Council of Ministers
-
ఎస్సీల వర్గీకరణకు త్వరలో చట్టం
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ చరిత్రలో ఫిబ్రవరి 4కు అత్యంత ప్రాధాన్యం ఉంది. దశాబ్దాల నాటి ఎస్సీ వర్గీకరణకు వీలుగా తీసుకున్న నిర్ణయానికి రాష్ట్ర మంత్రిమండలి 2024 ఫిబ్రవరి 4న ఆమోదం తెలిపింది. వర్గీకరణ నివేదికను 2025 ఫిబ్రవరి 4న మంత్రిమండలి ఆమోదించింది. దశాబ్దాలుగా నలుగుతున్న జఠిల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది ఈ రోజే. అందువల్ల ఈ రోజును సామాజిక న్యాయ దినోత్సవంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవస రం ఉంది’ అని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ఎస్సీల వర్గీకరణ నివేదికపై మంగళవారం శాసనసభలో జరిగిన చర్చకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. వర్గీకరణ అమలుకు త్వరలోనే చట్టం తేవటం ద్వారా భవిష్యత్తులో ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుండా చూస్తామని చెప్పారు. ఎస్సీల రిజర్వేషన్లలో క్రీమీలేయర్ విధానాన్ని తిరస్కరించటం ద్వారా భవిష్యత్తులో సమస్య రాకుండా చేసుకున్నామన్నారు. వర్గీకరణ అమలు బాధ్యత తీసుకుంటాం: ఎస్సీ వర్గీకరణ అమలుచేసే బాధ్యతను తమ కేబినెట్ తీసుకుంటుందని రేవంత్ చెప్పారు. వర్గీకరణ నివేదికపై ప్రక టన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఉమ్మడి ఏపీలో సీఎంలుగా ఉన్న 16 మందికి, తెలంగాణ ఏర్పడ్డాక సీఎంగా ఉన్న వారికి రాని అవకాశం నాకు వచ్చింది. ఈ సంతోషం చరిత్ర పుటల్లో శాశ్వతంగా నిలిచిపోతుంది..’ అని పేర్కొన్నారు. గతంలో ఇదే అసెంబ్లీలో ఎస్సీ ఉపకులాల వర్గీకరణకు వాయిదా తీర్మానం ఇస్తే తనను, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, సంపత్‌కుమార్‌లను సభ నుంచి బహిష్కరించారని గుర్తుచేశారు. ఇప్పుడు ఇదే అసెంబ్లీలో సభా నాయకుడిగా వర్గీకరణ అమలుకు నిర్ణయం తీసుకుంటున్నామని చెప్పారు. ఆ అంకెలేవీ అసెంబ్లీలో చెప్పలేదు: మంత్రి ఉత్తమ్ 2014లో గత ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే చేసి నా ఆ అంకెలేవి అసెంబ్లీలో చెప్పలేదని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిపాదనల మేరకు కొత్తగూడెంలో నూతన ఎయిర్‌ఫీల్డ్ ఏర్పాటు చేయ డానికి కేంద్రం ‘ఫీజబులిటీ రిపోర్ట్’ కోరిందని ఆయన వెల్లడించారు. వైఎస్ హయాంలోనూ తీర్మానం ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మధ్యలో అడ్డంకులు ఎదురైనా డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో దీనిపై రాజ్యాంగ సవరణ చేయాలని కోరుతూ అసెంబ్లీ తీర్మానం చేసి పంపించారని గుర్తుచేశారు. ఎస్సీలను చాలా రాజకీయ పార్టీలు ఓటుబ్యాంక్ గానే చూశాయని, సమాజంపై ఆయావర్గాలు విశ్వాసం కోల్పోకుండా చేసే అవకాశం తమకు దక్కిందని అన్నారు. ఇతర రాష్ట్రాల్లో కూడా బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ జరిగేందుకు తన వంతు సాయం అందిస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. చర్చలో పాల్గొన్న సభ్యులకు, వర్గీకరణపై ఏర్పడ్డ మంత్రివర్గ ఉపసంఘానికి, ఆ నివేదికను ఆమోదించిన మంత్రివర్గానికి, నివేదిక కోసం కష్టపడిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. -
మండలిపై పట్టు కోసమే!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర శాసనమండలిలో సంఖ్యాపరంగా మైనారిటీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వలసలను ప్రోత్సహించడం ద్వారా పట్టు బిగించేందుకు ప్రయతి్నస్తోంది. ఇందులో భాగంగా మండలిలో సుమారు నాలుగింట మూడొంతుల ఎమ్మెల్సీల బలం ఉన్న బీఆర్ఎస్పై దృష్టి కేంద్రీకరించింది. ఇప్పటికే బీఆర్ఎస్కు చెందిన ఆరు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరుకోగా, గురువారం అర్ధరాత్రి ఒకేసారి అర డజను మంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు హస్తం కండువా కప్పుకున్నారు. వీరి చేరికతో మండలిలో కాంగ్రెస్ బలం డజను స్థానాలకు చేరింది.అయినా కీలక బిల్లులు, తీర్మానాల ఆమోదానికి అవసర మైన సంఖ్యా బలం ఆ పార్టీకి చేకూరలేదు. కీలకమైన ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం జరిగితే తప్ప నిధులు వ్యయం చేయడానికి వీల్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో సమస్యలు ఎదురవుతాయన్న ఉద్దేశంతోనే బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీలను పార్టీలో చేర్చుకునే కార్యక్రమాన్ని కాంగ్రెస్ ముమ్మరం చేసింది. రానున్న రోజుల్లో మరికొందరు ఎమ్మెల్సీలను చేర్చుకునేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మండలిలో బీఆర్ఎస్ బలం 29 నుంచి ప్రస్తుతం 21కి పడిపోయింది.కాగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా ప్రతినిధులను పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించినప్పుడు తీవ్రస్థాయిలో ఆరోపణలు, విమర్శలు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులే.. ఇప్పుడు ఫిరాయింపులను ప్రోత్సహించడంపై రాజకీయ పరిశీలకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఒక పార్టీ టికెట్‌పై గెలిచి మరోపారీ్టలోకి వెళ్లిన వారిని రాళ్లతో కొట్టాలని అప్పట్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. ఒక పార్టీ టికెట్‌పై గెలిచి మరో పారీ్టలో చేరితే వారిపై అనర్హత వేటు ఆటోమేటిక్‌గా అమలయ్యేలా ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని సవరిస్తామని కాంగ్రెస్ పార్టీ తమ జాతీయ మేనిఫెస్టోలో హామీ ఇచి్చన విషయాన్ని కూడా వారు ప్రస్తావించడం గమనార్హం. దూరం పాటిస్తున్న చైర్మన్, మరో ఎమ్మెల్సీ: గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడేనాటికి మండలిలో బీఆర్ఎస్ 29 మంది సభ్యుల బలాన్ని కలిగి ఉంది. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ముగ్గురు స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీలు పట్నం మహేందర్‌రెడ్డి (రంగారెడ్డి), కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి (మహబూబ్‌నగర్) కాంగ్రెస్‌లో చేరారు. అయితే ఎమ్మెల్యేగా ఎన్నికైన కసిరెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో జరిగిన ఉప ఎన్నికలో తిరిగి బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్‌కుమార్ రెడ్డి గెలుపొందారు.తాజాగా బీఆర్ఎస్కు చెందిన మరో ఆరుగురు ఎమ్మెల్సీలు ఎగ్గె మల్లేశం, దండె విఠల్, టి.భానుప్రసాద్‌రావు, ఎంఎస్ ప్రభాకర్‌రావు, బొగ్గారపు దయానంద్, బసవరాజు సారయ్య కాంగ్రెస్‌లో చేరారు. దీంతో 40 మంది సభ్యులున్న శాసన మండలిలో ప్రస్తుతం బీఆర్ఎస్కు 21 మంది, కాంగ్రెస్ 12 మంది, ఎంఐఎంకు ఇద్దరు సభ్యులుండగా, బీజేపీకి ఒక సభ్యుడు ఉన్నారు. మరో ఇద్దరు స్వతంత్రులు. గవర్నర్ కోటాలో రెండు స్థానాలు ఖాళీగా ఉండగా, వీటి భర్తీపై వివాదం నెలకొంది. ఇలావుండగా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి కూడా ఇటీవలి కాలంలో బీఆర్ఎస్తో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇక ఉపాధ్యాయ కోటా ఎమ్మెల్సీ కూర రఘోత్తమరెడ్డి గతంలో బీఆర్ఎస్తో సన్నిహితంగా కొనసాగినా, ప్రస్తుతం ఆయన కూడా దూరం పాటిస్తున్నారు. మరో టర్మ్ పొడిగిస్తామనే హామీతోనే..? మండలిలో బడ్జెట్, ప్రభుత్వ బిల్లులు, తీర్మానాలకు ఆమోదం పొందడం కాంగ్రెస్‌కు సవాలుగా మారింది. కీలక బిల్లులు మండలిలో పాస్ అయ్యేందుకు బీఆర్ఎస్ మోకాలు అడ్డుతుందని భావిస్తున్న కాంగ్రెస్ చేరికల ద్వారా బలోపేతం అయ్యేలా పావులు కదుపుతోంది. ఈ క్రమంలో మరో దఫా పదవి ఇస్తామనే హామీతో ఎమ్మెల్సీలకు కాంగ్రెస్ ఎర వేస్తున్నట్లు తెలిసింది. పార్టీ మారిన ఎమ్మెల్సీల్లో ఎగ్గే మల్లేశం వచ్చే ఏడాది మార్చి 25న, ఎంఎస్ ప్రభాకర్‌రావు వచ్చే ఏడాది ఆగస్టు 6న ఆరేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకుంటున్నారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు బొగ్గారపు దయానంద్, బసవరాజు సారయ్య 2026 నవంబర్‌లో, మిగతా ఎమ్మెల్సీలు 2028 జనవరిలో పదవీ కాలం పూర్తి చేసుకుంటారు.అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్సీల్లో స్థానిక సంస్థలు, ఎమ్మెల్యేల కోటాలో ఎన్నికైన వారే ఎక్కువగా ఉన్నారు. దీంతో పార్టీ మారే వారిలో వారే ఎక్కువగా ఉంటారనే ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న రెండు స్థానాలకు గత ప్రభుత్వం దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ పేర్లను ప్రతిపాదించింది. ఈ ఇద్దరి పేర్లను నాటి గవర్నర్ తమిళిసై తిరస్కరించడంతో తర్వాత అధికారంలోకి వచి్చన రేవంత్ ప్రభుత్వం తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాంతో పాటు అమేర్ అలీఖాన్‌ను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసింది. ఈ అంశంలో గవర్నర్ తీసుకోబోయే నిర్ణయం కాంగ్రెస్, బీఆర్ఎస్ శిబిరాల్లో ఉత్కంఠ రేపుతోంది. -
సచివాలయ ఉద్యోగులతో ఇంటికే పింఛన్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో దాదాపు 65 లక్షల మంది ఫించన్ లబ్ధిదారులకు సచివాలయ ఉద్యో గుల ద్వారా ఇంటివద్దే పెన్షన్లు పంపిణీ చేయాలని మంత్రి మండలి నిర్ణయించింది. ఈమేరకు జూలై 1వ తేదీన గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పింఛన్లు అందించేందుకు ఆమోదం తెలిపింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సోమవారం సచివాలయంలో మంత్రి మండలి తొలిసారిగా సమావేశమైంది. బాధ్యతలు చేపట్టిన అనంతరం సీఎం చంద్రబాబు తొలి సంతకాలు చేసిన ఐదు ఫైళ్లకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అనంతరం మంత్రి మండలి నిర్ణయాలను సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కె.పార్థసారధి విలేకరులకు వెల్లడించారు. డీఎస్సీ 2024 ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఎస్జీటీ 6,371, పీఈటీ 132, స్కూల్ అసిస్టెంట్లు 7,725, టీజీటీ 1,781, పీజీటీ 286, ప్రిన్సిపాల్స్ 52 పోస్టులను భర్తీ చేయనున్నారు. డీఎస్సీ ఇకపై నిరంతర ప్రక్రియగా ఏటా నిర్వహించాలని మంత్రి మండలి నిర్ణయించింది. టెట్ (టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్)ను కూడా నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా నియామకాల కంటే ముందే టీచర్లకు శిక్షణ డిసెంబర్ 10వతేదీ నుంచి ప్రారంభించాలని సీఎం చంద్రబాబు సూచించారు. ప్రస్తుత విద్యా విధానంతో పాటు జాతీయ విద్యా విధానాన్ని అధ్యయనం చేసే దిశగా అధికారులు సమాయత్తం కావాలని నిర్దేశించారు.⇒ ఆంధ్రప్రదేశ్ భూహక్కు చట్టం 2022 (యాక్ట్ 27 ఆఫ్ 2023) రద్దు ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ‘సరైన అవగాహన లేని టైటిలింగ్ రిజిస్ట్రేషన్ అధికారులు అనవసర సమస్యలు సృష్టిస్తారని గుర్తించాం. నీతి ఆయోగ్ ప్రతిపాదించిన చట్టానికి, గత ప్రభుత్వం ఆమోదించిన చట్టానికి వైరుధ్యం ఉంది. రిజిస్ట్రేషన్, రెవెన్యూ, న్యాయ వ్యవస్థలను అస్తవ్యస్థం చేసే ఈ చట్టాన్ని రద్దు చేయాలని మంత్రిమండలి నిర్ణయించింది. భూ యజమానులు ఒరిజినల్ డాక్యుమెంట్‌ను పొందే అవకాశాన్ని కల్పిస్తాం’ అని మంత్రి పార్థసారథి పేర్కొన్నారు. ⇒ సామాజిక పెన్షన్లకు సంబంధించి ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకంగా పేరు మార్పు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వృద్ధాప్య, వితంతు, చేనేత, కల్లు గీత, మత్స్యకార, ఒంటరి మహిళలు, డప్పు కళాకారులు తదితర పింఛన్ల మొత్తాన్ని రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచుతూ మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పెంచిన పింఛన్ మొత్తాన్ని ఏప్రిల్, మే, జూన్ బకాయిలతో కలిపి మొత్తంగా రూ.7 వేలను జూలై 1వ తేదీన సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటివద్దే అందించాలని మంత్రిమండలి నిర్ణయించింది. దివ్యాంగులు, క్షయ వ్యాధిగ్రస్తులకు ఇస్తున్న పింఛన్ రూ. 3 వేల నుంచి రూ.6 వేలకు, పూర్తి అంగవైకల్యంతో బాధపడుతున్న దివ్యాంగులకు ఇస్తున్న రూ.5 వేల పింఛన్ రూ.15 వేలకు, కిడ్నీ, లివర్, బైలేట్రల్ ఎలిఫెంటాసిస్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఇస్తున్న ఫించన్ రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెరగనుంది. డయాలసిస్, సికిల్‌సెల్ ఎనీమియా, థలసేమియా, హెచ్ఐవీ తదితర బాధితులకు పెన్షన్ పంపిణీ డీబీటీ ద్వారా చేపట్టాలని మంత్రి మండలి నిర్ణయించింది. సామాజిక భద్రతా పింఛన్ల పెంపు వల్ల ప్రభుత్వంపై నెలకు రూ.819 కోట్ల అదనపు భారం పడనుంది. పెన్షన్ పెంపు నిర్ణయంతో 28 కేటగిరీలకు చెందిన దాదాపు 65.3 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం ఏడాదికి రూ.33 వేల కోట్లకు పైగా ఖర్చు చేయనుంది.⇒ ఆంధ్రప్రదేశ్ నైపుణ్య సెన్సెస్ 2024 నిర్వహణకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ఏటా దాదాపు 4.4 లక్షల మంది విద్యార్థులు పలు కోర్సులను పూర్తి చేసుకొని బయటకు వస్తున్నారు. డిమాండ్, సప్లై, అందుబాటులో ఉన్న సదుపాయాల ఆధారంగా స్కిల్ గ్యాప్‌ను అంచనా వేయడం, అవసరాలకు అనుగుణంగా యువతను తీర్చిదిద్దే లక్ష్యంతో నైపుణ్య సర్వేను 3 నుంచి 4 నెలల వ్యవధిలో పూర్తి చేయాలని మంత్రి మండలి నిర్ణయించింది. ⇒ రాష్ట్రంలో 203 అన్న క్యాంటీన్లను పున: ప్రారంభించేందుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. తొలి దశలో 183 అన్న క్యాంటీన్లను ఒకేసారి ప్రారంభించాలని నిర్ణయించింది. ⇒ విజయవాడలోని డా.వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయంగా తిరిగి మార్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. విదేశాలకు వెళ్లే వైద్య విద్యార్థులకు సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ఈమేరకు నిర్ణయం తీసుకుంది.⇒ రాష్ట్ర అడ్వకేట్ జనరల్‌గా దమ్మాలపాటి శ్రీనివాస్‌ను నియమిస్తూ తీసుకున్న నిర్ణయానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. పూర్వ అడ్వకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్, అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి రాజీనామాలను ఆమోదించింది.⇒ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున ఆరోగ్య పరిరక్షణ ఏర్పాట్లతో సమాయత్తం కావాలని మంత్రి వర్గానికి సీఎం చంద్రబాబు సూచించారు. పంచాయతీలు, మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య పనులను వెంటనే ప్రారంభించాలని, చివరి ఆయకట్టుకు కూడా నీరు అందించేలా కాల్వలు, చెరువుల్లో పూడిక, డెక్క తొలగించే కార్యక్రమాన్ని సత్వరమే చేపట్టాలని పేర్కొన్నారు. రోడ్లు, రహదారులు గతుకులమయం అయినందున వెంటనే గుంతలు పూడ్చేందుకు చర్యలు తీసుకోవాలని ఆర్ అండ్ బీకి ఆదేశాలిచ్చారు. మత్తు, మాదక ద్రవ్యాల నుంచి యువతను కాపాడేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కార్యాచరణ రూపొందించేందుకు ఐదుగురు మంత్రులతో సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. విద్య, ఆరోగ్యం, హోం, ఎక్సైజ్, ట్రైబల్ వెల్ఫేర్ శాఖల మంత్రులు ఇందులో సభ్యులుగా ఉంటారు.7 శ్వేత పత్రాలుగత ప్రభుత్వం అనుసరించిన విధానాలపై అవగాహన కల్పించేందుకు 7 శ్వేత పత్రాలను విడుదల చేయాలని మంత్రి వర్గానికి సీఎం చంద్రబాబు సూచించారు. పోలవరం, అమరావతి, విద్యుత్, పర్యావరణం (ల్యాండ్, శాండ్, మైన్స్, జియాలజీ మొదలైనవి), లిక్కర్, ఎక్సైజ్, శాంతి భద్రతలు, ఆర్థిక శాఖలపై శ్వేత పత్రాలను విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ నెల 28 నుంచి జూలై 18 వరకు రెండు మూడు రోజులకొకసారి వీటిని విడుదల చేయనున్నారు. -
సభాపతి ఎవరు.. అనుభవం కలిగిన నేత కోసం వెతుకులాట
భువనేశ్వర్: రాష్ట్ర మంత్రిమండలి పునర్ వ్యవస్థీకరణలో మంత్రి పదవుల పట్ల ఊహాగానాలకు తెరపడింది. ప్రస్తుతం శాసనసభ తదుపరి స్పీకర్ ఎవరనే అంశం తెరపైకి వచ్చింది. ఈ పదవి కోసం పలువురు సీనియర్లు రేసులో ఉన్నట్లు సమాచారం. వీరిలో ప్రఫుల్ల సామల్, దేవీప్రసాద్ మిశ్రా, అమర్‌ప్రసాద్ శత్పతి, బద్రి నారాయణ్ పాత్రొ స్పీకర్ ముందున్నారు. మహిళా అభ్యర్థి స్నేహాంగిని చురియా పేరు కూడా ప్రచారంలో ఉంది. బిజూ జనతాదళ్ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ ప్రతి చోటా మహిళలకు అత్యంత ప్రాధాన్యత కల్పిస్తున్నారు. ఈ పరిస్థితుల దృష్ట్యా ఆమెకు అదృష్టం కలిసి రావచ్చని సర్వత్రా చర్చ సాగుతోంది. 2019 సార్వత్రిక ఎన్నికలో అస్కా లోక్‌సభ ఎన్నికలో మహిళా కార్డు బీజేడీకి దిగ్విజయం కల్పించింది. ఈ నియోజకవర్గం మహిళా స్వయం సహాయక బృందం అధినేత ప్రమీలా బిసోయ్తో చేసిన ప్రయోగం పార్టీకి విశేష గుర్తింపు సాధించింది. అయితే ధామ్‌నగర్ ఉప ఎన్నికలో ఈ ప్రయోగం బెడిసి కొట్టింది. మహిళా సాధికారత మంత్రం నిరంతరం ఫలప్రదం కావడం కష్టతరమని ఈ ఎన్నిక రుజువు చేసింది. ఎప్పటికప్పుడు సరికొత్త వ్యూహంతో ఆచితూచి అడుగు వేయకుంటే రానున్న ఎన్నికల్లో పార్టీ బలం పుంజుకోవడం బలహీన పడుతుందని బీజేడీ శిబిరంలో జోరుగా చర్చ సాగుతోంది. నవీన్ నిర్ణయంపైనే.. మంత్రిమండలి పునర్ వ్యవస్థీకరణ నేపథ్యంలో స్పీకర్ విక్రమ్‌కేశరి ఆరూఖ్తో రాజినామా చేయించారు. ఈ స్థానం భర్తీ తదుపరి ఎన్నికలకు లాభసాటిగా ఉండేలా అభ్యర్థి ఎంపిక పట్ల బీజేడీ అధిష్టానం పదునైన ప్రక్రియతో కసరత్తు చేస్తోంది. స్పీకర్ ఆశావహుల్లో ప్రఫుల్ల సామల్, దేబీప్రసాద్ మిశ్రా, అమర్‌ప్రసాద్ శత్పతి తగిన అనుభవం అలాగే శాసన విధానాలపై పూర్తి అవగాహన కలిగిన ప్రతినిధులుగా పేరొందారు. వీరిలో ఒకరికి ప్రతిష్టాత్మక సభాపతి పదవిని కట్టబెట్టే యోచన శిబిరంలో గింగుర్లు కొడుతోంది. అయితే మహిళా మంత్రంతో ఈ నిర్ణయం ఊగిసలాడుతోంది. అయితే ప్రయోగాలు చేయడానికి సమయం కాదని, అసెంబ్లీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు సమర్థత కలిగిన అభ్యర్థిని మాత్రమే స్పీకర్‌గా నియమించాలని సీఎం నవీన్ పట్నాయక్ భావిస్తున్నట్లు సమాచారం. -
స్పీకర్‌గా తప్పించి.. మంత్రిగా..
