non stop
-
ఓర్నీ!.. ఏం రికార్డ్..రా! ఇది..వింటేనే కన్నీళ్లు వచ్చేస్తున్నాయ్!
ఇంతవరకు ఎన్నో రికార్డులు గురించి విని ఉంటారు. చాలాచాలా వింతవింత రికార్డులను కూడా చూశాం. కానీ ఏడుస్తూ రికార్డు చేయొచ్చు అని మీకు తెలుసా!. అసలు ఇలాంటి వింత ఆలోచన.. కూడా చేస్తారా అనిపిస్తోంది కదా!. ఔను ఓ వ్యక్తి ఇలాంటి వెరైటీ రికార్డును నెలకొల్పాలనుకున్నాడు. వినూత్న రీతిలో ప్రపంచ రికార్డును సృష్టించాలని చాలా గట్టిగా నిశ్చయించకున్నాడు. అందుకోసం నాన్‌స్టాప్‌గా ఏడవలనే ఒక విచిత్రమైన టాస్క్ తీసుకున్నాడు. చివరికి రికార్డు సాధించాడో లేదో తెలియదు గానీ అతనికి లేనిపోని శారీరక కష్టాలను తెచ్చిపెట్టింది. వివరాల్లోకెళ్తే..నైజీరియన్‌కి చెందిన టెంబు ఎబెరే అనే వ్యక్తి ఎలాగైన ప్రపంచ రికార్డును బద్దలుగొట్టాలనే ఉద్దేశంతో నాన్‌స్టాప్‌గా ఏడవం అనే ఫీట్‌ని ఎన్నుకున్నాడు. రికార్డు బ్రేక్ చేయడం కోసం ఏకంగా ఏడు రోజుల పాటు నాన్‌స్టాప్ ఏడ్చాడు. దీంతో అతడను 45 నిమషాల పాటు చూపుని కోల్పోయాడు. అంతలా ఏడవడం కారణంగా తలనొప్పి, ముఖం వాచిపోవడం, కళ్లు ఉబ్బడం వంటి శారరీక రుగ్మతలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఐతే అనతు గిన్నిస్ వరల్ఢ్ రికార్డుకి దరఖాస్తు చేయలేదు కాబట్టి అతడు చేసిన ఫీట్‌ని ఇంకా పరిగణలోకి తీసుకోలేదు. ఇలాంటి క్రేజీ రికార్డులు చేయడం నైజీరియన్లకు కొత్తేమీ కాదు. ఎందకంటే గతంలో ఇలానే ఓ మహిళ 100 గంటల పాలు వంటలు చేసి ప్రపంచ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. (చదవండి: ఏ కన్నులు చూడని రెండు చిత్రాలు దాగున్నాయి!కనిపెట్టగలరా?) -
లీవు లేకుండా 74 ఏళ్లుగా ఉద్యోగం..! 16 ఏళ్ల వయసులో ఎంట్రీ
వాషింగ్టన్: అమెరికాకు చెందిన ఓ మహిళ ఉద్యోగానికి ఒక్క రోజు కూడా సెలవు పెట్టకుండా ఏకంగా 74 ఏళ్లపాటు విధులకు హాజరయ్యారు. మెల్బా మెబానె 16 ఏళ్ల వయసులో 1949లో టైలర్ అనే స్టోర్‌లో ఉద్యోగంలో చేరారు. 1956లో ఆ సంస్థను డిలార్డ్ సొంతం చేసుకుంది. లిఫ్ట్ ఆపరేటర్‌గా జాయినయి దుస్తులు, కాస్మటిక్ విభాగంలో 74 ఏళ్లపాటు పనిచేశారు. 90 ఏళ్ల వయసులో ఇటీవలే రిటైరయ్యారు. ఇప్పుడిక మంచి ఆహారం తీసుకుంటూ, ప్రయాణాలు చేస్తూ విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నానని అన్నారు. -
ఇకపై మరింత విసిగించనున్న యూట్యూబ్! అర నిమిషంపాటు నాన్ స్టాప్..
గూగుల్ (Google) యాజమాన్యంలోని యూట్యూబ్ (YouTube) ప్రేక్షకులను మరింత విసిగించనుంది. అంటే ఎక్కువ సేపు యాడ్స్‌ను ప్రసారం చేయనుంది. అది కూడా స్కిప్ చేయడానికి వీలు లేకుండా. కనెక్టెడ్ టీవీ (సీటీవీ)లలో 30 సెకన్ల నాన్-స్కిప్ యాడ్లను ప్రవేశపెట్టనున్నట్లు యూట్యూబ్ ప్రకటించింది. ఇంతకు ముందున్న రెండు 15 సెకన్ల వరుస యాడ్స్ స్థానంలో ఈ 30 సెకన్ల నాన్- స్కిప్ యాడ్స్‌ను తీసుకొస్తున్నట్లు ఇటీవల ఒక బ్లాగ్‌పోస్ట్‌లో తెలిపింది. ప్రకటనకర్తల లక్ష్యాలకు అనుగుణంగా బిగ్ స్క్రీన్‌పై ఎక్కువ నిడివి యాడ్స్‌కు అవకాశం కల్పిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఇవి ప్రేక్షకులకు కూడా మంచి అనుభూతిని ఇస్తాయని పేర్కొంది. టీవీ స్క్రీన్‌పై యూట్యూబ్ సెలెక్ట్ వీక్షకులు పెరుగుతున్న నేపథ్యంలో ఇందులో వివిధ కంటెంట్లు ప్రసారమయ్యే సమయంలో యాడ్స్ ప్రసారం చేసుకునేందుకు ప్రకటనకర్తలకు యూట్యూబ్ అవకాశం కల్పిస్తోంది. ఇదీ చదవండి: జీమెయిల్, యూట్యూబ్ యూజర్లకు అలర్ట్: త్వరలో అకౌంట్లు డిలీట్! -
నాన్‌స్టాప్‌గా ప్రయాణించిన హెలికాప్టర్‌గా రికార్డు
న్యూఢిల్లీ: భారత వైమానిక దళానికి చెందిన చినూక్ హెలికాప్టర్ నాన్‌స్టాప్‌గా ప్రయాణించి రికార్డు సృష్టించింది. ఈ హెలికాప్టర్ సోమవారం చండీగఢ్ నుంచి అస్సాంలోని జోర్హాట్ వరకు ఏడున్నర గంటలపాటు 1910 కి.మీ ప్రయాణించి సుదీర్ఘమైన నాన్ స్టాప్ హెలికాప్టర్ సోర్టీగా రికార్డు సృష్టించిందని రక్షణ అధికారులు తెలిపారు. చినూక్ హెలికాప్టర్ సామర్థ్యం తోపాటు వైమానికదళం కార్యాచరణ, ప్రణాళిక అమలుతోనే ఈ రికార్డు సాధ్యమైందని రక్షణ ప్రతినిధి పేర్కొన్నారు. ఇది యుద్ధరంగంలో బహువిధాలుగా సేవలందించనుందని తెలిపారు. ఈ హెలికాప్టర్ దళాలను, ఫిరంగులు, యుద్ధ సామాగ్రి, ఇంధనాన్ని రవాణ చేయడానికి ఉపయోగపడుతుందని వెల్లడించారు. మానవతా విపత్తు సహాయ కార్యకలాపాల్లో ముఖ్య భూమిక పోషించనుందని తెలిపారు. శరణార్థులను పెద్దఎత్తున తరలించడం వంటి మిషన్లలో కూడా ఉపయోగపడునుందని చెప్పారు. భారత వైమానిక దళం అవసరమైన మేరకు హెలికాప్టర్‌ను సముచితంగా మోహరించేందుకు వీలు కల్పిస్తుందని రక్షణ అధికారి తెలిపారు. అంతేకాదు దాని వేగవంతమైన మొబిలిటీ అవసరమైన విధంగా వినియోగించుకునే సౌలభ్యం కూడా ఉందని పేర్కొన్నారు. అయితే భారత్ 22 అపాచీ హెలికాప్టర్లు, 15 చినూక్స్ ఛాపర్లను అమెరికా నుండి కొనుగోలు చేసేందుకు 2015లో ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. An @IAF_MCC Chinook undertook the longest non-stop helicopter sortie in India, flying from Chandigarh to Jorhat (Assam). The 1910 kms route was completed in 7 hrs 30 min and made possible by the capabilities of Chinook along with operational planning and execution by @IAF_MCC. pic.twitter.com/n2aSZ3tRp4 — PRO Defence Palam (@DefencePROPalam) April 11, 2022 (చదవండి: గాలిలో ప్రాణాలు) -
ఆగకుండా నాన్‌స్టాప్‌గా వెళ్లిన రైలు,కారణం?
భోపాల్: కిడ్నాప్‌కు గురైన ఒక బాలికను రక్షించడం కోసం మొదటిసారిగా రైలు లలిత్పూర్ నుంచి భోపాల్ వరకు నాన్‌స్టాప్‌గా ప్రయాణించింది. నిందితుడు రైలులో ఒక పాపను ఎత్తుకొని వెళ్లిపోతున్నాడని తెలుసుకున్న పోలీసు విభాగం రైలును ఎక్కడ ఆపకుండా భోపాల్ వరకు నడపాలని డ్రైవర్‌ను కోరింది. దీంతో లలిత్పూర్ నుంచి రైలును ఎక్కడా ఆగకుండా భోపాల్ వరకు తీసుకువెళ్లారు. అక్కడ పోలీసులు నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. అసలేం జరిగిందంటే ఒక వ్యక్తి మూడేళ్ల చిన్నారిని అపహరించి భోపాల్‌కు వెళ్తున్న రాప్తిసాగర్ ఎక్స్‌ప్రెస్ ఎక్కాడు. దీంతో బాలిక కుటుంబ సభ్యులు రైల్వే సిబ్బందికి ఈ విషయాన్ని తెలియజేశారు. వెంటనే స్పందించిన ఆర్పీఎఫ్ పోలీసులు స్టేషన్ మాస్టర్‌తో, ఉన్నతాధికారులతో మాట్లాడి రైలు ఎక్కడ ఆపకుండా భోపాల్ వరకు తీసుకువెళ్లాలని డ్రైవర్‌కు సూచించారు. రైలు భోపాల్ చేరేవరకు అక్కడ సిద్ధంగా ఉన్న పోలీసులు నిందితుడిని గుర్తించి పాపను ఎత్తుకెళ్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. చదవండి: దివ్య కేసు: నాగేంద్ర అరెస్ట్‌కు రంగం సిద్ధం -
5 రోజులు నిర్విరామంగా..
సాక్షి,చెన్నై: అయిదు రోజుల పాటు నిర్విరామంగా యోగా చేస్తూ నగరానికి చెందిన కవితా భరణీదరన్ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును తిరగరాసింది. యోగా మారథాన్‌తో ప్రద్య్నా పాటిల్ నెలకొల్పిన గత రికార్డును తుడిచిపెట్టిన కవిత వారం రోజుల పాటు యోగా విన్యాసాలను కొనసాగించాలని భావిస్తోంది. ఈనెల 23న ఉదయం 7 గంటలకు ప్రారంభించిన యోగాను డిసెంబర్ 30 వరకూ కొనసాగించి సుదీర్ఘ యోగ మారథాన్‌తో సరికొత్త గిన్నీస్ రికార్డు సాధించాలని యోచిస్తోంది. మొక్కవోని విశ్వాసంతో ఆమె ముందుకు సాగుతున్న తీరు అభినందనీయమని కవితకు యోగ సాధన మెళకువలు నేర్పించిన గురువు పేర్కొన్నారు. -
హైదరాబాదుకు నాన్‌స్టాప్‌గా రెండు బస్సులు
కర్నూలు(రాజ్‌విహార్): కర్నూలు నుంచి హైదరాబాదుకు వెళ్లే రెండు బస్సులకు జడ్చర్ల స్టాపింగ్‌ను తొలగించి నాన్‌స్టాప్‌గా నడపనున్నట్లు ఆర్టీసీ కర్నూలు రీజినల్ మేనేజరు జి. వెంకటేశ్వర రావు తెలిపారు. మంగళవారం స్థానిక కొత్త బస్టాండ్‌లోని ఆర్ఎం కార్యాలయంలో స్థానిక అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి రోజు సాయంత్రం 6గంటలకు హైదరాబాదుకు వెళ్లే ఇంద్ర ఏసీ బస్సుతోపాటు సాయంత్రం 6:30గంటలకు వెళ్లే సూపర్ లగ్జరీ బస్సుకు కూడా జడ్చర్ల స్టాపింగ్ తొలగించామని పేర్కొన్నారు. దీంతో ప్రయాణ సమయం తగ్గుతుందని, ప్రయాణికులు రిజర్వేషన్ చేసుకుని ప్రయాణించవ్చని పేర్కొన్నారు. సమావేశంలో డీసీటీఎం శ్రీనివాసులు, పీఓ సర్దార్ హుసేన్, ఏటీఎం ప్రసాద్, కర్నూలు–1డీఎం అజ్మతుల్లా పాల్గొన్నారు.