బెంగళూరు: బీజేపీ సీనియర్‌నేత, కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్పపై లైంగిక దాడి కేసు పెట్టిన మహిళ మరణించింది. దీర్ఘకాలిక అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించిందని సమాచారం.
బెంగళూరు డాలర్‌సిటీలోని యడ్యూరప్ప ఇంటికి ఈ ఏడాది ఫిబ్రవరి2న తన కూతురుతో కలిసి వెళ్లానని, ఈ సందర్భంగా తన కూతురిపై యడ్యూరప్ప లైంగికదాడి చేశారని మహిళ కేసు పెట్టింది.
దీంతో మార్చి 14న బెంగళూరు సదాశివనగర్ పోలీస్‌స్టేషన్‌లో యడ్యూరప్పపై పోక్సో చట్టంలోని సెక్షన్ 8తో పాటు ఐపీసీ 354ఏ సెక్షన్‌ల కింద కేసు నమోదైంది.
అనారోగ్యంతో బాధపడుతున్న ఆ మహిళకు శ్వాససంబంధ సమస్య రావడంతో ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చించారని, చికిత్స పొందుతూ ఆమె మరణించిందని పోలీసులు తెలిపారు. యడ్యూరప్పపై లైంగికదాడి కేసును ప్రస్తుతం కర్ణాటక సీఐడీ దర్యాప్తు చేస్తోంది.
కేసు పెట్టిన యువతి తల్లి మరణించినప్పటికీ ఆమె స్టేట్‌మెంట్ ఆధారంగా విచారణ కొనసాగుతుందని సీఐడీ అధికారులు తెలిపారు. అయితే లైంగికదాడి ఆరోపణలను యడ్యూరప్ప అప్పట్లో ఖండించారు.
Comments
Please login to add a commentAdd a comment