
'ప్రజల అభిమానాన్ని దెబ్బ తీశారు'
విశాఖపట్నం: విజయవాడలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని తొలగించడం కోట్లాది మంది ప్రజల అభిమానాన్ని గాయపరిచిందని వైఎస్సార్ సీపీ నేత గొల్ల బాబూరావు అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. విగ్రహాల తొలగింపుపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. గతంలో ఏ రాజకీయ నాయకుడు ఇలా మాట్లాడలేదన్నారు.
ఇప్పటికైనా తొలగించినచోటే వైఎస్సార్ విగ్రహాన్ని పునఃప్రతిష్టించాలని లేదంటే చంద్రబాబు సర్కారు తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం తలపెట్టిన బంద్ కు సమాయత్తమవుతున్నామని చెప్పారు. హైవేల దిగ్బంధంతో నిరసన తెలుపుతామని బాబురావు తెలిపారు.