![Bandi Sanjay Fires On KCR, Speaker Over Assembly Sessions - Sakshi](/styles/webp/s3/article_images/2022/09/7/Bandi-Sanjay.jpg.webp?itok=3yRvrff6)
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి తీరుపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ నిప్పులు చెరిగారు. రాజ్యాంగబద్ద పదవిలో ఉంటూ రాజకీయ విమర్శలు చేస్తారా అంటూ స్పీకర్‌పై మండిపడ్డారు. సభలో చర్చ జరగాలని, స్పీకర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీని చూస్తేనే కేసీఆర్ గజగజ వణికిపోతున్నారని విమర్శించారు. అసెంబ్లీ నిర్వహించాలంటే భయపడుతున్నాడని దుయ్యబట్టారు.
పార్లమెంట్ కన్వీనర్లు, జాయింట్ కన్వీనర్లు, జిల్లా ఇంఛార్జ్‌లతో బండి సంజయ్ బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ‘ప్రజా సమస్యలపై చర్చించకుండా కుట్ర చేస్తున్నారు. ప్రజా క్షేత్రంలోనే తేల్చుకుంటాం. హిందూ పండుగలకు ప్రాధాన్యత లేకుండా కేసీఆర్ మహా కుట్ర చేస్తున్నాడు. షరతుల పేరుతో కన్ఫ్యూజ్ చేయడం అందులో భాగమే. హిందూ సమాజమంతా సంఘటితం కావాల్సిందే’ నని బండి సంజయ్ పిలుపునిచ్చారు.
చదవండి: స్పీకర్‌పై చర్యలు తీసుకోవాలి: బండి సంజయ్
Comments
Please login to add a commentAdd a comment