చిత్తూరు: చంద్రబాబు బూటకపు హామీలను ప్రజలు నమ్మరని, టీడీపీకి ఇవే చివరి ఎన్నికలని డిప్యూటీ సీఎం నారాయణస్వామి స్పష్టం చేశారు. గురువారం మండలంలోని వనదుర్గాపురం, తొట్టికండ్రిగ, కృష్ణజమ్మపురం, శ్రీకావేరిరాజుపురం, పాలసముద్రం పంచాయతీల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. డిప్యూటి సీఎం మాట్లాడుతూ 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 99.5 శాతం అమలు చేశారన్నారు. సచివాలయాల ద్వారా 1.35 లక్షల మందికి ఉద్యోగావకాశం కల్పించారని తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖలో 54 వేల పోస్టుల భర్తీ, పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా చట్టం తీసుకువచ్చారని వెల్లడించారు.
కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్‌తో కలసి ఐదేళ్లలోమొత్తం 6.48 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్లు వివరించారు. ప్రజలకు మేలు చేశామనే పెద్దసంఖ్యలో ఇతర పార్టీల నుంచి వైఎస్సార్‌సీపీలోకి వస్తున్నారని తెలిపారు. ఎన్నికల్లో గెలవలేమని భావించే చంద్రబాబు జనసేన, బీజేపీతోపాటు రహస్యంగా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారని ఆరోపించారు. ఒకప్పుడు ప్రధానమంత్రి నరేంద్రమోదీని హీనంగా తిట్టిన చంద్రబాబు కేసుల భయంతో బీజేపీకి సాష్టాంగం పడ్డారని విమర్శించారు.
అధికారం కోసం కుట్రలకు పాల్పడుతున్న చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించామని, ఈ ఎన్నికల్లో తన కుమార్తె కృపాలక్ష్మిని ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. చంద్రబాబు కళ్లలో ఆనందం చూడడానికే పీసీసీ అధ్యక్షులు షరి్మల విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.
రాజన్న రాజ్యం తెస్తానని తెలంగాణలో పార్టీ పెట్టిన షర్మిల అక్కడి ప్రజలు తిరస్కరించడంతో ఏపీకి వలస వచ్చారని విమర్శించారు. ప్రతిపక్షాలన్నీ ఏకమైనామళ్లీ సీఎంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారం చేపట్టడం ఖాయమన్నారు.
కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎస్.శివప్రకాష్ రాజు, సింగిల్‌విండో చైర్మన్ గాలి జ్యోతి, వైస్ ఎంపీపీ శేఖర్ యాద్, పార్టీ మండల కన్వీనర్ తులసియాదవ్, జెడ్పీటీసీ సభ్యుడు అన్భళగన్, సినీ నిర్మాత షణ్ముగం, ఆర్‌బీకే చైర్మన్ పోలయ్య, పుత్తూరు మార్కెట్ డైరెక్టర్ రమాదేవి, కో–ఆప్షన్ మెంబర్ వేలు, సర్పంచ్ గాలి మహేష్ బాబు, అయ్యప్ప, నరసింహరాజు, భాష్కర్‌రెడ్డి, సుబ్రమణ్యంరెడ్డి, పుత్తూరు కేశవరెడ్డి, మురళి, నరసింహన్, ప్రేమ్‌కుమార్, ఆనందన్, ప్రకాశ్, కుమార్, చంద్రశేఖర్‌రాజు, షణ్ముగరెడ్డి, వరదరాజు, చిన్నవరదరాజు, సిద్దమందడి, శరవణన్, కుట్టి, చిన్నపయ్యన్, లక్ష్మణన్, రాజామణి, అరుల్, బాబు, మనోహర్, దనంజయన్, వాసురాజు, కుమార్, ఎంపీటీసీ మాజీ సభ్యుడు షణ్ముగం పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment