యాసంగిలో వరిసాగు వద్దు | Telangana: KTR stresses on palm oil cultivation At Sircilla | Sakshi
Sakshi News home page

యాసంగిలో వరిసాగు వద్దు

Sep 21 2021 2:13 AM | Updated on Sep 21 2021 2:13 AM

Telangana: KTR stresses on palm oil cultivation At Sircilla - Sakshi

సిరిసిల్ల కలెక్టరేట్‌లో మాట్లాడుతున్న కేటీఆర్‌  

సిరిసిల్ల: యాసంగిలో వరికి ప్రత్యామ్నాయంగా వే రుశనగ, పొద్దుతిరుగుడు, కందులు, కూరగాయలు, ఆయిల్‌పామ్‌ పంటలను సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు అధికారులకు సూచిం చారు. ప్రత్యామ్నాయ పంటల ఆవశ్యకతను వ్యవసాయాధికారులు రైతులకు అర్థమయ్యేలా వివరించాలని కోరారు. సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లో యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలపై రైతుబంధు సమితి సభ్యులకు మంత్రి కేటీఆర్‌ అవగాహన కల్పించారు.

దొడ్డు వడ్లు కొనమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిందని, ఈ నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసుకోవాలని మంత్రి సూచించారు. దొడ్డు వరి వద్దనే విషయాన్ని రైతులకు కరాఖండిగా చెప్పాలని సూచించారు. ఆదర్శ రైతు పర్శరాములు బ్లాక్‌రైస్‌ పండించిన విషయాన్ని మంత్రి కేటీఆర్‌ ఈ సమావేశంలో ప్రస్తావించారు. అయితే మార్కెటింగ్‌ లేక ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆ రైతు మంత్రి దృష్టికి తీసుకెళ్లగా.. మార్కెటింగ్‌ అంశాన్ని తెలుసుకుని చెప్తానని మంత్రి స్పష్టం చేశారు. 

దేశానికి తెలంగాణే ఆదర్శం 
దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు రూ.5 లక్ష ల బీమాను అమలు చేస్తున్నామని, ఈ విషయంలో తెలంగాణ, దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని కేటీఆర్‌ అన్నారు. అలాగే రైతుబంధు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. 24 గంటల ఉచిత కరెంట్, రైతుల రుణమాఫీ వంటి పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందన్నా రు. ఇప్పటి వరకు 9 లక్షల మంది రైతుల రుణాలు మాఫీ చేశామని వివరించారు. రాష్ట్రంలో 3 కోట్ల మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యం పండిందని తెలిపారు.  

ప్రజాప్రతినిధులు ముందుకు రావాలి..  
రైతులు ఎక్కడ ఏ పంట వేశారన్న సమాచారం.. వ్యవసాయ అధికారుల వద్ద పక్కాగా ఉండాలని మంత్రి కేటీఆర్‌ సూచించారు. రైతువేదికల్లో క్లస్టర్ల వారీగా సమావేశాలు నిర్వహించి రైతులకు పంట మార్పిడిపై అవగాహన కల్పించాలన్నారు. ప్రజాప్రతినిధులు ముందు గా బాధ్యత తీసుకుని ప్రత్యామ్నాయ పంటలు వేయాలని, ఇతర రైతులకు ఆదర్శంగా నిలవాలని అన్నారు.

అలాగే ఆయిల్‌పామ్‌ సాగు వివరాలు తెలుసుకోవడానికి ఖమ్మం జిల్లాలోని అశ్వారావుపేటకు సిరిసిల్ల జిల్లా రైతులను తీసుకెళ్లాలని కేటీఆర్‌ అధికారులకు సూచిం చారు. ముస్తాబాద్‌ మండలం మోహినికుంటలో తాను కూడా 15 ఎకరాల భూమి తీసు కుని స్వయంగా ఆయిల్‌పామ్‌ సాగు చేస్తానని తెలిపారు. జెడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement