బ్రిజ్‌భూషణ్‌ కుమారుడు కరణ్‌ కాన్వాయ్‌ బీభత్సం.. ఇద్దరు మృతి | BJP Candidate Brij Bhushan Sharan Singh convoy Hit Bike | Sakshi
Sakshi News home page

అతి వేగంతో బీజేపీ అభ్యర్థి కరణ్‌ కాన్వాయ్‌ బీభత్సం.. యూపీలో టెన్షన్‌!

Published Wed, May 29 2024 1:42 PM | Last Updated on Wed, May 29 2024 1:47 PM

BJP Candidate Brij Bhushan Sharan Singh convoy Hit Bike

లక్నో: లోక్‌సభ ఎన్నికల వేళ యూపీ విషాదకర ఘటన చోటుచేసుకుంది. బీజేపీ అభ్యర్థి కరణ్‌ భూషణ్‌ సింగ్‌ కాన్వాయ్‌లోని ఓ కారు అదుపుతప్పి బైక్‌ను ఢీకొట్టింది.  ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందారు.

వివరాల ప్రకారం.. బీజేపీ సిట్టింగ్‌ ఎంపీ బ్రిజ్‌భూషణ్‌ కుమారుడు, కైసర్‌గంజ్ లోక్‌సభ స్థానం బీజేపీ అభ్యర్థి కరణ్ భూషణ్ సింగ్ కాన్వాయ్‌లోని ఫార్చ్యూనర్ కారు(UP 32 HW 1800) బుధవారం అతి వేగంతో వెళ్తూ ఓ బైక్‌ను ఢీకొట్టింది. హుజూర్‌పూర్-బహ్రైచ్ రైల్వే క్రాసింగ్ సమీపంలో గోండా వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా బైక్‌పై ప్రయాణిస్తున్న రెహాన్, షెహజాద్ అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు పాదచారులు గాయపడ్డారు. కాగా, కారుపై పోలీస్ ఎస్కార్ట్ అని రాసి ఉంది.

 

 

ఇక, ఈ ప్రమాదంలో ఫార్చ్యూనర్ కారు ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే కారులోకి ఎయిర్‌బ్యాగ్‌లు తెరుకుకోవడంలో డ్రైవర్‌, అందులో ప్రయాణిస్తున్న వారు ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాదం అనంతరం కారు వదిలేసి వారు పారిపోయారు. కాగా, సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. గాయపడిన వారిని స్థానికంగా ఉన్న సీహెచ్‌సీకి తరలించి వైద్య చికిత్స అందించారు. కారును పోలీసులు స్వాధీనం చేసుకుని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే, ప్రమాదం సందర్భంగా కరణ్‌ భూషణ్‌ కాన్వాయ్‌ ఉన్నాడా? లేదా? అనేది తెలియాల్సి ఉందని పోలీసులు చెప్పారు.

మరోవైపు.. ప్రమాదం అనంతరం ప్రజలు ఆగ్రహంతో సీహెచ్‌సీని ముట్టడించారు. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ ప్రమాదంలో మృతుడు రెహాన్‌ ఖాన్‌ తల్లి చందాబేగం కల్నల్‌గంజ్‌ కొత్వాలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో, పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. 

ఇదిలా ఉండగా.. గతంలో కూడా కరణ్‌ భూషణ్‌ ఇదే తీరుగా వ్యవహరించిన విషయం తెలిసిందే. యూపీలో అతి వేగంగా కారు నడిపి రైతుల మీదకు దూసుకెళ్లాడు. ఈ సందర్భంగా పలువురు రైతులు మృతిచెందారు. ఈ ఘటన అప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement