
లక్నో: మాజీ బీజేపీ ఎంపీ, మాజీ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో రెండో చాన్స్ అంటూ ఉండదని సోమవారం మీడియాతో మాట్లాడుతూ అన్నారు. లైంగిక ఆరోపణల కారణంగానే బీజేపీ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో తనకు టికెట్ లభించలేదా? అనే మీడియాకు ప్రశ్నకు స్పందించారు.
‘నా కుమారుడికి బీజేపీ ఎంపీగా టికెట్ ఇచ్చింది.కానీ బీజేపీ నా కుమారుడు కరణ్ భూషణ్ టికెట్ ఇస్తే విజయం సాధించాడు. నాకు బీజేపీ ఇక ఎప్పుడూ నాకు రెండో చాన్స్ ఇవ్వదు. నాకు బీజేపీ మరో అవకాశం ఇవ్వదని కూడా తెలుసు. నేను ముంగేరిలాల్ వలే ఎప్పుడూ కలలు కనలేదు’ అని అన్నారు.
ఇక.. గత ఏడాది బ్రిజ్ భూషన్ రెజ్లింగ్ ఫెడరేన్ ఉంటూ పలువురు మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై తీవ్ర దుమారం రేపాయి. ఈయన్ను ఫెడరేషన్ చీఫ్‌గా తొలగించాలని రెజ్లర్లు నిరసన వ్యక్తం చేశారు. రెజ్లర్ల నిరసన నేపథ్యంలో ఆయన ఆ పదవి నుంచి తొలగించబడ్డారు. దీంతో ఆయనకు బీజేపీ లోక్‌సభ ఎన్నికల్లో అవకాశం ఇవ్వలేదు. కానీ, ఆయన కుమారుడికి టికెట్ ఇవ్వటంతో విజయం సాధించారు. బ్రిజ్ భూషణ్ లైంగిక ఆరోపణల కేసులో గత వారం విచారణ ప్రారంభమైంది. అయితే తాను మాత్రం ఎలాంటి తప్పు చేయలేదని చెబుతున్నారు. ‘నేను ఏ తప్పు చేయలేదు. ఎందుకు ఒప్పుకుంటాను?’అని అంటున్నారు.