తెలంగాణ బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గొల్ల బాబురావు అన్నారు.
హైదరాబాద్: తెలంగాణ బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గొల్ల బాబురావు అన్నారు. శాసనసభలో తెలంగాణ ముసాయిదా బిల్లుపై ఓటింగ్ నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజనకు తాము వ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు. విభజన వెనుక రాజకీయ కుట్ర దాగివుందని ఆరోపించారు.
టీ-బిల్లును కేంద్రం హడావుడిగా శాసనసభకు పంపాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు. తెలుగుజాతి వల్లే యూపీఏకు రెండుసార్లు అధికారం వచ్చిందని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు తెలుగుజాతిని యూపీఏ ప్రభుత్వం రెండు ముక్కలు చేస్తోందని మండిపడ్డారు.