సాక్షి, విజయవాడ: ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల విజ్ఞప్తులను పట్టించుకోకుండా.. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడం పట్ల వైఎస్సార్ సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు, గొల్ల బాబూరావు, ధర్మశ్రీ మీడియాతో మాట్లాడారు. ప్రజల ఆరోగ్య రక్షణే ప్రభుత్వ బాధ్యత అన్నారు ఎమ్మెల్యే మల్లాది విష్ణు. ‘‘అందరినీ బెదిరించే ధోరణిలో నిమ్మగడ్డ వ్యవహారశైలి ఉంది. న్యాయవ్యవస్థపై ప్రభుత్వానికి గౌరవం ఉంది. చంద్రబాబుతో కలిసి నిమ్మగడ్డ కుట్రలు చేస్తున్నారు. ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని గతంలో సుప్రీంకోర్టు చెప్పింది.. నిమ్మగడ్డ ఎకపక్షంగా బెదిరించే ధోరణిలో ముందుకెళ్తున్నారు’’ అని మల్లాది విష్ణు మండి పడ్డారు.
(చదవండి: విశేష అధికారాలంటూ వివాదాస్పద నిర్ణయం)
నిమ్మగడ్డ ఎక్కడ పనిచేసినా ఉద్యోగులను వేధించడమే పని. ఉద్యోగుల విషయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు.. ఎన్నికలు నిర్వహిస్తే నిమ్మగడ్డ చరిత్రహీనుడిగా మిగిలిపోతారని ఎమ్మెల్యే గొల్ల బాబూరావు హెచ్చరించారు. చంద్రబాబు చేతిలో నిమ్మగడ్డ కీలుబొమ్మగా మారారని ఎమ్మెల్యే ధర్మ శ్రీ విమర్శించారు. ఎన్నికల విషయంలో నిమ్మగడ్డ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు కోసమే నిమ్మగడ్డ రమేష్ కుమార్ పనిచేస్తున్నారని మండి పడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment