవేటు కార్యక్రమానికి ఆదివారం వచ్చిన ఆయన ఆకస్మికంగా స్థానిక పీహెచ్‌సీని సందర్శించారు. పీహెచ్సీలో డాక్టర్ లేకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సిబ్బంది ఎక్కడ ఉంటున్నారని ఆరా తీశారు. అటెండర్‌తో సహా ఎవరూ స్థానికంగా ఉండడం లేదని గ్రామస్తులు చెప్పడంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికంగా అందుబాటులోకి వచ్చిన స్టాఫ్ నర్సు, అటెండర్‌తో మాట్లాడుతూ ఇదే లాస్ట్ వార్నింగ్ అని, ఇకపై పీహెచ్సీ ఇబ్బంది ఇలా చేస్తే క్షమించేది లేదన్నారు. రోడ్ల నిర్మాణానికి నిధులు గ్రామంలో ఎస్సీపేట వీధి రోడ్ల నిర్మాణానికి త్వరలో నిధులు కేటాయిస్తానని ఎమ్మెల్యే గొల్ల బాబూరావు తెలిపారు. కాలనీవాసుల విజ్ఞప్తి మేరకు ఆయన ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. పంచాయతీకి మంజూరయ్యే నిధులను ఈ వీధిలోని రోడ్ల అభివృద్ధికి కేటాయించాలని స్థానిక సర్పంచ్ గణేశ్వరరావుకు సూచించారు. ఎమ్మెల్యే వెంట పాయకరావుపేట మార్కెట్ కమిటీ చైర్మన్ మామిడి చంటి, వైఎస్సార్ సీపీ మండల శాఖ అధ్యక్షుడు కొణతాల శ్రీనివాసరావు తదితరులున్నారు. -
నారా లోకేష్‌కు ఎమ్మెల్యే గొల్ల బాబురావు సవాల్
సాక్షి, విశాఖ : దళితుల విషయంలో రాజకీయం చేయొద్దని మాజీ మంత్రి నారా లోకేష్‌పై ఎమ్మెల్యే గొల్ల బాబురావు మండిపడ్డారు. దళితుల అభివృద్ధి గురించి చిత్తశుద్ధి ఉంటే చర్చకు రావాలంటూ సవాల్ విసిరారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డాక్టర్ సుధాకర్ కుటుంబాన్ని పరామర్శించిన లోకేష్‌కు.. సబ్బంహరి, వానపల్లి రవికుమార్ కుటుంబాలు గుర్తుకురాలేదా? అని ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో దళితులకు జరిగిన అవమానాలను.. ఇప్పటికీ ప్రజలు గుర్తుపెట్టుకున్నారని అన్నారు. -
బెదిరించేలా నిమ్మగడ్డ వ్యవహార శైలి: మల్లాది విష్ణు
సాక్షి, విజయవాడ: ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల విజ్ఞప్తులను పట్టించుకోకుండా.. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడం పట్ల వైఎస్సార్ సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు, గొల్ల బాబూరావు, ధర్మశ్రీ మీడియాతో మాట్లాడారు. ప్రజల ఆరోగ్య రక్షణే ప్రభుత్వ బాధ్యత అన్నారు ఎమ్మెల్యే మల్లాది విష్ణు. ‘‘అందరినీ బెదిరించే ధోరణిలో నిమ్మగడ్డ వ్యవహారశైలి ఉంది. న్యాయవ్యవస్థపై ప్రభుత్వానికి గౌరవం ఉంది. చంద్రబాబుతో కలిసి నిమ్మగడ్డ కుట్రలు చేస్తున్నారు. ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని గతంలో సుప్రీంకోర్టు చెప్పింది.. నిమ్మగడ్డ ఎకపక్షంగా బెదిరించే ధోరణిలో ముందుకెళ్తున్నారు’’ అని మల్లాది విష్ణు మండి పడ్డారు. (చదవండి: విశేష అధికారాలంటూ వివాదాస్పద నిర్ణయం) నిమ్మగడ్డ ఎక్కడ పనిచేసినా ఉద్యోగులను వేధించడమే పని. ఉద్యోగుల విషయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు.. ఎన్నికలు నిర్వహిస్తే నిమ్మగడ్డ చరిత్రహీనుడిగా మిగిలిపోతారని ఎమ్మెల్యే గొల్ల బాబూరావు హెచ్చరించారు. చంద్రబాబు చేతిలో నిమ్మగడ్డ కీలుబొమ్మగా మారారని ఎమ్మెల్యే ధర్మ శ్రీ విమర్శించారు. ఎన్నికల విషయంలో నిమ్మగడ్డ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు కోసమే నిమ్మగడ్డ రమేష్ కుమార్ పనిచేస్తున్నారని మండి పడ్డారు. -
చంద్రబాబు ఏనాడూ ఆలోచించలేదు..
-
ఎల్లో మీడియాతో తప్పుడు రాతలు రాయిస్తున్నారు..
సాక్షి, అమరావతి: చీఫ్ మార్షల్‌ను దూషించినందుకు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పి శాసనసభకు వస్తే çహుందాగా ఉంటుందని ప్రభుత్వ చీఫ్‌విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి హితవు పలికారు. అసెంబ్లీలో చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉందని మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాలను తప్పుదోవ పట్టించేలా టీడీపీ వ్యవహరించిందని ధ్వజమెత్తారు. ఆయన ఆదివారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే గొల్ల బాబురావుతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఉద్యోగులను ఉద్దేశించి చంద్రబాబు, నారా లోకేశ్ నోటికొచ్చినట్లు మాట్లాడారని గుర్తుచేశారు. మార్షల్స్‌ను దారుణంగా తిట్టిన చంద్రబాబు తిట్టలేదంటూ అబద్ధాలు ఆడుతున్నారని విమర్శించారు. ఉద్యోగుల మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించారని తప్పుపట్టారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చ పెడితే టీడీపీ సభ్యులు పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. సభలో టీడీపీ మాట్లాడటానికి సమస్యలు లేక సభను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. చివరి రెండు రోజులైనా సభ సజావుగా జరిగేందుకు బాబు సహకరించాలని అన్నారు. కులాల మధ్య చిచ్చుపెడుతున్న బాబు చరిత్ర సృష్టించే విధంగా, దేశంలో ఎక్కడాలేని విధంగా మహిళా రక్షణ బిల్లును వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిందని గడికోట శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇమేజ్ పెరిగితే మనుగడ ఉండదని కొందరు భయపడుతున్నారని చెప్పారు. అందుకే సీఎం ఇమేజ్ను దెబ్బతీసేందుకు కుట్రలకు పాల్పడుతున్నారని చెప్పారు. మతాల మధ్య చిచ్చుపెట్టిన చంద్రబాబు ఇప్పుడు కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని విమర్శించారు. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఖాళీగా ఉండి ఎల్లో మీడియాలో ఇష్టానుసారంగా వార్తలు రాయిస్తున్నారని శ్రీకాంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఓ ఉన్మాది: గొల్ల బాబురావు ప్రతిపక్ష నేత చంద్రబాబు ఓ ఉన్మాది అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గొల్ల బాబురావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అలాంటి చంద్రబాబు మరొకరిని ఉన్మాది అనడం విడ్డూరంగా ఉందన్నారు. అసెంబ్లీలో ఆయన తీరు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని చెప్పారు. గత ఐదేళ్లలో అసెంబ్లీలో ప్రజా సమస్యలపై ఎలాంటి చర్చ జరగలేదన్నారు. బాబుకు వయసు పెరిగింది గానీ మనసు పెరగలేదన్నారు. బలహీన వర్గాల సంక్షేమం కోసం ఆయన ఏనాడు ఆలోచించలేదని దుయ్యబట్టారు. కార్పొరేట్ శక్తులకు చంద్రబాబు విచ్చలవిడిగా దోచిపెట్టారని విమర్శించారు. -
‘సీఎం జగన్ నిర్ణయాలు విప్లవాత్మకమైనవి’
సాక్షి, విశాఖపట్నం : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు విప్లవాత్మకమైనవని పాయకరావు పేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు అన్నారు. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటూ పాలనలో తనదైన ముద్ర వేసుకున్నారని ప్రశంసించారు. ఆదివారం మద్దిలపాలెం వైఎస్సార్సీపీ నగర పార్టీ కార్యాలయంలో నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బాబూరావుతో పాటు మంత్రులు మోపిదేవి వెంకట రమణ, అవంతి శ్రీనివాసరావు, విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు, అదీప్ రాజ్, కన్నబాబు రాజు, కన్వీనర్ లు ద్రోణంరాజు శ్రీనివాస్, కేకే రాజు, అక్కరమాని విజయ నిర్మల, మళ్ళ విజయ్ ప్రసాద్, నగర మహిళ అధ్యక్షురాలు గరికిన గౌరీ, జిల్లా పార్లమెంట్ మహిళ అధ్యక్షురాలు పీలా వెంకట లక్ష్మీ తో పాటు అనుబంధ సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాబూరావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో సువర్ణ పాలన మొదలైందని, ప్రజలకు మంచి రోజులు వచ్చాయన్నారు. నవరత్నాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు. కార్యకర్తలు అభద్రతాభావానికి గురికావొద్దు నియోజకవర్గాలలో ఏ సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామని పర్యాటక, యుయజన శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ అలియాస్ అవంతి శ్రీనివాస్ అన్నారు. ప్రతి నియోజకవర్గంలో సమావేశాలు నిర్వహించి సమస్యలు పరిష్కరించే దిశగా కృషి చేస్తామన్నారు. ఏ పార్టీకైనా కార్యకర్తలే రధసారుధులని, కార్యకర్తలు లేనిదే పార్టీ మనుగడ లేదన్నారు. కార్యకర్తలు అభద్రతాభావానికి గురికావొద్దని, వారికి అన్నివిధాల పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా రాజీనామా చేశాకనే వైఎస్సార్సీపీలోకి ఆహ్వానం ఉంటుందన్నారు. అవినీతి రహితంగా పనిచేయాలి జీవీఎంసీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజులు సూచించారు. నవరత్నాల పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి నాయకుడు, కార్యకర్తపై ఉందన్నారు. అవినీతి రహితంగా పని చేస్తూ ప్రజల మన్ననలు పొందాలని కార్యకర్తలకు సూచించారు. జీవీఎంసీ ఎన్నికలే లక్ష్యంగా పనిచేయాలి గత ఎన్నికల్లో జరిగిన లోపాలను సరిదిద్దుకొని ముందుకు సాగాలని గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అన్నారు. నవరత్నాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ జీవీఎంసీ ఎన్నికల గెలుపై లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు. అవినీతి రహితంగా పనిచేస్తూ ప్రజల మన్ననలు పొందాలన్నారు. గత ప్రభుత్వం హయంలో ప్రజలు తీవ్ర కష్టాలు పడ్డారని, వారి సమస్యలు తెలుకొని పరిష్కరించే దిశగా ప్రతి కార్యకర్త, నాయకుడు పనిచేయాలని సూచించారు. -
‘టీడీపీ ఎమ్మెల్యే అనితకు అంత సీన్ లేదు’
సాక్షి, విశాఖ : తెలుగుదేశం పార్టీ పాయకరావుపేట ఎమ్మెల్యే అనితపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొల్ల బాబూరావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన శుక్రవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ... వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విమర్శించే స్థాయి అనితకు లేదన్నారు. ఆమె తన స్థాయికి మించి మాట్లాడుతున్నారని గొల్ల బాబూరావు మండిపడ్డారు. మూడేళ్ల ప్రభుత్వ పాలనలో ఏ ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. టీడీపీ అలీబాబా 40 దొంగల్లో అనిత ఓ సభ్యురాలని గొల్ల బాబూరావు వ్యాఖ్యలు చేశారు. కాగా ఎమ్మెల్యే అనిత ...రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కునున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రంపై స్పందించిన విషయం తెలిసిందే. చనిపోయిన ఎన్టీఆర్ పైన సినిమా తీసి టీడీపీని ఇబ్బంది పెట్టాలని వైఎస్ఆర్ సీపీ నేతలు అనుకుంటే...బ్రతికి ఉన్న వాళ్లపై కూడా సినిమా తీసే వాళ్ళు ఉన్నారంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే ఎమ్మల్యే అనిత వ్యాఖ్యలపై వర్మ ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు. బయట తెలిసిన చరిత్ర వెనుక... లోపలి అసలు చరిత్ర చూపించడమే తన అసలు సిసలు ఉద్దేశమంటూ ఆయన వ్యాఖ్యానించారు. -
‘తెలుగుదేశం పార్టీకి సంస్కారమే లేదు’
► అసెంబ్లీలోనే ప్రతిపక్ష నేత అంతుచూస్తానన్న మాటలు ఏమయ్యాయ్? ►మాటల యుద్ధం కన్నా.. ప్రజా పోరాటంలో తేల్చుకుందాం ►స్థాయి మరిచి విమర్శలు చేయడం ఎమ్మెల్యే అనితకు తగదు ►వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొల్ల బాబూరావు ధ్వజం డాబాగార్డెన్స్: ముఖ్యమంత్రి చంద్రబాబుకు, టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలకు సంస్కారమే లేదని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు విమర్శించారు. సాక్షాత్తు అసెంబ్లీలోనే ప్రతిపక్ష నేత అంతు చూస్తానన్న మాటలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. జగదాంబ జంక్షన్ సమీపంలోని వైఎస్సార్సీపీ జిల్లా కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కోటి జనాభా గల దళిత జాతిని అవమానించినప్పుడు ఒక్క కేసు కూడా నమోదు చేయలేదని, దళిత మంత్రులు, అధికార పార్టీకి చెందిన దళిత ఎమ్మెల్యేలు ఏం చేశారని ప్రశ్నించారు. పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి వైఎస్సార్ సీపీకి చెందిన ఎంపీ విజయసాయిరెడ్డిని చెప్పుతీసి కొడతానంటే మీలో ఎవరైనా క్షమాపణ చెప్పారా? అలాంటి మీకు, మీ పార్టీకి సంస్కారం ఎక్కడదని? దుయ్యబట్టారు. గోదావరి పుష్కరాల్లో 29 మంది చనిపోయినా కనీసం వారి కుటుంబాలను పరామర్శించని సంస్కారం టీడీపీదని ఎద్దేవ చేశార. చంద్రబాబు కళ్లు ఉన్న దృతరాష్ట్ర పాలన సాగిస్తున్నారని విమర్శించారు. దివంగత మహానేత వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి ఆలోచన అంతా బడుగు, బలహీన వర్గాలతో పాటు అందరి కోసం ఉండేదని, చంద్రబాబు మైండ్‌సెట్ అందుకు విరుద్ధమన్నారు. పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత స్థాయిని మరచి ప్రతిపక్ష నేతపై మాట్లాడడం సిగ్గుచేటన్నారు. ఎమ్మెల్యే అయిన వెంటనే గాలిలో చక్కెర్లు కొడుతూ నియోజకవర్గాన్ని గాలికొదిలేశారని ఆక్షేపించారు. వాటర్ సప్లయి పథకాన్ని తన హయాంలో రూ.35 కోట్లతో పనులు చేపట్టానని, అలాంటిది ఇప్పుడు అనిత ఏదో చేసేసినట్టు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. డిగ్రీ కళాశాల ఒక డ్రీమ్ అంటున్న ఆమె సంకల్పం ఉంటే రప్పించాలని సూచించారు. విష, చెడు సంస్కృతులకు మూల బిందువు టీడీపీయేనని విమర్శించారు. 13 మంది మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు నంద్యాలలో తిష్టవేసినా.. గెలుపు మాత్రం వైఎస్సార్ సీపీదేనని చెప్పారు. సమావేశంలో వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు బోని శివరామకృష్ణ పాల్గొన్నారు. -
‘చంద్రబాబుపై ఎమ్మెల్యే అనిత కేసు పెట్టాలి’
-
‘చంద్రబాబుపై ఎమ్మెల్యే అనిత కేసు పెట్టాలి’
హైదరాబాద్ : పొలిటికల్ పంచ్ అడ్మిన్ రవికిరణ్‌పై పెట్టిన కేసు విషయంలో టీడీపీ ఎమ్మెల్యే అనిత పునరాలోచించుకోవాలని వైఎస్ఆర్ సీపీ నేత గొల్ల బాబురావు కోరారు. రవికిరణ్ వేసిన కార్టున్లో ఎక్కడా ఆమెను కించపరచలేదని ఆయన శనివారమిక్కడ అన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని దుర్వినియోగం చేయొద్దని, రాజకీయ ప్రోద్భలంతో కేసులు పెట్టడం వల్ల చట్టం దుర్వినియోగం అవుతుందని గొల్ల బాబురావు తెలిపారు. ఒకవేళ ఎమ్మెల్యే అనిత నిజంగా బాధపడి ఉంటే దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అన్న చంద్రబాబుపై కేసు పెట్టాలని ఆయన అన్నారు. యావత్ దళిత జాతిని అవమానించేలా చంద్రబాబు మాట్లాడారని, ఆయనపై కేసు పెడితే దళిత జాతి హర్షిస్తుందన్నారు. అనితకు సోదరుడిగా ఇది తన సూచన మాత్రమే అని గొల్ల బాబురావు పేర్కోన్నారు. కాగా తనను కించపరిచేలా కార్టున్స్ వేశారంటూ ఎమ్మెల్యే అనిత రవికిరణ్‌పై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో అతడిని అరెస్ట్ చేయగా, ప్రస్తుతం రవికిరణ్ విశాఖ జైల్లో ఉన్నారు. -
'ప్రజల అభిమానాన్ని దెబ్బ తీశారు'
విశాఖపట్నం: విజయవాడలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని తొలగించడం కోట్లాది మంది ప్రజల అభిమానాన్ని గాయపరిచిందని వైఎస్సార్ సీపీ నేత గొల్ల బాబూరావు అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. విగ్రహాల తొలగింపుపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. గతంలో ఏ రాజకీయ నాయకుడు ఇలా మాట్లాడలేదన్నారు. ఇప్పటికైనా తొలగించినచోటే వైఎస్సార్ విగ్రహాన్ని పునఃప్రతిష్టించాలని లేదంటే చంద్రబాబు సర్కారు తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం తలపెట్టిన బంద్ కు సమాయత్తమవుతున్నామని చెప్పారు. హైవేల దిగ్బంధంతో నిరసన తెలుపుతామని బాబురావు తెలిపారు. -
'రియల్ఎస్టేట్ హబ్‌గా అమరావతిని తయారు చేశారు'
విశాఖపట్నం : కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్లపై ఏర్పాటైన జస్టిస్ మంజునాథ కమిషన్‌తో కాలయాపన చేయకుండా... అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గొల్ల బాబూరావు డిమాండ్ చేశారు. కాపులను షెడ్యూల్ - 9లో చేర్చే అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిని రియల్ఎస్టేట్ హబ్‌గా తయారు చేశారని ఆరోపించారు. జన్మభూమి కమిటీలు రద్దు చేసి సంక్షేమ పథకాలు అమలు చేయాలని ప్రభుత్వానికి గొల్ల బాబూరావు విజ్ఞప్తి చేశారు. -
ఎమ్మెల్సీగా గెలిపిస్తే సమస్యలు పరిష్కరిస్తా
కోటగుమ్మం, (రాజమండ్రి) : ‘ఉపాధ్యాయుల సమస్యలు తెలిసిన వాడిని, ఆ వ్యవస్థపై అవగాహన ఉన్న అధికారిని, తనను టీచర్స్ ఎమ్మెల్సీగా గెలిపిస్తే అన్ని సమస్యలు పరిష్కరిస్తాను’ అని మాజీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు పేర్కొన్నారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరిగే ఉపాధ్యాయ శాసన మండలి సభ్యుల ఎన్నికల్లో తాను అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నట్టు ప్రకటించారు. పార్టీ పరంగా ఈ ఎన్నికలు ఉండవని, పార్టీలు అభ్యర్థులకు బీ ఫారాలు అందజేయాలని, ఎవరైనా స్వతంత్రంగా పోటీ చేయాల్సిందేనన్నారు. వైఎస్సార్ సీపీ మద్దతు తనకు ఉందని పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సమీపంలోని కొవ్వలి గ్రామం తన స్వగ్రామమని, ఏలూరు సీఆర్ రెడ్డి కళాశాలలో డిగ్రీ, జబల్పూర్లో ఎంఏ, ఉస్మానియ యూనివర్సిటీలో ఎల్ఎల్బీ పూర్తి చేశానన్నారు. గ్రూప్-1 ఉద్యోగం లభించడంతో పంచాయతీ అధికారిగా పనిచేశానన్నారు. తూర్పుగోదావరి జిల్లా పరిషత్ సీఈఓగా ఎక్కువ సమయం పనిచేశానన్నారు. పంచాయితీ రాజ్ కమిషనర్ గా చేస్తున్న సమయంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరానన్నారు. పాయకరావు పేట ఎమ్మెల్యేగా గెలిచానన్నారు. 2014 ఎన్నికల్లో అమలాపురం అసెంబ్లీ నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీ చేశానన్నారు. జెడ్పీ సీఈఓగా పనిచేస్తున్న సమయంలో ఉపాధ్యాయుల నియామకం పారదర్శకంగా నిర్వహించానన్నారు. 20 వేల మందికి ఒకేసారి నియామక ఉత్తర్వులు ఇప్పించిన ఘనత తనదేనని పేర్కొన్నారు. టీచర్స్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న తనను గెలిపిస్తే పీఆర్సీ ఫిట్‌మెంట్‌పై విజయం సాధిస్తామన్నారు. -
విభజన వెనుక రాజకీయ కుట్ర: బాబురావు
-
విభజన వెనుక రాజకీయ కుట్ర: బాబురావు
హైదరాబాద్: తెలంగాణ బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గొల్ల బాబురావు అన్నారు. శాసనసభలో తెలంగాణ ముసాయిదా బిల్లుపై ఓటింగ్ నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజనకు తాము వ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు. విభజన వెనుక రాజకీయ కుట్ర దాగివుందని ఆరోపించారు. టీ-బిల్లును కేంద్రం హడావుడిగా శాసనసభకు పంపాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు. తెలుగుజాతి వల్లే యూపీఏకు రెండుసార్లు అధికారం వచ్చిందని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు తెలుగుజాతిని యూపీఏ ప్రభుత్వం రెండు ముక్కలు చేస్తోందని మండిపడ్డారు. -
'ఒక్కరోజైనా సీఎం కావాలనేది చిరంజీవి లక్ష్యం'
విశాఖ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక్కరోజైనా సీఎం కావాలనేది కేంద్ర మంత్రి చిరంజీవి ముందున్న లక్ష్యమని వైఎస్సార్ సీపీ అభిప్రాయపడింది. అందుకే ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ భజన చేస్తూ ఆమె సేవలో పరితపిస్తున్నారని వైఎస్సార్ సీపీ కన్వీనర్ గొల్ల బాబూరావు విమర్శించారు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని తప్పించి ఒక్కరోజైనా సీఎం కావాలని చిరంజీవి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ యోచిస్తున్నారన్నారు. అందుకే మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి ఇంట్లో భజన సమావేశం ఏర్పాటు చేసారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధిష్టాన నిర్ణయాన్ని ధిక్కరిస్తూ మాట్లాడిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు తర్జన భర్జన పడుతున్నారు. ఇందులో భాగంగా నేతలు ఆనం ఇంట్లో సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. దీనిపై బాబూరావు మాట్లాడుతూ.. చిరంజీవి, బొత్సలకు సీఎం కావాలనేది లక్ష్యంగా కనిపిస్తోందన్నారు. -
'సమైక్య' తీర్మానానికి అసెంబ్లీ భేటీ
* స్పీకర్‌ను కోరిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు * పార్టీల వైఖరేమిటో బయట పడుతుందని వ్యాఖ్య సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం సమైక్యంగా ఉండటంలో రాష్ట్ర అసెంబ్లీలో జరగాల్సిన తీర్మానమే ప్రాతిపదికగా ఉంటుందంటున్న ముఖ్యమంత్రి, మంత్రులు... అందుకనుగుణంగా తక్షణం అసెంబ్లీని సమావేశపరచాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పునరుద్ఘాటించింది. పార్టీ ఎమ్మెల్యేలు శోభా నాగిరెడ్డి, జి.బాబూరావు, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, పార్టీ సానుభూతి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి శుక్రవారం స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను కలిశారు. అసెంబ్లీని సమావేశపరచాలని కోరుతూ వినతిపత్రం ఇచ్చారు. ‘‘వెంటనే అసెంబ్లీని సమావేశపరిచి, రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ తీర్మానాన్ని ఆమోదించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అప్పుడే రాష్ట్రంలో నెలకొన్న ఈ రాజ్యాంగ సంక్షోభానికి ముగింపు పలికినట్టవుతుంది’’ అని అందులో పేర్కొన్నారు. నలుగురు ఎమ్మెల్యేలతో పాటు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ కూడా వినతిపత్రంపై సంతకం చేశారు. స్పీకర్‌తో భేటీ అనంతరం ఎమ్మెల్యేలు విలేకరులతో మాట్లాడారు. ‘కేంద్రంలో జరుగుతున్న విభజన ప్రక్రియను సీమాంధ్ర కాంగ్రెస్ నేతలెవరూ అడ్డుకోలేకపోతున్నారన్నారు. ‘‘కేంద్ర మంత్రులు, ఎంపీలు, ముఖ్యమంత్రి.. ఎవరూ విభజన ప్రక్రియను ఆపలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. కనీసం అసెంబ్లీ సమావేశాన్నయినా ఏర్పాటు చేయడం ముఖ్యమంత్రి చేతిలో ఉన్న వ్యవహారం. దీనికి ఎవరి అనుమతీ అవసరం లేదు. కాబట్టి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని డిమాండ్ చేస్తున్నాం. వెంటనే అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసేందుకు వీలుగా మంత్రివర్గ సమావేశం పెట్టండి. ఆ నిర్ణయాన్ని గవర్నర్‌కు పంపండి. మా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా 30వ తేదీన గవర్నర్‌ను కలిసి, అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాల్సిందిగా కోరబోతున్నారు. ఆ దిశగా కిరణ్ కూడా ముందుకు రావాలి’’ అని శోభ విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక సందర్భాలలో అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశ పరిచిన సంఘటనలు ఉన్నాయన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ విషయంలోనూ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి చట్టం తీసుకొచ్చారని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఆరు కోట్ల ప్రజలు తమ భవిష్యత్ అంధకారమవుతుందన్న ఆందోళనలతో రోడ్లపైకి వచ్చి దీక్షలు చేస్తున్నారని, లక్షలాది ఉద్యోగులు రెండు నెలలుగా జీతాల్లేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కాబట్టి ఇంకా కాలయాపన చేయకుండా వెంటనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి సమైక్యాంధ్రకు మద్దతుగా తీర్మానం పెట్టి, దాన్ని కేంద్రానికి పంపాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు విజయమ్మ గురువారమే కిరణ్‌కు లేఖ రాశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ విభజన నిర్ణయం తీసుకోకముందే, దానిపై కిరణ్, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణలను రోడ్‌మ్యాప్ అడిగినప్పుడే వారు అడ్డుపడి ఉంటే ఈ రోజు ప్రజలు రోడ్డెక్కే పరిస్థితి ఉండేది కాదన్నారు. పార్టీల బండారం బయటపడాలంటే..: విభజన ప్రక్రియపై పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయని ఎమ్మెల్యేలు విమర్శించారు. విభజనకు కాంగ్రెస్ పార్టీతో పాటు, సీఎంగా ఉన్న కిరణ్, విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబులదే బాధ్యతన్నారు. ‘మనం లేఖ ఇవ్వడం వల్లే విభజన జరిగిందని ప్రచారం చేయండ’ని తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలతో చెబుతున్న చంద్రబాబే, సీమాంధ్రలో తెలుగువారి ఆత్మగౌరవయాత్ర చేస్తున్నారని దుయ్యబట్టారు. ఒక ప్రాంతం (తెలంగాణ)లో నష్టపోతామని తెలిసీ, మెజారిటీ ప్రజల ఆలోచనకు అనుగుణంగా సమైక్యాంధ్రకు మద్దతుగా ఎమ్మెల్యేలం రాజీనామా చేశామని గుర్తు చేశారు. తమను విమర్శిస్తున్న సీమాంధ్ర టీడీపీ నేతలు ముందు వాళ్ల పార్టీ అధ్యక్షుడు తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేయాలని సూచించారు. అశోక్‌బాబూ! అందరినీ ఒకే గాటన కట్టొద్దు వైఎస్సార్సీపీలో అధ్యక్షుడు ఒక మాట, ఎమ్మెల్యేలు ఒక మాట మాట్లాడుతున్నారన్న ఏపీ ఎన్జీవో నేత అశోక్‌బాబు వ్యాఖ్యలను శోభ తప్పుబట్టారు. మా అధ్యక్షుడు వైఎస్ జగన్ నుంచి ఎమ్మెల్యేలు, కిందిస్థాయి కార్యకర్తల దాకా అందరూ సమైక్యాంధ్రకు మద్దతుగా ఒకే మాటతో ఉన్నారు. సమైక్యాంధ్రకు సంపూర్ణ మద్దతుగా విజయమ్మ, జగన్‌తో సహా ఎమ్మెల్యేలమంతా రాజీనామా చేశాం. అలాంటి మా పార్టీనీ, రెండు విధానాలతో డ్రామాలాడుతున్న వారినీ ఒకే గాటన కట్టడం ఏమాత్రమూ సబబు కాదు. అశోక్‌బాబు అలా చేస్తే ఉద్యమం నీరుకారుతుంది. రెండు నాల్కల పార్టీలపై ఒత్తిడి పెంచి వాటిని ఇరుకున పెట్టాల్సిన బాధ్యత ఉద్యోగులపై ఉంది. రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ తీసుకున్న విభజన నిర్ణయాన్ని రాజకీయంగానే ఎదుర్కోవాలి. ఉద్యోగులు నెలల తరబడి జీతాల్లేక ఇబ్బంది పడుతుంటే అధికారంలో ఉన్న వారు పదవులను అనుభవిస్తున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ కేంద్రానికి రాసే లేఖపై తానే తొలి సంతకం చేస్తానని జగన్ చెప్పారు. మిగతా పార్టీల నేతలు కూడా అదే వైఖరితో లేఖపై సంతకాలు చేయడానికి ముందుకొస్తే రాష్ట్రం సమైక్యంగా ఉంటుంది. ఒక వర్గం మీడియా సమైక్యాంధ్ర విషయంలో తమ వైఖరిని తప్పుపట్టేలా వ్యవహరిస్తోంది. బాబు అనుకూల మీడియా మాత్రమే ఇలా వ్యవహరిస్తుందని చెప్పారు. మాపై విమర్శలు చేస్తున్న ఆ మీడియా, విభజనపై రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తున్న బాబును మాత్రం ఏమీ ప్రశ్నించదు’’ అంటూ ధ్వజమెత్తారు. ఆటతో పోల్చడం దుర్మార్గం: శ్రీకాంత్‌రెడ్డి ఒకవైపు రాష్ట్రంలో అసాధారణ పరిస్థితులు నెలకొని ఉంటే, దాన్ని కిరణ్ ఒక ఆటతో పోల్చడం దుర్మార్గమని శ్రీకాంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆఖరి బంతి పడేదాకా ఆట ముగిసినట్టు కాదంటున్నారంటే ఆయన ఆలోచనా తీరు ఎలా ఉందో అర్థమవుతోందన్నారు. కేబినెట్ నోట్ రూపొందక ముందే సమైక్య తీర్మానం చేస్తే విభజన ప్రక్రియను అడ్డుకోవచ్చన్నారు. -
'జగన్ బయటకొస్తే చంద్రబాబు పారిపోతారు'
జగన్‌ను చూస్తే టీడీపీ నేతలకు ఎందుకంత భయమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, గొల్ల బాబూరావు, కాపు రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. అవినీతికి మూల పురుషుడు చంద్రబాబు అన్నారు. జగన్ ఎప్పుడు బయటకొస్తే ఏ దేశం పారిపోవాలని బాబు ఆలోచిస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకి ఒళ్లంతా విషముందని అందుకే వైఎస్ కుటుంబంపై ఎప్పుడూ చంద్రబాబు విషం కక్కుతుంటారని అన్నారు. చంద్రబాబును తెలుగు తమ్ముళ్లు వదిలేసే రోజు అతిత్వరలో ఉందని చెప్పారు. జగన్‌పై ఈనాడు తప్పుడు కథనాలు ప్రచురిస్తోందని, తామే సీబీఐ డైరెక్టర్లు అన్నట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. -
కాంగ్రెస్ నేతల డ్రామా: వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు
రాష్ట్ర విభజనపై స్వార్ధం కోసమే కాంగ్రెస్ నేతలు డ్రామాలాడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, శ్రీనివాసులు, గొల్ల బాబూరావు విమర్శించారు. పదవులు కాపాడుకోవడానికి సీడబ్ల్యూసీ తీర్మానానికి వ్యతిరేకంగా తీర్మానం చేశారని వారు ఆరోపించారు. సీఎం కిరణ్, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యానారాయణ సంతకాలు పెట్టామని డ్రామాలాడుతున్నారని ధ్వజమెత్తారు. చిరంజీవి తన ఆస్తులు, పదవుల కోసమే ఉమ్మడి రాజధానిపై వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర విభజన అంగీకరించేది లేదన్న కావూరి సాంబశివరావు.. కేంద్రమంత్రి కాగానే నోరు మెదపడం లేదని దుయ్యబట్టారు. కేసీఆర్ అప్పుడే సీఎం అయినట్లు వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. అప్పులు, ఉద్యోగుల సమస్యలపై చర్చించకుండా విభజన ఎలా చేస్తారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేల ప్రశ్నించారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఆగిపోయి యువత అల్లాడిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలు కప్పిపుచ్చేందుకు, ముందస్తు ఎన్నికల కోసమే విభజన చిచ్చు పెట్టారని ఆరోపించారు. ప్రజల డిమాండ్ మేరకు రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని డిమాండ్ చేశారు. అన్ని ప్రాంతాలు సమాన స్థాయిలో అభివృద్ధి చెందాకే విభజన గురించి మాట్లాడాలన్నారు. రాష్ట్రం అట్టుడికి పోతుంటే చంద్రబాబు ఇంట్లో కూర్చున్నారని విమర్శించారు. -
ప్రజల సెంటిమెంట్‌తో కాంగ్రెస్ ఆడుకుంటోంది