
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో లగచర్ల ఘటన రాజకీయంగా సంచలనంగా మారింది. కలెక్టర్‌పై దాడి కేసులో ఇప్పటికే బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే సహా పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా మరో ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.
లగచర్ల దాడి కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరో ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. అలాగే, పలువురు లగచర్ల గ్రామస్థులను అదుపులోకి తీసుకుని పరిగి పీఎస్‌కు తరలించారు. ఎనిమిది మందికి వైద్య పరీక్షలు నిర్వహించి వారిని కోర్టులో హాజరుపరచనున్నారు.
ఇక, లగచర్ల ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటకే 17 మందిని అరెస్ట్ చేశారు. వారిని రిమాండ్‌కు తరలించారు. మరోవైపు.. డీజీ మహేస్ భగవత్ కూడా లగచర్ల ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు. ఈ క్రమంలో పరారీలో ఉన్న వారి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. వారిని పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నట్టు సమాచారం.
