సాక్షి, హైదరాబాద్: దేశంలో 2020 నాటికి 40 గిగావాట్ల రూఫ్‌టాప్ సౌరవిద్యుత్ ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోవడానికి 9.4 గిగావాట్ గంటల విద్యుత్ నిల్వ వ్యవస్థను అభివృద్ధిపరుచుకోవాలని నీతి ఆయోగ్ స్ప ష్టం చేసింది. తెలంగాణ రాష్ట్రం 2 వేల మెగావాట్ల రూఫ్‌టాప్ సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కోసం 370 మెగావాట్ల విద్యుత్ నిల్వ వ్యవస్థను 2020లోగా అభివృద్ధి చేసుకోవాలని సూచించింది. దేశంలో విద్యుత్ నిల్వ వ్యవస్థ అభివృద్ధికి దిశానిర్దేశం చేసేందుకు ‘ఎనర్జీ స్టోరేజీ సిస్టం–రోడ్‌మ్యాప్ ఫర్ ఇండియా 2019–32’ పేరుతో నీతి ఆయోగ్ తాజాగా ఓ నివేదికను విడుదల చేసింది. పర్యావరణ మార్పుల సవాళ్లను అధిగమించడంలో భాగంగా కర్బన ఉద్గారాలను నియంత్రించేందుకు పునరు త్పాదక విద్యుదుత్పత్తిని కేంద్రం ప్రోత్సహిస్తోంది. పునరుత్పాదక విద్యుత్ ను నిల్వ చేసుకొని అవసరమైనట్లుగా వినియోగించుకునే పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటే బొగ్గు, గ్యాస్, పెట్రోలియం వంటి కాలుష్యకారక శిలాజ ఇంధనాలను మండించి విద్యుదుత్పత్తి చేసే అవసరం తగ్గనుంది. ఈ మేరకు పునరుత్పాదక విద్యుత్ నిల్వ సదుపాయాన్ని దేశం అందుకోవాలనే లక్ష్యంతో నీతి ఆయోగ్ ఈ నివేదికను రూపొందించింది.
నివేదిక ప్రకారం జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో సాధించాల్సిన పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి, నిల్వ సామర్థ్యాలు ఇలా..
►2020: దేశం 40 గిగావాట్లు, రాష్ట్రం 2,000 మెగావాట్ల రూఫ్‌టాప్ సౌరవిద్యు త్ ఉత్పత్తిని సాధించాలి. ప్రస్తుతం తెలంగాణ 68 మెగావాట్లు, దేశం 1,350 మెగావాట్ల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి.
►2022: దేశం 175 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని అందిపుచ్చుకోవాలి. ఆలోగా తెలంగాణ 5,490 మెగావాట్ల సౌరవిద్యుత్ ఉత్పత్తి, 2,000 మెగావాట్ల పవన విద్యుత్ ఉత్పత్తి లక్ష్యాలను సాధించాలి. తెలంగాణ ఇప్పటికే 3979.18 మెగావాట్ల సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకుంది.
►2027: దేశం 100 గిగావాట్ల రూఫ్‌టాప్ సౌరవిద్యుత్ ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోవడానికి 23.01 గిగావాట్ గంటల విద్యుత్ నిల్వ వ్యవస్థను అభివృద్ధిపరుచుకోవాలి. అందులో తెలంగాణ లక్ష్యాలు 6,800 మెగావాట్ల రూఫ్‌టాప్ సౌర విద్యుతుత్పత్తితోపాటు 1,258 మెగావాట్ల విద్యుత్ నిల్వ సామర్థ్యం ఉండాలి.
►2032: దేశం 150 గిగావాట్ల రూఫ్‌టా ప్ సౌరవిద్యుత్ ఉత్పత్తి లక్ష్యం చేరుకోవడానికి 32.675 గిగావాట్ గంటల విద్యు త్ నిల్వ వ్యవస్థను కలిగి ఉండాలి. తెలంగాణ 8,000 మెగావాట్ల రూఫ్‌టాప్ సౌరవిద్యుత్, 1,480 మెగావాట్ల విద్యుత్ నిల్వ వ్యవస్థను అభివృద్ధి చేసుకోవాలి.
గృహాలకు 100 శాతం రూఫ్‌టాప్..
రూఫ్‌టాప్ సౌర విద్యుత్ ఉత్పత్తి అనుమతుల జారీకి సంబంధించి అనుసరించా ల్సిన పరిమితులను నీతి ఆయోగ్ రాష్ట్రాలకు వేర్వేరుగా నిర్దేశించింది. తెలంగాణ లో గృహాలు, ప్రభుత్వ వినియోగదారుల కు అనుమతించిన లోడ్ (కాంట్రాక్టు లో డ్)లో 100 శాతం వరకు, పరిశ్రమలు, వాణిజ్య వినియోగదారులకు వారి కాం ట్రాక్టు లోడ్‌లో 80 శాతం వరకు, లోటెన్ష న్ (ఎల్టీ) వినియోగదారులకు సంబంధిత డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ సామర్థ్యం లో 50 శాతం, హైటెన్షన్ (హెచ్‌టీ) వినియోగదారులకు సంబంధిత ఫీడర్ లోడ్ సామర్థ్యంలో 50 వరకు వ్యక్తిగత రూఫ్‌టాప్ సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకోవడానికి అనుమతించాలని రాష్ట్రాన్ని కోరింది.
Comments
Please login to add a commentAdd a comment