
సాక్షి, నల్గొండ: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం నారాయణస్వామికి తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారును కాన్వాయ్‌లోని వాహనం ఢీకొట్టింది. నల్గొండ జిల్లా కోదాడ సమీపంలో ఘటన జరిగింది. ఎస్కార్ట్ వాహనం డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో కాన్వాయ్‌లోని వాహనాలు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఉప ముఖ్యమంత్రికి ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.