భువనేశ్వర్: ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సోమవారం తన కొలువులో కొద్దిపాటి మార్పులు చేపట్టారు. ముగ్గురు కొత్త మంత్రులకు కేబినెట్లో స్థానం కల్పించారు. ఖాళీ పదవుల్లో వారికి సర్దుబాటు చేయడం విశేషం. స్థానిక లోక్‌సేవా భవన్లో సోమవారం ఉదయం జరిగిన మంత్రిమండలి ప్రమాణ స్వీకారోత్సవంలో కొత్తగా చేరిన సభ్యులు బిక్రమ్‌కేశరి అరుఖా, శారదాప్రసాద్ నాయక్, సుదామ్ మరండిలతో గవర్నర్ ప్రొఫెసర్ గణేషీలాల్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ హాజరయ్యారు. విక్రమ్ అరూఖ్ 2008 నుంచి ప్రభుత్వ చీఫ్ విప్, స్పీకర్, గ్రామీణాభివృద్ధి, న్యాయ, అటవీ, పర్యావరణం, వాతావరణ మార్పు, శాసనసభ వ్యవహారాలు, సమాచారం–ప్రజా సంబంధాలు, సహకారం ప్రభుత్వరంగ సంస్థలు తదితర శాఖల్లో మంత్రిగా కీలకమైన బాధ్యతలు విజయవంతంగా నిర్వహించారు. నవీన్ కొలువులో మరో మాజీమంత్రి సుధామ్ మరాండీకి పాఠశాలలు, సామూహిక విద్యాశాఖను కేటాయించారు. గతవారం విద్యాశాఖ మాజీమంత్రి సమీర్‌రంజన్ దాస్ పదవికి రాజీనామా చేయడంతో ఈ మంత్రిత్వ శాఖ ఖాళీ అయ్యింది. నిరంజన పూజారికి ఆరోగ్యశాఖ.. మరాండి గతంలో క్రీడలు–యువజన వ్యవహారా లు, షెడ్యూల్డ్ తెగలు–కులాల అభివృద్ధి(గిరిజన సంక్షేమం), రెవెన్యూ, విపత్తు నిర్వహణ సహాయమంత్రిగా పని చేశారు. ఈదఫా మరాండీని కేబినెట్ హోదాకు ప్రమోషన్ కల్పించారు. అదే విధంగా శ్రీకాంత సాహు గతవారం రాజీనామా చేయడంతో ఖాళీ అయిన కార్మిక శాఖను శారదాప్రసాద్ నాయక్‌కు కేటాయించారు. నాయక్ 2009 నుంచి 2012 వరకు రాష్ట్ర ఆహార సరఫరా, వినియోగదారుల సంక్షేమం, గృహనిర్మాణం, నగర అభివృద్ధి, అబ్కారీ శా ఖ సహాయ మంత్రిగా పని చేశారు. నవీన్ కేబినెట్లో సీనియర్ మంత్రి, మాజీ స్పీకర్ విక్రమ్ కేశరీ అరూఖ్ కు ఆర్థికశాఖ కేటాయించారు. ఈ ఏడాది జనవరి 29న ఝార్సుగుడలో నవకిషోర్ దాస్ హత్యతో ఖాళీ అయిన ఆరోగ్యశాఖను ప్రస్తుత ఆర్థికమంత్రి నిరంజన్ పూజారికి ఇన్చార్జిగా స్థిరపరిచారు. స్పీకర్‌గా తప్పించి.. మంత్రిగా.. గంజాం ముఖ్యమంత్రి సొంత జిల్లా. ఆది నుంచి బీజేడీకి కంచుకోటగా ఈ ప్రాంతం చలామణి అవుతోంది. ఈ పరపతి ఏమాత్రం సడలి పోకుండా శంఖం దళం అధ్యక్షుడిగా సీఎం నవీన్ సకాలంలో స్పందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ జిల్లా నుంచి విక్రమకేశరి అరూఖ్ బలమైన నాయకుడిగా అధ్యక్షుడి దృష్టిని ఆకట్టుకున్నారు. ఈ నేపథ్యంలో స్పీకర్ పదవి కట్టబెట్టడంతో సొంత జిల్లా, నియోజకవర్గ పురోగతి అనుబంధ కార్యకలాపాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించేందుకు సమయం అనుకూలించని పరిస్థితులు తలెత్తాయి. దీని దృష్ట్యా ఆయనకు స్పీకర్ పదవి బరువు బాధ్యతలను తొలగించి, మంత్రి పదవితో జిల్లాలో పట్టు సాధించేందుకు సువిశాల అవకాశం కల్పించడం పునర్వ్యవస్థీకరణ వ్యూహంగా స్పష్టం అవుతోంది. 2019 సార్వత్రిక ఎన్నికలో గంజాం జిల్లాలోని 13 స్థానాల్లో 12 స్థానాలను కై వసం చేసుకుంది. ఈ పట్టును రానున్న ఎన్నికల్లో ఏమాత్రం చేజార్చుకోకుండా జాగ్రత్త వహించడంలో విక్రమ అరూఖ్ తగిన అభ్యర్థిగా భావించి కొలువులో చోటు కల్పించారు. ఆయన రాజకీయ శైలితో జిల్లాలో బీజేడీ కంచుకోట పట్టు యథాతధంగా కొనసాగుతుందని భావిస్తున్నారు. బలోపేతమే లక్ష్యంగా.. సుందరగడ్, మయూర్భంజ్ జిల్లాల్లో బిజూ జనతాదళ్ గత ఎన్నికల్లో నిరాశజనకమైన ఫలితాలతో సరిబెట్టుకుంది. మయూర్భంజ్ లోని 9 స్థానాల్లో బీజేడీ కేవలం 3 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. సుందరగడ్ 7 స్థానాల్లో నామమాత్రంగా 2 స్థానాలకే పరిమితమైంది. ఈ రెండూ గిరిజన ప్రభావిత జిల్లాలు. అయితే 2019 సార్వత్రిక ఎన్నికల అనంతరం బీజేడీ నిరవధిక కృషికి ఫలితంగా 2022లో జరిగిన జిల్లా పరిషత్, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆశాజనకమైన ఫలితాలు సాధించింది. ఈ ప్రేరణతో రానున్న ఎన్నికల్లో బలం పుంజుకునేందుకు ఇద్దరు అనుభవజ్ఞులకు మంత్రి పదవులతో పట్టం గట్టింది. ఈ జిల్లాల నుంచి మంత్రి పదవులు పొందిన సుధాం మరాండి, శారదాప్రసాద్ నాయక్‌కు రానున్న ఎన్నికలు కత్తిమీద సాములాంటి సవాల్‌గా మారాయి. ఈ సందర్భంలో పార్టీ బలం పటిష్ట పరచడం ఇరువురి లక్ష్యంగా కార్యాచరణ కొనసాగించాల్సి ఉంటుంది. నవీన్ చతురత.. భువనేశ్వర్: మంత్రిమండలి పునర్వ్యవస్థీకరణలో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రానున్న ఎన్నికల్లో బిజూ జనతాదళ్‌ను బలోపేతం చేయడం సంకల్పంగా స్పష్టం అవుతోంది. పార్టీ బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో బలం పుంజుకునేలా చేయడంతో గట్టి ప్రభావం ఉన్న ప్రాంతంలో పట్టు సడలిపోకుండా అత్యంత జాగరూకత ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో పునర్వ్యవస్థీకరణ పురస్కరించుకుని గంజాం, సుందర్‌గడ్, మయూర్భంజ్ జిల్లాలకు ప్రాతినిధ్యం పునరుద్ధరించారు. ఈ ప్రాంతాల నుంచి మాజీ మంత్రులకు పదవులు కట్టబెట్టారు. గంజాం నుంచి విక్రమకేశరి అరూఖ్, మయూర్భంజ్ నుంచి సుధాం మరాండి, సుందరగడ్ నుంచి శారదాప్రసాద్ నాయక్‌కు మంత్రి పదవులు వరించాయి. గంజాం జిల్లాలో బీజేడీ కోటను మరింత బలోపేతం చేసేందుకు, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ సరైన రీతిలో రాణించని సుందర్‌గడ్, మయూర్భంజ్ జిల్లాలలో బీజేడీ బలాన్ని పెంచడానికి అనుభవజ్ఞులను ఎంపిక చేసి, మంత్రులుగా బాధ్యతలు అప్పగించారు. ఈ పదవులతో సొంత జిల్లాల్లో పురోగతి దిశలో కృషి చేసేందుకు మార్గం సుగమం అవుతుందనే దృక్పథంతో కేబినెట్ విస్తరణ పురస్కరించుకుని నవీన్ పట్నాయక్ ఆచితూచి మార్పుచేర్పులు చేపట్టడం విశేషం. -
