
సాక్షి, భువనగిరి : ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడుకి తృటిలో ప్రమాదం తప్పింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం వద్ద చంద్రబాబు కాన్వాయ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. ఆవును తప్పించబోయి డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో ఈ ప్రమాదం సంభవించింది. సడన్ బ్రేక్ కారణంగా ఒక్కసారిగా కాన్వాయ్‌లోని ముందున్న ఎస్కార్ట్ వాహనాన్ని చంద్రబాబు వాహనం బలంగా ఢీ కొట్టింది. అయితే చంద్రబాబు నాయుడు ప్రయాణిస్తున్న వాహనం బుల్లెట్ ప్రూఫ్ కావడంతో ప్రమాదం నుంచి ఆయన క్షేమంగా బయటపడ్డారు. సిబ్బందికి స్వల్ప గాయాలు కావడంతో మరో వాహనంలో వారిని తరలించారు. అమరావతి నుంచి హైదరాబాద్ వైపు వస్తుండగా శనివారం సాయంత్రం ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment