ఆయన చాలా మంచోడు... | Political Gossip on Vijayawada TDP MLA | Sakshi
Sakshi News home page

ఆయన చాలా మంచోడు...

Published Sun, Dec 27 2015 10:35 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

ఆయన చాలా మంచోడు... - Sakshi

ఆయన చాలా మంచోడు...

ఆయన చాలా మంచోడు అని వకాల్తా పుచ్చుకుని వాదిస్తున్నారు విజయవాడకు చెందిన ఓ టీడీపీ ఎమ్మెల్యే. పార్టీ నేతలు, తెలిసిన వారు, తెలియని వారు   ఎవరు ఆయన్ను కదిలించినా, కదిలించకపోయినా ఇదే పాట పాడుతున్నారు. ఇలా ఆయన పాట పాడటానికి కారణం వారిద్దరికీ మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలేనని విజయవాడలోని టీడీపీ వర్గాలు అంటున్నాయి. ఎవరు సార్ చాలా మంచోడు అని ఆయన్ను అడిగితే రాష్ట్రాన్ని కుదిపేసిన కాల్‌మనీ సెక్స్‌రాకెట్ కేసులో నిందితుడిగా ఉన్న ఓ వ్యక్తి పేరును ఆయన చెప్తున్నారు.

విజయవాడ నగరంలో వెలుగులోకి వ చ్చిన కాల్‌మనీ సెక్స్‌రాకెట్ వ్యవహారంలో టీడీపీ స్థానిక నేతలు కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరికి ఎమ్మెల్యేలతో పాటు అంతకంటే పెద్దవారితో సంబంధాలున్నాయి. దీంతో వారిని వెనకేసుకొచ్చే పనిని నేతలు భుజాన వేసుకున్నారు. అందులో భాగంగానే ఆయన చాలా మంచోడు అనే ప్రచారాన్ని ఎత్తుకున్నారని ఆ ఎమ్మెల్యే సన్నిహితులు చెప్తున్నారు.

కాల్‌మనీ కేసులో కీలక నిందితుడిగా ఉన్న ఓ వ్యక్తి పోలీసులకు దొరకకుండా పరారీలో ఉన్నారు. ఆయన ఈ ఎమ్మెల్యేకి చాలా దగ్గరి వ్యక్తి. పార్టీ వ్యక్తి కావటంతో ఆయన్ను కూడా ప్రభుత్వం చూసీ చూడనట్లు అరెస్టు చేయకుండా వదిలేస్తోంది. దీంతో ఆ నిందితుడిని ఎలాగైనా కేసు నుంచి బయటపడేయాలనే పట్టుదలతో ఉన్న సదరు ఎమ్మెల్యే ఆయన చాలా మంచోడు, ఆయన వచ్చిన ఆరోపణలన్నీ తప్పు అని చెప్తున్నారు. ఆయన విద్యార్ధి దశ నుంచే మహిళల పట్ల చాలా గౌరవంగా వ్యవహరించే వారు.

తన స్నేహితులు, సన్నిహితులు ఎవరైనా మహిళలను ఉద్దేశించి వ్యాఖ్యానాలు చే స్తే వెంటనే ఖండించేవాడు, మంచి పద్ధతి కాదని హెచ్చరించే వాడు, అలాంటి వ్యక్తిని కాల్‌మనీ సెక్స్‌రాకెట్ కేసులో నిందితుడిగా చేరుస్తారా?, ఇది ఎంత అన్యాయం, అన్యాయం అని అడిగిన వారికీ, అడగని వారికీ అదేపనిగా చెబుతున్నారు. ఈ విషయం తెలిసిన టీడీపీ నేతలు వారిద్దరికీ ఉన్న సాన్నిహిత్యం వల్లే ఆయన చాలో మంచోడని మా ఎమ్మెల్యే చెప్తున్నారు. అందులో రహస్యం ఏముంది... అందరికీ తెలిసిన విషయమే అని ముక్తాయింపునిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement