విశాఖపట్నం : కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్లపై ఏర్పాటైన జస్టిస్ మంజునాథ కమిషన్తో కాలయాపన చేయకుండా... అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గొల్ల బాబూరావు డిమాండ్ చేశారు. కాపులను షెడ్యూల్ - 9లో చేర్చే అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిని రియల్ఎస్టేట్ హబ్గా తయారు చేశారని ఆరోపించారు. జన్మభూమి కమిటీలు రద్దు చేసి సంక్షేమ పథకాలు అమలు చేయాలని ప్రభుత్వానికి గొల్ల బాబూరావు విజ్ఞప్తి చేశారు.