సాక్షి, మెదక్: తెలంగాణ శాసనసభ స్వీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కాన్వాయ్ ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన మెదక్ జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది. వివరాలు.. మనోహరబాద్ మండలం కాళ్ళకల్ వద్ద స్పీకర్ పోచారం కాన్వాయి వెళ్తుంది. కాన్వాయ్ వస్తున్న విషయాన్ని గమనించకుండా అదే సమమంలో ఓ వ్యక్తి రోడ్డు దాటేందుకు ప్రయత్నించాడు. దీంతో కాన్వాయ్‌లోని ఓ వాహనం వ్యక్తిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.
చదవండి: బద్వేల్, హుజురాబాద్ ఉప ఎన్నికల నామినేషన్ల పరిశీలన పూర్తి
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడిని నర్సింహ్మ రెడ్డిగా (50) పోలీసులు గుర్తించారు. ఇతను కొన్ని సంవత్సరాలుగా వలస వచ్చి కాళ్లకల్ గ్రామంలో నివాసముంటున్నాడు. పరిశ్రమలో కార్మికుడిగా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ప్రమాదంపై అతడి కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు.
చదవండి: ‘పది’లో ఇక 6 పేపర్లే.. టీఎస్ సర్కార్ కీలక ఉత్తర్వులు
Comments
Please login to add a commentAdd a comment