గూగుల్ (Google) యాజమాన్యంలోని యూట్యూబ్ (YouTube) ప్రేక్షకులను మరింత విసిగించనుంది. అంటే ఎక్కువ సేపు యాడ్స్‌ను ప్రసారం చేయనుంది. అది కూడా స్కిప్ చేయడానికి వీలు లేకుండా.
కనెక్టెడ్ టీవీ (సీటీవీ)లలో 30 సెకన్ల నాన్-స్కిప్ యాడ్‌లను ప్రవేశపెట్టనున్నట్లు యూట్యూబ్ ప్రకటించింది. ఇంతకు ముందున్న రెండు 15 సెకన్ల వరుస యాడ్స్ స్థానంలో ఈ 30 సెకన్ల నాన్- స్కిప్ యాడ్స్‌ను తీసుకొస్తున్నట్లు ఇటీవల ఒక బ్లాగ్‌పోస్ట్‌లో తెలిపింది.
ప్రకటనకర్తల లక్ష్యాలకు అనుగుణంగా బిగ్ స్క్రీన్‌పై ఎక్కువ నిడివి యాడ్స్‌కు అవకాశం కల్పిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఇవి ప్రేక్షకులకు కూడా మంచి అనుభూతిని ఇస్తాయని పేర్కొంది. టీవీ స్క్రీన్‌పై యూట్యూబ్ సెలెక్ట్ వీక్షకులు పెరుగుతున్న నేపథ్యంలో ఇందులో వివిధ కంటెంట్‌లు ప్రసారమయ్యే సమయంలో యాడ్స్ ప్రసారం చేసుకునేందుకు ప్రకటనకర్తలకు యూట్యూబ్ అవకాశం కల్పిస్తోంది.
ఇదీ చదవండి: జీమెయిల్, యూట్యూబ్ యూజర్లకు అలర్ట్: త్వరలో అకౌంట్లు డిలీట్!
Comments
Please login to add a commentAdd a comment