బిహార్‌ సీఎం కాన్వాయ్‌లో ప్రమాదం | Bihar CM Nitish Kumar's convoy met with an accident in Supaul | Sakshi
Sakshi News home page

బిహార్‌ సీఎం కాన్వాయ్‌లో ప్రమాదం

Published Fri, Jun 16 2017 9:10 AM | Last Updated on Tue, Sep 5 2017 1:47 PM

బిహార్‌ సీఎం కాన్వాయ్‌లో ప్రమాదం

బిహార్‌ సీఎం కాన్వాయ్‌లో ప్రమాదం

పట్నా: బిహార్‌ ముఖ‍్యమంత్రి నితీష్‌ కుమార్‌ కాన్వాయ్‌  ప్రమాదానికి  గురైంది.  ఈ  ప్రమాదంలో ఆరుగులు పోలీసులు గాయపడ్డారు. గురువారం  సాయంత్రం ఈ ప్రమాదం చోటు చేసుకుంది.  

పట్నా నుంచి కిషన్‌ గంజ్‌కు వస్తుండగా సుపౌల్‌ వద్ద ఈ యాక్సిడెంట్‌ జరిగింది.  ఎన్‌హెచ్‌-57 పై  ఒక ట్రక్ ను ఓవర్‌ టేక్‌ చేసేందుకు ప్రయత్నించడంతో అదుపు తప్పిన వీరి వాహనం హఠాత్తుగా  బోల్తా పడింది. గాయపడిన వారిని హుటాహుటిన దర్భంగా లోని పరాస్‌  ఆసుపత్రికి తరలించారు.  ప్రస్తుతం  వారి పరిస్థితి నిలకడగా ఉందని తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement