వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే గొల్ల బాబురావు మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు తీరును చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. గత అయిదేళ్లలో ప్రజా సమస్యలపై ఎలాంటి చర్చ జరగలేదు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో ప్రజా సమస్యలపై సుదీర్ఘ చర్చ జరుగుతోంది. జగన్ సీఎం అయ్యాక విప్లవాత్మక బిల్లులు తెచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం అవకాశం కల్పించారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని మించి సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టారు. చంద్రబాబు సభలో ఉన్మాదిలా వ్యవహరిస్తున్నారు.