Tandur MLA Pilot Rohit Reddy Missed Accident In Karnataka - Sakshi
Sakshi News home page

తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డికి తప్పిన ప్రమాదం

Published Sat, Jun 24 2023 2:47 PM | Last Updated on Sat, Jun 24 2023 3:06 PM

Tandur Mla Pilot Rohit Reddy Missed Accident In Karnataka - Sakshi

సాక్షి, వికారాబాద్‌: తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డికు పెను ప్రమాదం తప్పింది. కర్నాటకలోని ఉడిపి సమీపంలో ఆయన కారు ప్రమాదానికి గురైంది. కర్ణాటకలోని శృంగేరి పీఠ సందర్శనకు వెళ్తుండగా కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరు సమీపంలోని శనివారం ఉదయం ఈ  ఘటన జరిగింది.

ఎదురుగా వచ్చే వాహనాన్ని తప్పించబోయి కారు.. చెట్టును ఢీకొట్టినట్లు తెలుస్తోంది. బులెట్ ప్రూఫ్ వాహనం కావడంతో ప్రమాదం తప్పింది. ప్రస్తుతం ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సురక్షితంగా ఉన్నారు. ఈ ప్రమాదంలో తనకు ఎటువంటి గాయాలు కాలేదని రోహిత్ రెడ్డి స్పష్టం చేశారు.
చదవండి: వేధింపుల ఎపిసోడ్‌.. సర్పంచ్‌ నవ్యకు నోటీసులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement