సాక్షి, గాంధీ నగర్ : గుజరాత్‌లో పటేదార్ల ఉద్యమం.. ఎన్నికలపైనా, ప్రస్తుత మంత్రివర్గకూర్పుపైనా.. ప్రస్ఫుటంగా కనిపించింది. ముఖ్యంగా మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పటేదార్ వర్గం నుంచి అధికార బీజేపీ తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంది. పటేదార్లకు రిజర్వేషన్ కల్పిస్తామంటూ రాహుల్ గాంధీ ఆ వర్గాన్ని ఆకర్షించడం ద్వారా బీజేపీకి ఓటమి భయాన్ని కల్పించారు. ఇక కౌంటింగ్ సమయంలో పటేదార్లు బలంగా ఉన్న నియోజకవర్గాల్లో గెలుపోటములు ఊగిసలాడాయి. ఈ నేపథ్యంలో తాజా మంత్రివర్గంలో పటేదార్లకు బీజేపీ భారీ ప్రాముఖ్యత కల్పించింది. విజయ్‌రూపానీ నేతృత్వంలో కొత్తగా కొలువుదీరిన 20 మంది మంత్రుల్లో.. 6 మంది పటేదార్లకు పదవులు కట్టబెట్టింది బీజేపీ.
తాజా మంత్రివర్గంలో మంత్రి పదవులు దక్కించుకున్న పటేదార్లలో ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ ఉన్నారు. ఆయతో సహా కౌశిక్ పటేల్, సౌరభ్ పటేల్, ప్రభాత్ పటేల్, ఈశ్వర్ పటేల్, రచ్చండ భాయ్ పటేల్ ఉన్నారు. ఇదిలా ఉండగా బ్రాహ్మణ వర్గానికి చెందిన విభావరిబెన్ దేవ్ మంత్రి పదవి దక్కించుకున్నారు. ప్రస్తుత కేబినెట్‌లో పదవి దక్కించుకున్న ఏకైక మహిళ కూడా విభావరిబెన్ కావడం గమనార్హం.
ఇక విజయ్ రూపానీ కేబినెట్‌లో ఐదు మంది ఓబీసీలు, ఎస్టీలు, ఎస్టీలు, క్షత్రియ వర్గాని తలా మూడు పదవులు దక్కాయి. మొత్తం 20 మంది మంత్రుల్లో.. 10 మంది కేబినెట్ హోదాలు దక్కగా.. మరో పదిమందికి సహాయ మంత్రి పదవులు దక్కాయి.
Comments
Please login to add a commentAdd a comment