
ఒక మహిళ రైలు పైకి ఎక్కి కూర్చునేందుకు తెగ ప్రయత్నిస్తోంది. ఇంతలో రైల్వే పోలీస్ రాగానే పాపం ఇక చేసేదేమిలేక ప్రయత్నం విరమించుకుని వెళ్లిపోయింది. ఈ ఘటన బంగ్లాదేశ్ రైల్వేస్టేషన్‌లో చోటుచేసుకుంది. ఆ రైల్వేస్టేష్‌న్‌లో ఒక ఇంటర్ ఎక్స్రెస్ రైలు ఆగి ఉంది. ఆ రైలు ప్రయాణికులతో చాలా రద్దీగా ఉంది. మొత్తం బోగీలన్నీ జనాలతో కిక్కిరిసిపోయాయి.
దీంతో కొంతమంది రైలు పైకి ఎక్కి కూర్చున్నారు. పాపం మరీ ఆ మహిళకు రైలులో సీటు దొరకలేదు కాబోలు, ఎలాగైనా వెళ్లాలనుకుని ఆమె కూడా రైలు ఎక్కేందుకు యత్నించింది. ఈ మేరకు సదరు మహిళ రైలు విండో పై నుంచి ఎక్కేందుకు శతవిధాల ప్రయత్నం చేసింది. రైలు పైన ఉన్న కొందరు ఆమెకు సాయం చేశారు కూడా. కానీ ఆమె రైలు పైకి ఎక్కలేకపోతోంది.
ఇంతలో రైల్వే పోలీస్ లాఠీతో రావడంతో ఒక్కసారిగా ఆమె దిగిపోయింది. ఈ ఘటనకు సంబంధించి వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. దీంతో నెటిజన్లు అధిక జనాభా ప్రభావం వల్ల ఇలా జరిగిందని ఒకరు, ఐనా అలాఎలా రైలు పైకి ఎక్కేందుకు అనుమతించారు, చాలా ప్రమాదం, నేరం అని మరోకరు కామెంట్లు చేస్తూ ట్వీట్ చేశారు.
(చదవండి: ఉన్నట్టుండి చేతిపంపు నుంచి మంటలు, ఆ వెంటనే నీరు.. ఆందోళనలో స్థానికులు!)
Comments
Please login to add a commentAdd a comment