
గరివిడి: మండలంలోని గెడ్డపువలసకు చెందిన తుమ్మగుంటి చిరంజీవి శుక్రవారం గుండెపోటుకు గురై మరణించారు. ఈ సంగతి తెలుసుకున్న వైఎస్సార్ సీపీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వకర్త మజ్జి శ్రీనివాసరావు ఆయన కుటుంబీకులను పరామర్శించారు. చిరంజీవి మరణానికి గల కారణాలను వారిని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కె.కృష్ణంనాయుడు, వి. శ్రీనివాసరావు, లక్ష్మణ తదితరులు పాల్గొన్నారు.