సోలార్ పవర్ వచ్చేస్తోంది..
సోలార్ పవర్ వచ్చేస్తోంది..
Published Wed, Aug 10 2016 6:45 PM | Last Updated on Mon, Sep 4 2017 8:43 AM
సాక్షి, అమరావతి : సౌరశక్తి ద్వారా విద్యుత్తు ఉత్పత్తి చేసే ప్రక్రియ జిల్లాలో సాగుతోంది. రూఫ్ టాప్‌లో తమ అవసరాలకు అనుగుణంగా సోలార్ పవర్‌ను ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. సొలార్ నెట్ మీటరింగ్ ద్వారా వచ్చే విద్యుత్తులో మనకు కావలసినంత వాడుకోగా మిగిలిన విద్యుత్తును గ్రిడ్‌కు పంపే వెసులుబాటు ఉంది. దీనివల్ల మిగిలిన విద్యుత్తుకు డిస్కంలు డబ్బులు చెల్లిస్తాయి. ఇందులో ఒకటి నుంచి ఐదు కిలోవాట్ల వరకు వ్యక్తిగతంగా ఏర్పాటు చేసుకోవచ్చు. కిలో వాట్ ఏర్పాటుకు రూ.89,998 ఖర్చు కానుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం నెడ్ క్యాప్ ద్వారా కిలో వాట్‌కు రూ.15,000, కేంద్ర ప్రభుత్వం ద్వారా రూ.22,500 వెరసి మొత్తం రూ.37,500 సబ్సిడీ ఇవ్వనున్నారు. జిల్లాలో మూడు మెగా వాట్ల సోలార్ విద్యుత్తు ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. కిలోవాట్ సోలార్ ప్లాంట్ల ద్వారా 4–5 యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి కానుంది. జిల్లాలో ఇప్పటి వరకు కేవలం 58 మంది 240 కిలోవాట్ల సోలార్ విద్యుత్తును ఏర్పాటు చేసుకునేందుకు దరఖాస్తులు వచ్చాయి. మొదట దరఖాస్తు చేసుకున్న వారి ఆప్లికేషన్‌ల ప్రాధాన్యత క్రమంలో సోలార్ పవర్‌ను ఏర్పాటుకు అనుమతి ఇవ్వనున్నారు. మూడు మెగా వాట్ల వరకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ రూ.15000 ఇస్తుంది. దీనిని మించితే రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీ రాదు. కేంద్రం విడుదల చేసే సబ్సిడీ మాత్రమే వస్తుంది. ఓ సోలార్ విద్యుత్తు ఉపకరణాలు ఏర్పాటు చేసుకుంటే బ్యాటరీలు ఉండవు కనుక ఎటువంటి నిర్వహణ ఖర్చు ఉండదు.
రెస్కో సిస్టం ద్వారా..
జిల్లాలో లాభ సాటి లేని 16 రకాల ప్రభుత్వ సంస్థల్లో సోలార్ పవర్‌ను రెస్కో సిస్టం ద్వారా ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ప్రయివేటు కంపెనీలే పెట్టుబడి పెట్టి ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ సోలార్ పవర్‌ను ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం యూనిట్ విద్యుత్తుకు చెల్లిస్తున్న ధర కంటే తక్కువకే విద్యుత్తును సరఫరా చేస్తారు. 18–25 సంవత్సరాల పాటు వారి ఆధీనంలో ఉంటాయి. తరువాత ప్రభుత్వ సంస్థలకే సోలార్ పరికరాలను అప్పగించాల్సి ఉంటుంది. ప్రస్తుతం జిల్లాలో ప్రయోగాత్మకంగా జీజీహెచ్, నీటిపారుదలశాఖ కార్యాలయాలు, లాంఫాంలో త్వరలో సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ సంస్థలో 440 కిలో వాట్ల సోలార్ పవర్, ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు పలు సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయి. ఇందులో అక్షర సోలార్ పవర్ 500 కిలో వాట్లు, సీరిస్ ఎనర్జీ సిస్టం 500, పీఈసీ లిమిటెడ్ 500, శ్రీరాయలసీమ హైస్రె్టన్త్ హైపో 500, యాక్సస్ సోలార్ లిమిటెడ్ 1000, జున్నా సోలార్ సిస్టం 500, ప్రీమియర్ సోలార్‌సిస్టం 500, వైయోమా ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ 500, పీపీఎస్ ఎన్వీరో పవర్ లిమిటెడ్ 1000, సన్ టెక్నాలజీస్ 1000, అతిథి సోలార్ ప్రైవేటు లిమిటెడ్ 500, నోవాస్ గ్రీన్ ఎనర్జీ సిస్టం 500 కిలోవాట్లు ఉన్నాయి.
ఎంతో ఉపయోగం..
సోలార్ పవర్‌ను ఏర్పాటు చేసుకుంటే ఐదేళ్లలోనే పెట్టుబడి వస్తుంది. దీనివల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. వాతావరణ కాలుష్యం ఉండదు. విద్యుత్తు ఆదా అయితే రైతులకు ఉపమోగపడుతుంది. వ్యక్తిగతంగా తమ ఇంటి పైకప్పులపై సోలార్ పరికరాలను ఏర్పాటు చేసుకుంటే ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది.
హరినాథ్, నెడ్‌క్యాప్ మేనేజరు, గుంటూరు
Advertisement
Advertisement