
సాక్షి, తిరుపతి: ఎన్టీఆర్ పేరు పలికే అర్హత కూడా చంద్రబాబుకు లేదని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఎన్టీఆర్ పెట్టిన మద్యపాన నిషేధం, రూ. 2 బియ్యం పథకాన్ని బాబు నిర్వీర్యం చేశారని దుయ్యబట్టారు. ఎన్నికలప్పుడే చంద్రబాబుకు ఎన్టీఆర్ గుర్తుకు వస్తారన్నారు. ఎన్నికల్లో ఎన్టీఆర్ ఫోటో లేకుండా ఒక్క సీటు అయినా గెలవగలరా? అని ప్రశ్నించారు.
చదవండి: కలెక్టర్ చెట్టు కింద కూర్చోలేరుగా: సుప్రీంకోర్టు
ఓట్ల కోసం చంద్రబాబు నాటకాలు ఆడటం మానుకోవాలని మంత్రి హితవు పలికారు. ‘‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో నాడు-నేడు కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలకు కొత్త హంగులు తీసుకొచ్చారు. చంద్రబాబు ఏనాడైనా ఎన్టీఆర్ పథకాలను అమలు చేశాడా?. సారా వ్యాపారం చేసిన ఘనత చంద్రబాబుదని’’ నారాయణస్వామి నిప్పులు చెరిగారు.
‘‘చంద్రబాబు ఎలా ఎన్టీఆర్ వారసుడు అవుతారు?. చంద్రబాబు, లోకేష్ సొంతంగా పార్టీ పెట్టి ఎన్నికల బరిలోకి దిగాలి. కొత్త పార్టీ పెట్టి ఎన్నికల్లో గెలిచే సత్తా చంద్రబాబుకు ఉందా?. పేదవాడి పట్ల చంద్రబాబుకు ప్రేమ లేదు. పేదల కష్టాలు ఏనాడు పట్టించుకోలేదు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా. పవన్ పొత్తు లేకుండా ప్రజల్లో వచ్చి సత్తా చూపించాలని’’ మంత్రి నారాయణ స్వామి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment