దశాబ్దాల సమస్యకు శాశ్వత పరిష్కారం.. అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ చరిత్రలో ఫిబ్రవరి 4కు అత్యంత ప్రాధాన్యం ఉంది. దశాబ్దాల నాటి ఎస్సీ వర్గీకరణకు వీలుగా తీసుకున్న నిర్ణయానికి రాష్ట్ర మంత్రిమండలి 2024 ఫిబ్రవరి 4న ఆమోదం తెలిపింది. వర్గీకరణ నివేదికను 2025 ఫిబ్రవరి 4న మంత్రిమండలి ఆమోదించింది. దశాబ్దాలుగా నలుగుతున్న జఠిల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది ఈ రోజే. అందువల్ల ఈ రోజును సామాజిక న్యాయ దినోత్సవంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవస రం ఉంది’ అని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు.
ఎస్సీల వర్గీకరణ నివేదికపై మంగళవారం శాసనసభలో జరిగిన చర్చకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. వర్గీకరణ అమలుకు త్వరలోనే చట్టం తేవటం ద్వారా భవిష్యత్తులో ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుండా చూస్తామని చెప్పారు. ఎస్సీల రిజర్వేషన్లలో క్రీమీలేయర్ విధానాన్ని తిరస్కరించటం ద్వారా భవిష్యత్తులో సమస్య రాకుండా చేసుకున్నామన్నారు.
వర్గీకరణ అమలు బాధ్యత తీసుకుంటాం: ఎస్సీ వర్గీకరణ అమలుచేసే బాధ్యతను తమ కేబినెట్ తీసుకుంటుందని రేవంత్ చెప్పారు. వర్గీకరణ నివేదికపై ప్రక టన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఉమ్మడి ఏపీలో సీఎంలుగా ఉన్న 16 మందికి, తెలంగాణ ఏర్పడ్డాక సీఎంగా ఉన్న వారికి రాని అవకాశం నాకు వచ్చింది. ఈ సంతోషం చరిత్ర పుటల్లో శాశ్వతంగా నిలిచిపోతుంది..’ అని పేర్కొన్నారు.
గతంలో ఇదే అసెంబ్లీలో ఎస్సీ ఉపకులాల వర్గీకరణకు వాయిదా తీర్మానం ఇస్తే తనను, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, సంపత్‌కుమార్‌లను సభ నుంచి బహిష్కరించారని గుర్తుచేశారు. ఇప్పుడు ఇదే అసెంబ్లీలో సభా నాయకుడిగా వర్గీకరణ అమలుకు నిర్ణయం తీసుకుంటున్నామని చెప్పారు.
ఆ అంకెలేవీ అసెంబ్లీలో చెప్పలేదు: మంత్రి ఉత్తమ్
2014లో గత ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే చేసి నా ఆ అంకెలేవి అసెంబ్లీలో చెప్పలేదని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిపాదనల మేరకు కొత్తగూడెంలో నూతన ఎయిర్‌ఫీల్డ్ ఏర్పాటు చేయ డానికి కేంద్రం ‘ఫీజబులిటీ రిపోర్ట్’ కోరిందని ఆయన వెల్లడించారు.
వైఎస్ హయాంలోనూ తీర్మానం ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మధ్యలో అడ్డంకులు ఎదురైనా డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో దీనిపై రాజ్యాంగ సవరణ చేయాలని కోరుతూ అసెంబ్లీ తీర్మానం చేసి పంపించారని గుర్తుచేశారు. ఎస్సీలను చాలా రాజకీయ పార్టీలు ఓటుబ్యాంక్ గానే చూశాయని, సమాజంపై ఆయావర్గాలు విశ్వాసం కోల్పోకుండా చేసే అవకాశం తమకు దక్కిందని అన్నారు.
ఇతర రాష్ట్రాల్లో కూడా బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ జరిగేందుకు తన వంతు సాయం అందిస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. చర్చలో పాల్గొన్న సభ్యులకు, వర్గీకరణపై ఏర్పడ్డ మంత్రివర్గ ఉపసంఘానికి, ఆ నివేదికను ఆమోదించిన మంత్రివర్గానికి, నివేదిక కోసం కష్టపడిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment