లోకేష్ కాన్వాయ్‌లో అపశ్రుతి: పల్టీలు కొట్టిన కారు
లోకేష్ కాన్వాయ్‌లో అపశ్రుతి: పల్టీలు కొట్టిన కారు
Published Fri, Dec 16 2016 3:36 PM | Last Updated on Wed, Aug 29 2018 3:37 PM
రాజమండ్రి: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కాన్వాయ్ లో అపశ్రుతి చోటుచేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి శివారు బొమ్మూరు సమీపంలో వేమగిరి వద్ద కాన్వాయ్‌లోని ఓ కారు ఢివైడర్‌ను ఢీకొట్టి మూడు పల్టీలు కొట్టింది.
ఆ కారు ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు వాహనంగా గుర్తించారు. ఈ ప్రమాదంలో ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుతో పాటు కారు డ్రైవర్, గన్‌మెన్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని హుటాహుటిన దగ్గరలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా ఈ రోజు చంద్రబాబు కు తృటిలో ప్రమాదం తప్పిన విషయం తెలిసిందే. చిత్తూరు పర్యటనలో ఉన్న సీఎం బస్సులో ఒక్కసారి పొగలు వచ్చాయి. దీంతో అధికారులు అప్రమత్తమవ్వడంతో ప్రమాదం తప్పింది.
Advertisement
Advertisement