సీఎం పోలవరం పర్యటనలో అపశ్రుతి | Prathipati Pulla Rao Convoy Car Met An Accident In Polavaram | Sakshi
Sakshi News home page

Published Wed, Sep 12 2018 3:04 PM | Last Updated on Wed, Sep 12 2018 8:49 PM

Prathipati Pulla Rao Convoy Car Met An Accident In Polavaram - Sakshi

సాక్షి, పశ్చిమ గోదావరి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం పర్యటనలో అపశ్రుతి చోటుచేసుకుంది. బుధవారం చంద్రబాబు తన కుటుంబసభ్యులతో, ప్రజాప్రతినిధులతో కలిసి పోలవరంలో పర్యటించారు. ఈ సందర్భంగా పోలవరం గ్యాలరీని ప్రారంభించారు. కాగా ఈ పర్యటనలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కాన్వాయ్‌లోని కారు బోల్తా కొట్టింది. వర్షం కారణంగా కారు టైర్లు జారడంతో కారు పల్టీ కొట్టింది. ఈ ఘటనలో కారు కొండవైపుకు పడటంతో ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో పలువురు టీడీపీ నేతలకు స్పల్ప గాయాలయ్యాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement