కూలీలకు మట్టి ఎత్తుతున్న ఎమ్మెల్యే బాబూరావు
కోటవురట్ల: నేనూ కూలీ బిడ్డనే..కష్టమంటే ఏమిటో నాకు బాగా తెలుసు..కష్టపడి చదివా..మంచి ఉద్యోగం చేశా..ఉన్నతాధికారిగా ఊరూరూ తిరిగా..మీ సమస్యలు నాకు తెలుసు..మీ బిడ్డలకు మంచి భవిష్యత్ ఇవ్వాలంటే బాగా చదివించండి.. అంటూ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు ఉపాధి హామీ పథకం వేతనదారులను పలకరించారు.
మండలంలోని నీలిగుంట, జి.సన్యాసిరాజుపాలెం గ్రామాల్లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన మార్గంమధ్యలో టి.జగ్గంపేటలో ఉపాధి పనులు చేస్తున్న వేతనదారులతో మాట్లాడారు. వారితో చేయి కలిపి పలుగూ పారా చేత బట్టారు. గునపంతో మట్టి తవ్వి వారి సమస్యలు తెలుసుకుంటూ పరిష్కారానికి వెనువెంటనే అధికారులకు ఆదేశాలిచ్చారు.
పిల్లల భవిష్యత్‌పై దృష్టి సారించాలని విద్యతోనే ఉన్నతమైన జీవితం వస్తుందని వారికి హితబోధ చేశారు. పిల్లలను కూలీలుగా మార్చొద్దని, వారిని బడికి పంపి మంచి జీవితాన్ని ఇవ్వాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పిల్లల బంగారు భవితకు నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను సమూలంగా అభివృద్ధి చేసిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment