సాక్షి, తిరుమల : తిరుమల శ్రీవేంకటేశ‍్వరస్వామిని తెలంగాణ శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి గురువారం ఉదయం దర్శించుకున్నారు. స్పీకర్ కుటుంబసభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణ స్పీకర్‌కు టీటీడీ అధికారులు దగ్గరుండి స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులచే ఆశీర్వచనం అందించి, స్వామివారి తీర్థ ప్రసాదాలు, పట్టువస్త్రాలను స్పీకర్ కు అందజేశారు. శ్రీనివాసుని దర్శించుకోవడం, స్వామివారి సన్నిధిలో గడపడం చాలా ఆనందంగా ఉందని మధుసూదనాచారి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment