ఆంధ్రప్రదేశ్‌లోనే ప్రసిద్ధి చెందిన కోటల్లో ఒకటైన చంద్రగిరి కోటను ఆదివారం తెలంగాణ స్పీకర్ మధుసూదనా ఆచారి ఆదివారం సందర్శించారు. శ్రీక్రిష్ణదేవరాయులు నిర్మించిన కోటలో అలనాటి ఆయుధాలు, ఆరాధించిన దేవేరులను శిలా విగ్రహాలను పరిశీలించారు. అలాగే రాయల వారి కోట పరిసరాలలో ఉన్న పార్కు, ఆహ్లాదరకమైన వాతావరణాన్ని చూసి సిబ్బంది పనితనాన్ని మెచ్చుకున్నారు. ఈ సందర్భంగా రాయల వారి కాలం నాటి వస్తువులతో పాటు బ్రిటీషు కాలం నాటి నాణేలు, పత్రాలను నేటి తరంకు అందించేందుకు పురావస్తుశాఖ వారు చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి కోట అధికారి మోహన్, రమేష్ తదితరులు ఉన్నారు.
చంద్రగిరి కోటలో తెలంగాణ స్పీకర్
Published Sun, Aug 21 2016 7:48 PM | Last Updated on Mon, Oct 8 2018 3:44 PM
Advertisement