లేకపోతే ప్రజల కోసం ఎన్డీయేకు మద్దతు ఉపసంహరించుకోవాలి
టీడీపీ, జనసేనలను డిమాండ్ చేసిన వైఎస్సార్‌సీపీ ఎంపీ గొల్ల బాబూరావు
స్టీల్‌ప్లాంట్ కోసం పోరాడేందుకు సిద్ధం కావాలని ప్రజలకు పిలుపు
సీతమ్మధార: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిపివేసేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని టీడీపీ, జనసేన పార్టీలను వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు డిమాండ్ చేశారు. సోమవారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిపివేస్తామంటూ ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్‌కళ్యాణ్, బీజేపీ నేతలు హామీ ఇచ్చారు. నేను పార్లమెంట్‌లో ప్రశ్నించగా.. ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగదని ఆరి్థక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరి బదులిచ్చారు. పెట్టుబడుల ఉపసంహరణ జరుగుతుందని చెప్పారు. ఎంతోమంది ప్రాణత్యాగంతో ఏర్పడిన స్టీల్‌ప్లాంట్ కోసం పోరాడేందుకు రాష్ట్ర ప్రజలంతా సిద్ధం కావాలి. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర నాయకులు వెంటనే స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై వారి వైఖరిని స్పష్టం చేయాలి.
కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గకపోతే.. టీడీపీ, జనసేన పారీ్టలు మద్దతు ఉపసంహరించుకోవాలి. విశాఖ ఎంపీ భరత్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు.. రాష్ట్ర ప్రజల కోసం ఎన్డీయే నుంచి తప్పుకుంటారో? ప్రజలను మోసం చేస్తారో? చెప్పాలి. టీడీపీ, జనసేన వెంటనే ఎన్డీయేకు మద్దతు ఉపసంహరించుకుంటే స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోతుంది. లేకపోతే లక్షలాది మంది ఉద్యోగులు, కారి్మకులు రోడ్డున పడతారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ పోరాటం కొనసాగిస్తుంది’ అని చెప్పారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ నాయకులు ద్రోణంరాజు శ్రీవాత్సవ్, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment