( ఫైల్ ఫోటో )
సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. గురువారం ఉదయం విఐపీ దర్శన సమయంలో ఏపీ మంత్రులు ఆళ్ల నాని, నారాయణస్వామి, సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకొన్నారు.
చదవండి: చీప్ లిక్కర్ రూ.75, కుదిరితే రూ.50కే.. వాహ్.. ఎంత గొప్ప పథకం: కేటీఆర్
అనంతరం ఆలయ వెలుపల డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మీడియాతో మాట్లాడుతూ, సోము వీర్రాజు బీజేపీకి అధ్యక్షుడా, తాగుబోతులకు అధ్యక్షుడా అర్థం కావడం లేదన్నారు. చీప్ లిక్కర్ ఇచ్చి ప్రజలను సంతోషపెడతానని చెప్పడం ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనమని విమర్శించారు. సీఎం జగన్ ఓ సింహం, ఎంతమంది వచ్చినా ఒంటరిగానే పోరాడతారని పేర్కొన్నారు.
చంద్రబాబు సీఎంగా ఉంటే కోటీశ్వరులకు లబ్ధి కలుగుతుందనే ఉద్దేశంతోనే అన్ని పార్టీలు చంద్రబాబు మాట వింటున్నాయన్నారు. సోము వీర్రాజు లాంటి వ్యక్తులను పార్టీలో పెట్టుకుంటే బీజేపీకి డిపాజిట్లు కూడా రావని మోదీ గుర్తించాలని హితవు పలికారు. ఇలాంటి వాళ్లు రాజకీయాల్లోకి ఎందుకొచ్చారో అర్థం కావడం లేదని, ఎవరెన్ని కుట్రలు చేసిన సీఎం జగన్‌కు భగవంతుడి ఆశీస్సులు ఉన్నాయని నారాయణ స్వామి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment