missed accident
-
తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డికి తప్పిన ప్రమాదం
సాక్షి, వికారాబాద్: తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డికు పెను ప్రమాదం తప్పింది. కర్నాటకలోని ఉడిపి సమీపంలో ఆయన కారు ప్రమాదానికి గురైంది. కర్ణాటకలోని శృంగేరి పీఠ సందర్శనకు వెళ్తుండగా కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరు సమీపంలోని శనివారం ఉదయం ఈ ఘటన జరిగింది. ఎదురుగా వచ్చే వాహనాన్ని తప్పించబోయి కారు.. చెట్టును ఢీకొట్టినట్లు తెలుస్తోంది. బులెట్ ప్రూఫ్ వాహనం కావడంతో ప్రమాదం తప్పింది. ప్రస్తుతం ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సురక్షితంగా ఉన్నారు. ఈ ప్రమాదంలో తనకు ఎటువంటి గాయాలు కాలేదని రోహిత్ రెడ్డి స్పష్టం చేశారు. చదవండి: వేధింపుల ఎపిసోడ్.. సర్పంచ్ నవ్యకు నోటీసులు -
మంత్రి ఆదిమూలపు సురేష్‌కు తప్పిన ప్రమాదం
సాక్షి, విశాఖపట్నం: మంత్రి ఆదిమూలపు సురేష్‌కు ప్రమాదం తప్పింది. ఆర్కే బీచ్‌లో పారా గ్లైడింగ్ చేస్తుండగా టేకాఫ్ సమయంలో ఇంజిన్ పక్కకు ఒరిగింది. మంత్రి వ్యక్తిగత సిబ్బంది అలర్ట్ కావడంతో ప్రమాదం తప్పింది. చదవండి: జి–20 సదస్సుతో విశాఖకు ప్రపంచ గుర్తింపు -
భారీ శబ్ధాలతో ఆగిపోయిన ఎంఎంటీఎస్ రైలు.. పరుగులు తీసిన ప్రయాణికులు
సాక్షి, హైదరాబాద్: పెద్ద శబ్దంతో కదులుతున్న ఎంఎంటీఎస్ రైలు ఒక్కసారిగా నిలిచిపోవడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఏం జరిగిందోనన్న అయోమయంతో క్షణాల్లో రైలు దిగి బయటకు వచ్చేశారు. భారీ కుదుపుతో అకస్మాత్తుగా రైలు ఆగిపోయిన సమయంలో స్పీడ్ తక్కువగా ఉండడంతో పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే..శుక్రవారం ఉదయం 8.20 గంటల సమయంలో లింగంపల్లి నుంచి హైదరాబాద్ వైపు (నాంపల్లి) వెళ్తున్న ఎంఎంటీఎస్ రైలు బేగంపేట దాటింది. చదవండి: దసరాకు ప్రత్యేక రైళ్లు.. రైళ్ల వేళల్లో మార్పులు హుస్సేన్‌సాగర్ జంక్షన్ వద్దకు రాగానే ఒక్కసారిగా పెద్ద శబ్ధంతో పాటు భారీ కుదుపునకు గురై రైలు ఆగిపోయింది. దీంతో ప్రయాణికులు ఏం జరిగిందో అర్ధంకాక ఆందోళనకు గురయ్యారు. కొందరు భయంతో రైలు దిగి నడుచుకుంటూ వెళ్లిపోయారు. రైలుకు విద్యుత్ సరఫరా జరిగే పాథన్‌పై చెట్టుకొమ్మ పడడంతో సరఫరా నిలిచినట్లు సిబ్బంది గుర్తించారు. ఆ సమయంలో రైలు స్పీడ్ తక్కువగా ఉండడంతో పెనుప్రమాదం తప్పింది.15 నిమిషాల్లో సమస్యను పరిష్కరించడంతో యథావిధిగా రైలు ముందుకుకదిలింది. చెట్టుకొమ్మ పడడంతోనే సరఫరా నిలిచి రైలు నిలిచిపోయినట్లు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ భవానీ శంకర్ సరస్వత్ తెలిపారు. -
స్పైస్ జెట్ విమానానికి త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
పాట్నా: పైలట్ అప్రమత్తతతో స్పైస్ జెట్ విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. విమానంలో సాంకేతిక లోపం కారణంగా బిహటా ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో అత్యవసర ల్యాండింగ్ చేశారు. టేకాఫ్ సమయంలో విమానం ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో 185 మంది ప్రయాణికులు ఉన్నారు. పైలట్ అప్రమత్తతతో ప్రయాణికులకు ముప్పు తప్పింది. చదవండి: అగ్నిపథ్ అల్లర్లు: 700 కోట్ల ఆస్తి నష్టం.. 718 మంది అరెస్ట్ -
మంత్రి జోగి రమేష్ కారుకు తప్పిన ప్రమాదం
ఒంగోలు(ప్రకాశం జిల్లా): మంత్రి జోగి రమేష్ ప్రయాణిస్తున్న కారుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆయన సోమవారం ఉదయం చిలకలూరిపేట నుంచి నెల్లూరుకు కారులో వెళ్తుండగా ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలోని పెళ్లూరు వద్ద జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై పనుల నిమిత్తం ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో భాగంగా దారి మళ్లింపు బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. చదవండి: చినరాజప్ప ప్రధాన అనుచరుడు పల్లంరాజు అరెస్టు డివైడర్‌పై ఏర్పాటు చేసిన కోన్లు హోరు గాలికి ఎగిరి రోడ్డుకు అడ్డంగా పడటంతో మంత్రి కాన్వాయ్‌లోని ఓ కారు డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో కాన్వాయ్‌లోని కార్లు ఒకదానిని మరొకటి ఢీకొనడంతో పాటు పక్కనే ఉన్న డివైడర్‌ను ఢీకొన్నాయి. మంత్రి జోగి రమేష్ ప్రయాణిస్తున్న కారు కూడా అదుపు తప్పినప్పటికీ.. ఆయనకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. వెంటనే మరో కారులో ఎక్కి ఆయన వెళ్లిపోయారు. హైవే మొబైల్ సిబ్బంది, తాలూకా సీఐ శ్రీనివాసరెడ్డి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన కారును పక్కకు తొలగించారు. -
Samta Express: బోగీల నుంచి విడిపోయిన ఇంజిన్.. కిలో మీటర్ దూరం వెళ్లి..
పార్వతీపురం టౌన్/ సీతానగరం(పార్వతీపురం జిల్లా): విశాఖ నుంచి నిజాముద్దీన్ వెళ్లే సమతా సూపర్ ఫాస్ట్ రైలుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. రైలు బుధవారం ఉదయం 9.20 గంటలకు విశాఖ నుంచి బయలు దేరింది. 11 గంటలకు సీతానగరం రైల్వేస్టేషన్ దాటింది. సీతానగరం–పార్వతీపురం రైల్వే స్టేషన్ల మధ్యలో గుచ్చిమి గ్రామం రైల్వే గేట్ సమీపంలో సాంకేతిక కారణాలతో బోగీల నుంచి ఇంజిన్ విడిపోయింది. ఇంజిన్ విడిపోయిన విషయాన్ని గ్రహించిన లోకోపైలెట్ ఇంజిన్‌ను నిలుపుదల చేయకుండా కిలోమీటరు మేర ముందుకు తీసుకెళ్లి నిలిపాడు. చదవండి: ముప్పు తప్పినట్లే.. తీరం దాటిన అసని తుపాను ఇంజిన్ వేగాన్ని ఏ మాత్రం తగ్గించినా బోగీలు దానికి ఢీకొని రైలు పడిపోయి పెను ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అయితే లోకోపైలెట్ చాకచక్యంగా ఇంజిన్ ముందుకు తీసుకెళ్లాడు. వెనుక వస్తున్న బోగీలు వేగం తగ్గి అవి పూర్తిగా నిలిచిపోయాక.. తిరిగి ఇంజిన్‌ను వెనుక్కు తీసుకెళ్లి బోగీలకు అమర్చాడు. సాంకేతిక లోపాలను సరిదిద్దాక రైలు ముందుకు సాగింది. 11.36 గం.కు పార్వతీపురం రైల్వేస్టేషన్‌కు చేరుకోవాల్సిన సమతా ఎక్స్‌ప్రెస్ 12.30 గం.కు చేరుకుంది. లోకోపైలెట్ చాకచక్యంతో పెను ప్రమాదం తప్పిందని ప్రయాణీకులు ఊపిరిపీల్చుకున్నారు. -
శింగనమల ఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదం
అనంతపురం క్రైం: శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కారును మరో వాహనం వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. అనంతపురం రూరల్ సీఐ మురళీధర్ రెడ్డి తెలిపిన మేరకు.. ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి బుధవారం రాత్రి అనంతపురం శివారులోని సోములదొడ్డి వద్ద ఉన్న ఇస్కాన్ టెంపుల్‌కు వెళ్లి తిరుగు ప్రయాణమయ్యారు. (చదవండి: పెళ్లికొడుకు కదా అని ‘చెప్పినట్టు’ చేస్తే... అశ్లీల వీడియోలతో..) ఎమ్మెల్యే వాహనం సోములదొడ్డి వద్ద నేషనల్ హైవే మీదకు మళ్లిన వెంటనే వెనుక వైపు నుంచి ఫోర్డ్ ఫిగో కారు అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. అదృష్టవశాత్తు ఎమ్మెల్యేకు ఎటువంటి ఆపద తలెత్తలేదు. ప్రమాదంలో రెండు కారులూ దెబ్బతిన్నాయి. ఎమ్మెల్యే వాహనంలో ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతితో పాటు డ్రైవర్, గన్‌మెన్ ఉన్నారు. ఫోర్డ్ ఫిగో వాహనంలో డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు ఉన్నట్లు సమాచారం. ఫిగో వాహనం ముందుభాగం నుజ్జునుజ్జు అయ్యింది. అయితే అందులోని ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో అందులో ప్రయాణిస్తున్నవారు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనపై అనంతపురం రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: రోకలి బండతో మోది.. భర్తను హతమార్చి -
కామారెడ్డి జిల్లాలో తప్పిన రైలు ప్రమాదం
-
ఏపీ డిప్యూటీ సీఎంకు తప్పిన ప్రమాదం
సాక్షి, నల్గొండ: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం నారాయణస్వామికి తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారును కాన్వాయ్‌లోని వాహనం ఢీకొట్టింది. నల్గొండ జిల్లా కోదాడ సమీపంలో ఘటన జరిగింది. ఎస్కార్ట్ వాహనం డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో కాన్వాయ్‌లోని వాహనాలు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఉప ముఖ్యమంత్రికి ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
పది అడుగుల లోతుకు కుంగిన భవనం
♦ తప్పిన ప్రమాదం ♦ 14 మంది రక్షింపు అన్నానగర్: రెండు అంతస్తుల భవనం కుంగిన ప్రమాదంలో అదృష్టవశాత్తు 14 మంది స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఈ ఘటన అంబత్తూర్లో శనివారం చోటుచేసుకుంది. అంబత్తూరు వెంకటాపురం, మోనస్వామి మఠం వీధిలో రెండు అంతస్తుల ప్రయివేటు భవనం ఉంది. ఈ భవనంలో ఆరు పోర్షన్లు ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్లో చంద్రశేఖరన్(69) రిటైర్డ్ ఎల్ఐసీ ఉద్యోగి. ఇతని భార్య ఉమా(60). వీరి కుమారుడు విశ్వనాథన్(32), కోడలు భువన(30), మనవడు మనువరాలితో నివసిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం బంధువుల ఇంటికి విశ్వనా«థన్ కుటుంబంతో సహా వెళ్లారు. ఇంట్లో చంద్రశేఖర్, ఉమా ఉన్నారు. చంద్రశేఖర్‌కు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో 7 గంటల సమయంలో నిద్రపోయాడు. ఉమా వంట చేస్తుండగా భవనం హఠాత్తుగా పది అడుగుల లోపలికి కుంగిపోయింది. వీరి కేకలు విని ఉమా అక్కడికి పరుగెత్తుకుంటూ వచ్చింది. ఆమె కూడా పది అడుగుల గుంటలో పడి పోయింది. వీరిద్దరి కేకలు విని మొదటి, రెండవ అంతస్తుల్లో ఉన్న వారు బిల్డింగు నుంచి వచ్చి చంద్రశేఖర్, ఉమ ఇద్దరు గుంటలో చిక్కుకుని ప్రాణాలకు పోరాడుతుండడం చూసి దిగ్భ్రాంతి చెందారు. తరువాత ఇద్దరిని నిచ్చెన వేసి సురక్షితంగా వెలుపలికి రప్పించారు. ఈ భవనంలో నివసిస్తున్న 14 మంది ఎటువంటి ప్రమాదం లేకుండా ప్రాణాలతో బయటపడ్డారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి వచ్చి విచారణ చేశారు. ఇందులో భవనం నిర్మించిన స్థలం బావిలో ఉన్నట్లు తెలిసింది. బావిని సరిగ్గా మూయకపోవడంతో ఈ ప్రమాదం ఏర్పడిందని అధికారులు తెలిపారు.