వచ్చే వారంలో మహారాష్ట్ర మంత్రివర్గ విస్తరణ
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో కేబినెట్ విస్తరణ వచ్చే వారంలో ఉంటుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే చెప్పారు. ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌తో సంపూర్ణ చర్చల తర్వాత మంత్రిమండలి కూర్పు ఉంటుందని తెలిపారు. శనివారం షిండే, ఫడ్నవీస్‌లు ఢిల్లీలో సుడిగాలి పర్యటన చేపట్టారు. రాష్ట్రపతి కోవింద్, ప్రధానమంత్రి మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలను కలుసుకున్నారు. అనంతరం సంయుక్తంగా విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు వస్తాయని మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే చెబుతున్న మాటల్ని షిండే తోసిపుచ్చారు. 164 మంది ఎమ్మెల్యేలతో తమ ప్రభుత్వం బలంగా ఉందని, పూర్తి కాలం తను పదవిలో ఉంటానని ధీమాగా చెప్పారు. ఒకప్పుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న ఫడ్నవీస్ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి కావడం పట్ల అసంతృప్తిగా లేదా అన్న ప్రశ్నకు తాను పార్టీ ఆదేశాలకు అనుగుణంగానే నడుచుకుంటానని బదులిచ్చారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రే నాయకుడని, షిండే నాయకత్వంలో పని చేస్తామనన్నారు. ప్రభుత్వాన్ని పూర్తికాలం విజయవంతంగా ముందుకు తీసుకువెళ్లడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. శుక్రవారం హోం మంత్రి అమిత్ షాతో షిండే, ఫడ్నవీస్ సుదీర్ఘంగా జరిపిన చర్చల్లో అధికార పంపిణీ కసరత్తు కొలిక్కి వచ్చినట్టు సమాచారం. -
హార్థిక్ ఎఫెక్ట్? గుజరాత్ కేబినెట్లో పటేళ్ల ముద్ర..!
సాక్షి, గాంధీ నగర్ : గుజరాత్లో పటేదార్ల ఉద్యమం.. ఎన్నికలపైనా, ప్రస్తుత మంత్రివర్గకూర్పుపైనా.. ప్రస్ఫుటంగా కనిపించింది. ముఖ్యంగా మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పటేదార్ వర్గం నుంచి అధికార బీజేపీ తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంది. పటేదార్లకు రిజర్వేషన్ కల్పిస్తామంటూ రాహుల్ గాంధీ ఆ వర్గాన్ని ఆకర్షించడం ద్వారా బీజేపీకి ఓటమి భయాన్ని కల్పించారు. ఇక కౌంటింగ్ సమయంలో పటేదార్లు బలంగా ఉన్న నియోజకవర్గాల్లో గెలుపోటములు ఊగిసలాడాయి. ఈ నేపథ్యంలో తాజా మంత్రివర్గంలో పటేదార్లకు బీజేపీ భారీ ప్రాముఖ్యత కల్పించింది. విజయ్‌రూపానీ నేతృత్వంలో కొత్తగా కొలువుదీరిన 20 మంది మంత్రుల్లో.. 6 మంది పటేదార్లకు పదవులు కట్టబెట్టింది బీజేపీ. తాజా మంత్రివర్గంలో మంత్రి పదవులు దక్కించుకున్న పటేదార్లలో ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ ఉన్నారు. ఆయతో సహా కౌశిక్ పటేల్, సౌరభ్ పటేల్, ప్రభాత్ పటేల్, ఈశ్వర్ పటేల్, రచ్చండ భాయ్ పటేల్ ఉన్నారు. ఇదిలా ఉండగా బ్రాహ్మణ వర్గానికి చెందిన విభావరిబెన్ దేవ్ మంత్రి పదవి దక్కించుకున్నారు. ప్రస్తుత కేబినెట్లో పదవి దక్కించుకున్న ఏకైక మహిళ కూడా విభావరిబెన్ కావడం గమనార్హం. ఇక విజయ్ రూపానీ కేబినెట్లో ఐదు మంది ఓబీసీలు, ఎస్టీలు, ఎస్టీలు, క్షత్రియ వర్గాని తలా మూడు పదవులు దక్కాయి. మొత్తం 20 మంది మంత్రుల్లో.. 10 మంది కేబినెట్ హోదాలు దక్కగా.. మరో పదిమందికి సహాయ మంత్రి పదవులు దక్కాయి. -
తుమకూరులో భారీ పరిశ్రమ
ఏర్పాటు కానున్న ‘ఇంటిగ్రేటెడ్ మిషన్ టూల్ పార్క్’ నాలుగు వేల మందికి ఉపాధి రూ.4 లక్షల అవినీతికి పాల్పడిన పీడబ్ల్యూడీ ఇంజనీర్‌కు నిర్బంధ పదవీ విరమణ {పవాసీ భారతీయ దివస్ నిర్వహణకు రూ.20కోట్లు రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయాలను వెల్లడించిన మంత్రి టి.బి.జయచంద్ర బెంగళూరు: తుమకూరు సమీపంలోని వసంతనరసాపుర ప్రాంతంలో ‘ఇంటిగ్రేటెడ్ మిషన్ టూల్ పార్క్’ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర మంత్రిమండలి సమ్మతించింది. బుధవారమిక్కడి విధానసౌధలో సీఎం సిద్ధరామయ్య అధ్యక్షతన నిర్వహించిన మంత్రి మండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మంత్రి మండలి సమావేశంలో తీసుకున్న ముఖ్య నిర్ణయాలను రాష్ట్ర న్యాయశాఖ మంత్రి టి.బి.జయచంద్ర మీడియాకు వివరించారు. బెంగళూరు-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్‌ను చిత్రదుర్గ వరకు విస్తరించాలన్న రాష్ట్ర ప్రభుత్వ విన్నపాన్ని ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందన్నారు. ఈ నేపథ్యంలో బెంగళూరు-చెన్నై-చిత్రదుర్గ ఇండస్ట్రియల్ కారిడార్‌లో భాగంగా ఈ పార్క్‌ను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఇక ఈ టూల్ పార్క్ ఏర్పాటు కోసం ఓ ప్రత్యేక కంపెనీని ఏర్పాటు చేసి దానిని రిజిస్టర్ చేయించనున్నామని చెప్పారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం రూ.125కోట్లను అందజేయనుందని వివరించారు. ఈ టూల్ పార్క్ ఏర్పాటు ద్వారా 4 వేల మందికి ఉపాధి లభించనుందని, రూ.380కోట్ల మేర పెట్టుబడులు రానున్నాయని అంచనా వేస్తున్నట్లు మంత్రి టి.బి.జయచంద్ర మీడియాకు వివరించారు. బెంగళూరు-చెన్నై కారిడార్‌ను చిత్రదుర్గ వరకు పొడిగించిన నేపథ్యంలో ఇక్కడ మౌలిక వసతుల కల్పనకు మొత్తం రూ.481కోట్లను మంజూరు చేసేందుకు మంత్రి మండలి నిర్ణయించిందని తెలిపారు. మంత్రి మండలి సమావేశంలో తీసుకున్న మరికొన్ని ముఖ్యమైన నిర్ణయాలు.... ►హల్లెకరికట్టె గ్రామంలో అతివృష్టి నిధులతో రోడ్లు వేయించిన సందర్భంలో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న పీడబ్ల్యూడీ ఇంజనీరు అశోక్ ఎం.బుగిలిని నిర్భంద పదవీ విరమణ ఇచ్చేందుకు మంత్రి మండలి నిర్ణయించింది. రోడ్లు వేయించిన పనుల్లో రూ.4 లక్షల అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు బుగిలిపై వచ్చిన నేపథ్యంలో ఉప లోకాయుక్త విచారణ చేపట్టి అక్రమాలు నిజమేనని తేల్చింది. ఆయన్ను ఉద్యోగ బాధ్యతల నుండి తప్పించాలని సఫార్సు చేసింది. దీంతో బుగిలికి నిర్భంద పదవీ విరమణ ఇవ్వాలని సర్కార్ నిర్ణయించింది. ►ఉడుపి జిల్లాకు చెందిన ప్రవాస భారతీయుడు డాక్టర్ బి.ఆర్.శెట్టర్ తన తల్లి పేరిట ఉడుపిలోని ప్రభుత్వ ఆస్పత్రిని లీజుకు తీసుకొని రూ.200కోట్లతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా మార్చేందుకు ప్రిన్సిపల్ క్లియరెన్స్ ఇచ్చారు. ►గదగ్-హంబాళ రైల్వే మార్గంలో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మించేందుకు మంత్రి మండలి అంగీకరించింది. రూ.23 కోట్ల వ్యయం కాగల ఈ పనులకు 50శాతం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూ.50శాతం రైల్వే శాఖ భరించనుంది. ►కల్బుర్గి జిల్లా చించోళ్ తాలూకాలోని కాగిన నదిపై బ్రిడ్జ్ కమ్ బ్యారేజీ నిర్మాణానికి రూ.26.26కోట్లు మంజూరు ►వచ్చే ఏడాది జనవరి 7నుంచి 9 వరకు జరగనున్న ప్రవాసీ భారతీయ దివస్ నిర్వహణకు రూ.20కోట్ల మంజూరు. ►సుత్తూరు ప్రాంతంలోని కబిని నది నుంచి ఎత్తిపోతల ద్వారా నంజనగూడు, యల్లందూరు, చామరాజనగర ప్రాంతాలకు తాగునీటిని అందజేయడంతో పాటు అక్కడి చెరువులను నింపేందుకు అంగీకారం. ఇందుకు రూ.233 కోట్లు విడుదల ► వివిధ కేంద్ర పథకాల కింద రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేపట్టడానికి వీలుగా రూ.836 కోట్లను వచ్చే ఏడాది బడ్జెట్లో పొందుపరిచేందుకు నిర్ణయించారు. -
ప్రక్షాళన
నేడు మంత్రులను రాజీనామా కోరనున్న సీఎం మేజర్ సర్జరీ దిశగా కాంగ్రెస్ అధిష్టానం యువ నాయకులకు పెద్దపీట మంత్రి పదవులను కాపాడుకోవడానికి ఢిల్లీలో లాబీయింగ్ బెంగళూరు : అధికార కాంగ్రెస్ పార్టీలో త్వరలో భారీ స్థాయిలో ప్రక్షాళన జరగనుంది. అటు ప్రభుత్వ పరంగానే కాకుండా ఇటు పార్టీ పరంగా కూడా ఈ మార్పులు చేర్పులు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. చాలా కాలంగా మంత్రి మండలి పునఃరచన వివిధ కారణాలతో వాయిదా పడుతున్న విషయం తెలిసిందే. ఈ విషయమై పార్టీలోని సీనియర్ ఎమ్మెల్యేలు అటు సిద్ధరామయ్యతో పాటు అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో సమస్య పరిష్కారం కోసం అధిష్టానం కసరత్తులు మొదలు పెట్టింది. అందులో భాగంగా మంత్రిత్వశాఖల మార్పుతో పాటు కొంతమందిని పూర్తిగా మంత్రి మండలి నుంచే తప్పించడానికి అధిష్టానం నిర్ణయించుకుంది. ఈమేరకు ఖాళీ ఏర్పడిన స్థానాల్లో ఎక్కువ మంది యువ నాయకులకు స్థానం కల్పించాలనేది కాంగ్రెస్ పెద్దల భావన. మరోవైపు చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటున్న మాలికయ్యగుత్తేదార్, కోలివాడ వంటి ఒకరిద్దరు సీనియర్ నాయకులకు కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నూతన మంత్రిమండలిలో స్థానం కల్పించనుందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేడు (బుధవారం) మంత్రిమండలిని సమావేశం జరిపించి మంత్రులందరితో రాజీనామా చేయించనున్నారని తెలుస్తోంది. అటుపై ఆ రాజీనామా పత్రాలను తీసుకుని అధిష్టానం వద్దకు వెళ్లనున్నారు. ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ పార్టీ కర్ణాటక శాఖ రాజకీయ వ్యవహరాల ఇన్చార్జ్ దిగ్విజయ్ సింగ్‌తో ముఖ్యమంత్రి చర్చించి మంత్రి మండలి నుంచి ఎవరెవరిని తప్పించాలనే విషయంపై స్పష్టమైన నిర్ణయం తీసుకోనున్నారు. ఇదిలా ఉండగా సామూహిక రాజీనామా విషయమై ఇప్పటికే కొంతమంది మంత్రులు గుర్రుగా ఉన్నారు. తాము ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీనామా చేసేది లేదని వారు చెబుతున్నారు. అంతేకాకుండా తమ స్థానాలను కాపాడుకోవడానికి గత రెండు రోజుల నుంచి ఢిల్లీ మకాం వేసి లాబీయింగ్ నడుపుతున్నారు. మరోవైపు మంత్రి మండలిలో స్థానం ఆశిస్తున్న వారిలో ముందువరుసలో ఉన్న స్పీకర్ కాగోడుతిమ్మప్ప, శాసనసభ్యుడు రమేష్‌లు కూడా పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ నాయకుడైన మల్లికార్జున ఖర్గే ద్వారా లాబీయింగ్ చేస్తున్నారు. ఇక సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలైన అశోక్ పట్టణ్, ప్రకాశ్‌రాథోడ్, మాలకయ్యగుత్తేదార్, ఏ.బీ మాలకరెడ్డి తదితరులు నేరుగా అధిష్టానం కలిసి ఇంతకాలం తాము కాంగ్రెస్‌కు చేసిన సేవను వివరించి మంత్రి పదవులు పొందాలని గట్టిపట్టుదలతో ఢిల్లీలో మకాం వేశారని సమాచారం. కేపీసీసీ అధ్యక్షస్థానంలో డీ.కే శివకుమార్ కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష స్థానంలో ఉన్న పరమేశ్వర్ పదవీ కాలం ఇప్పటికే ముగిసింది. అయితే ఉప ఎన్నికలు, పరిషత్ ఎన్నికల వల్ల ఆయన్ను ఆ స్థానం నుంచి తొలగించి మరొకకరికి ఆ భాద్యతలు అప్పగించడానికి హై కమాండ్ ఒప్పుకోలేదు. అయితే మరో రెండేళ్లవరకూ ఎన్నికలు వచ్చే అవకాశం లేదు. ఈ సమయంలోపు పార్టీని బలోపేతం చేసే సమర్థుడిని కేపీసీసీ అధ్యక్షస్థానంలో ఉంచాలని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ భావిస్తోంది. అందువల్ల ఈ మంత్రి మండలి పునఃరచన ఘట్టం ముగిసిన వెంటనే కేపీసీసీ అధ్యక్షస్థానం పై నూతన వ్యక్తికి కూర్చొబెట్టనుంది. కాగా, రాష్ట్ర ఇంధనశాఖ మంత్రి డీ.కే శివకుమార్‌కు అధ్యక్షస్థానం దక్కే అవకాశం ఉన్నట్లు ఆ పార్టీనాయకులు చెబుతున్నారు. అందువల్లే ఇటీవల జరిగిన పరిషత్, రాజ్యసభ ఎన్నికల్లో మూడో అభ్యర్థి గెలుపును డి.కె.శివకుమార్ తన భుజస్కందాల పై వేసుకుని వ్యవహారాన్ని చక్కబెట్టారని వారు పేర్కొంటున్నారు. కాగా, కేపీసీసీ అధ్యక్ష స్థానానికి మంత్రి ఎస్.ఆర్.పాటిల్ పేరు కూడా వినిపిస్తోంది. డి.కె.శివకుమార్ కనుక కేపీసీసీ అధ్యక్షుడైతే పార్టీ పై తనకు ఉన్న పట్టు సడలిపోతుందని భావిస్తున్న సీఎం సిద్ధరామయ్య ఎస్.ఆర్.పాటిల్ పేరును హైకమాండ్ దృష్టికి తీసుకెళుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. -
మార్పులకు కసరత్తు
{పస్తుత మంత్రుల శాఖల్లో మార్పులు? యువ నేతలకు పెద్దపీట బెంగళూరు అభివృద్ధి కోసం {పత్యేక మంత్రిత్వశాఖ మాజీ సీఎం జేహెచ్ పటేల్ కాలం నాటి ప్రతిపాదనల అమలుకు చర్యలు బెంగళూరు : రాష్ట్ర మంత్రి మండలిలో సమూల మార్పులు తీసుకువచ్చేందుకు సీఎం సిద్ధరామయ్య కసరత్తు మొదలెట్టారు. దీని వల్ల రానున్న రెండున్నరేళ్లలో కొత్త పథకాల అమలుతో పాటు ప్రస్తుతం అందుబాటులో ఉన్న సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలనేది సిద్ధరామయ్య ఆలోచనగా తెలుస్తోంది. బృహత్ బెంగళూరు మహానగర పాలికె(బీబీఎంపీ) ఎన్నికల తర్వాత మంత్రిమండలి పునఃరచన, విస్తరణ ఖాయం కానున్న నేపథ్యంలో మంత్రి మండలి మార్పులపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు కావస్తున్నా ఇప్పటికీ మంత్రి మండలిలో నాలుగు శాఖలు ఖాళీగానే ఉన్నాయి. దీంతో అమాత్య పదవులపై ఆశలు పెట్టుకున్న చాలా మందికి ఈ ‘ఖాళీ’ మింగుడు పడడం లేదు. ఈ పరిస్థితి పార్టీలో అసమ్మతిని రాజేస్తోంది. ఇక కేపీసీసీ అధ్యక్షుడిగా డాక్టర్ జీ. పరమేశ్వర్ పదవి కాలం వచ్చే అక్టోబర్ నాటికి ముగియనుంది. దీంతో ఆయన్ను కూడా మంత్రి మండలిలోకి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రస్తుత మంత్రి మండలిలో సమూల మార్పులు రానున్నాయి. సీనియర్ మంత్రులపై వేటు ఉద్యానశాఖ బాధ్యతలను నిర్వహిస్తున్న శ్యామనూరు శివశంకరప్ప వయోభారంతో బాధపడుతుండటం వల్ల ఆయనను మంత్రి పదవి నుండి తప్పించాలని సిద్ధరామయ్య భావిస్తున్నట్లు సమాచారం. ఇక రెవెన్యూ శాఖను నిర్వహిస్తున్న శ్రీనివాస్‌ప్రసాద్ అనారోగ్య కారణాలతో తన శాఖను సమర్ధవంతంగా నిర్వహించలేక పోతున్నారని హైకమాండ్‌కు నివేదిక అందింది. ఇక గృహ నిర్మాణ శాఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్న అంబరీష్ ప్రజలతో పాటు అధికారులతో కూడా మమేకం కాలేకపోతున్నట్లు ముఖ్యమంత్రికి ఫిర్యాదులు అందుతున్నాయి. అంతేకాకుండా చాలా కాలంగా ఈయన ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో ఎడమొహం పెడమొహంగా ఉంటూ వస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఈ రెబల్‌స్టార్ కూడా ‘తొలగింపు’ జాబితాలో ఉన్నట్లు సమాచారం. ఇక రాష్ట్రంలో ఇటీవల మహిళలు, చిన్నారుల పై అత్యాచారాలు పెరగడంతో జాతీయ స్థాయిలో కర్ణాటక పరువు వీధిన పడిందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇందుకు హోంశాఖ మంత్రి కేజే జార్జ్ అసమర్థతే ప్రధాన కారణమని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. సింగిల్ నంబర్ లాటరీ కేసుకు సంబంధించి కూడా కేజే జార్జ్ పై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో కే.జే జార్జ్‌ను కూడా ఆ స్థానం నుంచి తప్పించి మరో అప్రాధాన్యత పదవి ఇవ్వొచ్చునని తెలుస్తోంది. ఈయనతోపాటు మరికొందరు సీనియర్లను సైతం మంత్రి మండలి పునఃవ్యవస్థీకరణలో భాగంగా వారి శాఖలను మార్చాలని సిద్ధరామయ్య భావిస్తున్నట్లు సమాచారం. మంత్రి వర్గంలోని సీనియర్లు తన మాట వినకపోవడం వల్లే సిద్ధరామయ్య ఈ నిర్ణయానికి వచ్చారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో చురుకుగా పనిచేసే యువ ఎమ్మెల్యేలకు మంత్రి మండలిలో స్థానం కల్పించనున్నారని తెలుస్తోంది. మెట్రోకు ప్రత్యేక మంత్రిత్వశాఖ జేహెచ్ పటేల్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బెంగళూరు అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి సారించడానికి వీలుగా ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చి తర్వాత అర్ధాంతరంగా ఆగిపోయింది. ప్రస్తుతం సీఎం సిద్ధరామయ్య పై అభివృద్ధి, పారిశ్రామిక వ్యతిరేక ముఖ్యమంత్రి అన్న ముద్ర ఉంది. దీన్ని తొలగించుకోవడం కోసమే అప్పట్లో ఆగిపోయిన ఈ ప్రతిపాదనను ఇప్పుడు సిద్ధరామయ్య తెరపైకి తీసుకువస్తున్నట్లు సమాచారం. మరోవైపు పరమేశ్వర్‌కు ఉపముఖ్యమంత్రి బదులు ఈ తాజా, నూతన మంత్రిత్వశాఖను అప్పగించే ఆలోచనలో సీఎం సిద్ధరామయ్య ఉన్నారు. ఇందుకు ఏఐసీసీ పెద్దలు కూడా అంగీకరించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. -
ఏపీ కేబినెట్ నిర్ణయాలు..
హైదరాబాద్:ఈ రోజు సుదీర్ఘంగా జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఆ సమావేశంలో రాష్ట్ర రాజధానిపై మంత్రి వర్గ ఉప సంఘం వేయాలని కేబినెట్ నిర్ణయించింది. త్వరలో ఏర్పాటు కాబోయే ఈ కమిటీ విజయవాడ పరిసర ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటుకు అవసరమైన స్థలసేకరణపై దృష్టి సారించనుంది. ఐదు గంటలపాటు జరిగిన సమావేశంలో ఎయిడెడ్ టీచర్ల పదవీ విరమణ వయసును 58 నుంచి 60 ఏళ్లకు పెంచగా, డీఎస్సీ అభ్యర్థుల వయోపరిమితిన 40 ఏళ్లకు పెంచారు. విశాఖలో 400 మెగావాట్లతో థర్మల్ విద్యుత్ ప్లాంట్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే భూముల సేకరణకు రైతులు సహకరిస్తే మంగళగిరి లేదా నూజివీడులో రాజధాని ఏర్పాటు చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు మంత్రులకు తెలిపారు. -
రాజధాని ఎంపిక కోసం మంత్రి వర్గ ఉపసంఘం
-
రాజధాని ఎంపిక కోసం మంత్రి వర్గ ఉపసంఘం
హైదరాబాద్: రాజధానిపై మంత్రి వర్గ ఉపసంఘం వేయాలని ఏపి మంత్రి మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. 5 గంటలపాటు జరిగిన సమావేశం ముగిసింది. .రాజధాని ఎంపిక బాధ్యతను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే అప్పగించారు. రాజధానిపై రేపు శాసనసభలో ముఖ్యమంత్రి ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. రాజధాని ఎక్కడ అనే అంశంపైనే ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ఇతర అంశాలు చాలా ఉన్నప్పటికీ ప్రధానంగా చర్చ ఈ అంశపైనే జరిగింది. ప్రభుత్వం ముందు నుంచి చెపుతున్నదానికి భిన్నంగా శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ఇచ్చింది. ప్రభుత్వంలోని ముఖ్యులు విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటవుతుందని చెబుతూ వచ్చారు. కమిటీ అక్కడ రాజధాని ఏర్పాటు చేయడం మంచిది కాదని తెలిపింది. అయినప్పటికీ చంద్రబాబు అక్కడే రాజధాని ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో ఉన్నారు. రైతులు భూములు ఇవ్వడానికి ముందుకు వస్తే మంగళగిరి లేదా న్యూజివీడులలో రాజధాని ఏర్పాటు చేయాలని చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలన్న దానిపై ఒక నిర్ణయం తీసుకోవాలన్న దృఢమైన అభిప్రాయంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఈ అంశం చాలా సున్నితమైనది. చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్న ఉద్దేశంతో మంత్రి మండలి ఉంది. తమ నిర్ణయంతో జనంలో వ్యతిరేకత రాకుండా ఉండేవిధంగా ఏ చర్యలు తీసుకోవాలని మంత్రులతో చర్చించారు. తాత్కాలిక రాజధాని విజయవాడలో ఏర్పాటు చేసి, నిదానంగా అలవాటుపడిన తరువాత దానిని శాశ్విత రాజధాని చేయాలన్న ఆలోచన కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. రాజధాని విషయంలో తక్షణమే నిర్ణయం తీసుకోవాలని మంత్రులు చంద్రబాబుకు సూచించారు. మంత్రులందరూ విజయవాడ-గుంటూరు మధ్యనే రాజధాని ఏర్పాటు చేయాలన్న అభిప్రాయంతో ఉన్నారు. అసెంబ్లీ, సచివాలయం, వివిధ శాఖల కార్యాలయాలు, హైకోర్టు ఒకే చోట ఏర్పాటు చేయాలని మంత్రులు అభిప్రాయపడ్డారు. భూముల సేకరణ, ధరలు, వ్యవసాయ భూములు, సేకరణకు అవకాశం ఉన్న భూములు, ఇతర అంశాల పరిశీలనకు మంత్రి వర్గ ఉపసంఘం వేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. రాజధాని విషయంలో మంత్రులు అందరూ ఒకే మాట చెప్పాలని చంద్రబాబు మంత్రులకు చెప్పారు.