విశాఖ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక్కరోజైనా సీఎం కావాలనేది కేంద్ర మంత్రి చిరంజీవి ముందున్న లక్ష్యమని వైఎస్సార్ సీపీ అభిప్రాయపడింది. అందుకే ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ భజన చేస్తూ ఆమె సేవలో పరితపిస్తున్నారని వైఎస్సార్ సీపీ కన్వీనర్ గొల్ల బాబూరావు విమర్శించారు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని తప్పించి ఒక్కరోజైనా సీఎం కావాలని చిరంజీవి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ యోచిస్తున్నారన్నారు. అందుకే మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి ఇంట్లో భజన సమావేశం ఏర్పాటు చేసారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధిష్టాన నిర్ణయాన్ని ధిక్కరిస్తూ మాట్లాడిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు తర్జన భర్జన పడుతున్నారు.
ఇందులో భాగంగా నేతలు ఆనం ఇంట్లో సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. దీనిపై బాబూరావు మాట్లాడుతూ.. చిరంజీవి, బొత్సలకు సీఎం కావాలనేది లక్ష్యంగా కనిపిస్తోందన్నారు.