
కేటీఆర్ (ఫైల్ ఫోటో)
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మంత్రి కేటీఆర్ కాన్వాయ్‌లో స్వల్ప ప్రమాదం చోటుచేసుకుంది. నగరంలో మంగళవారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు కేటీఆర్ శ్రీకారం చుట్టారు. తొలుత నేటి ఉదయం ఎల్బీనగర్ చింతలకుంట చెక్ పోస్ట్ వద్ద అండర్ పాస్‌ను ఆయన ప్రారంభించారు. ఎల్బీనగర్ మార్గంలో రెండు నెలల్లో మెట్రో రైలు అందుబాటులోకి వస్తుందని తెలిపారు. అనంతరం మరో కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రి కేటీఆర్ ఉప్పల్ నుంచి రామాంతపూర్ బయలుదేరుతుండగా ఆయన కాన్వాల్‌లో ప్రమాదం జరిగింది. కేటీఆర్ కాన్వాయ్‌లో ఉన్న ఎంపీ మల్లారెడ్డి వాహనం ఢీకొనడంతో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడిని చికిత్స నిమిత్తం దగ్గర్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment