వైరల్‌: బుల్లెట్‌ బండి పాటకు ఏపీ డిప్యూటీ సీఎం సతీమణి డ్యాన్స్‌ | AP Deputy Cm Wife Dance On Bullet Bandi Song, Video Goes Viral | Sakshi
Sakshi News home page

వైరల్‌: బుల్లెట్‌ బండి పాటకు ఏపీ డిప్యూటీ సీఎం సతీమణి డ్యాన్స్‌

Published Thu, Sep 16 2021 9:12 PM | Last Updated on Sat, Sep 18 2021 4:58 PM

AP Deputy Cm Wife Dance On Bullet Bandi Song, Video Goes Viral - Sakshi

సాక్షి, తిరుపతి: గత కొన్ని రోజులుగా ఎక్కడ విన్న బుల్లెట్‌ బండి పాటనే మార్మోగుతోంది. ఏ వేడుకల్లో చూసిన ఇదే పాట వినిపిస్తోంది. ఎప్పుడైతే ఈ పాటకు పెళ్లి కూతురు డ్యాన్స్‌ చేసిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు దీని హవా కొనసాగుతూనే ఉంది. ‘నీ బుల్లెట్‌ బండెక్కి వచ్చెత్తా పా.. డుగ్గు డుగ్గు’  అంటూ సాగే ఈ పాటకు చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ స్టెప్పులేస్తున్నారు.

అంత పాపులర్‌ అయిన ఈ సాంగ్‌కు తాజాగా ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి సతీమణి డాన్స్‌ చేశారు. మంత్రి నారాయణస్వామి 42వ వివాహ వార్షికోత్సవాన్ని తిరుపతిలోని ఆయన నివాసంలో కుటుంబ సభ్యుల మధ్య జరుపుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి సతీమణి బుల్లెట్‌ బండి పాటకు భర్త ముందు సరదాగా డాన్స్‌ చేశారు. ఆమె తన హావభావాలు, స్టెప్పులతో  అందరిని ఆకట్టుకుంటున్నాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement