
సాక్షి, విశాఖ : తెలుగుదేశం పార్టీ పాయకరావుపేట ఎమ్మెల్యే అనితపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొల్ల బాబూరావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన శుక్రవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ... వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విమర్శించే స్థాయి అనితకు లేదన్నారు. ఆమె తన స్థాయికి మించి మాట్లాడుతున్నారని గొల్ల బాబూరావు మండిపడ్డారు. మూడేళ్ల ప్రభుత్వ పాలనలో ఏ ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. టీడీపీ అలీబాబా 40 దొంగల్లో అనిత ఓ సభ్యురాలని గొల్ల బాబూరావు వ్యాఖ్యలు చేశారు.
కాగా ఎమ్మెల్యే అనిత ...రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కునున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రంపై స్పందించిన విషయం తెలిసిందే. చనిపోయిన ఎన్టీఆర్ పైన సినిమా తీసి టీడీపీని ఇబ్బంది పెట్టాలని వైఎస్‌ఆర్ సీపీ నేతలు అనుకుంటే...బ్రతికి ఉన్న వాళ‍్లపై కూడా సినిమా తీసే వాళ్ళు ఉన్నారంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే ఎమ్మల్యే అనిత వ్యాఖ్యలపై వర్మ ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు. బయట తెలిసిన చరిత్ర వెనుక... లోపలి అసలు చరిత్ర చూపించడమే తన అసలు సిసలు ఉద్దేశమంటూ ఆయన వ్యాఖ్యానించారు.