
కాలువలో పడ్డవారిని పైకి తీస్తున్న గ్రామస్తులు
ఈపూరు(పల్నాడు జిల్లా): మండలంలోని నెమలిపురికి చెందిన సాంబశివరావు, కోటేశ్వరరావులు బంధువులు. బొమ్మరాజుపల్లికి చెందిన వీరి బంధువు శేషారావు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఆయన మృతదేహాన్ని చూసేందుకు వీరిద్దరు ద్విచక్ర వాహనంపై బయలుదేరారు.
భద్రుపాలెం గ్రామసమీపంలోకి వచ్చేసరికి ద్విచక్రవాహనం అదుపు తప్పి నాగార్జున సాగర్ మెయిన్‌కెనాల్‌లో పడింది. స్పందించిన గ్రామస్తులు రక్షించారు. తాళ్ల సహాయంతో ఇద్దరిని పైకి లాగి వారిని ప్రాణాపాయం నుంచి కాపాడారు. అనంతరం ద్విచక్ర వాహనాన్ని కూడా తాళ్ల సాయంతో పైకి తీశారు. ఇద్దరి ప్రాణాలను కాపాడిన గ్రామస్తులను అధికారులు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment