హైదరాబాదుకు నాన్‌స్టాప్‌గా రెండు బస్సులు
Published Tue, Jul 19 2016 11:20 PM | Last Updated on Mon, Sep 4 2017 5:19 AM
కర్నూలు(రాజ్‌విహార్): కర్నూలు నుంచి హైదరాబాదుకు వెళ్లే రెండు బస్సులకు జడ్చర్ల స్టాపింగ్‌ను తొలగించి నాన్‌స్టాప్‌గా నడపనున్నట్లు ఆర్టీసీ కర్నూలు రీజినల్ మేనేజరు జి. వెంకటేశ్వర రావు తెలిపారు. మంగళవారం స్థానిక కొత్త బస్టాండ్‌లోని ఆర్‌ఎం కార్యాలయంలో స్థానిక అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి రోజు సాయంత్రం 6గంటలకు హైదరాబాదుకు వెళ్లే ఇంద్ర ఏసీ బస్సుతోపాటు సాయంత్రం 6:30గంటలకు వెళ్లే సూపర్ లగ్జరీ బస్సుకు కూడా జడ్చర్ల స్టాపింగ్ తొలగించామని పేర్కొన్నారు. దీంతో ప్రయాణ సమయం తగ్గుతుందని, ప్రయాణికులు రిజర్వేషన్ చేసుకుని ప్రయాణించవ్చని పేర్కొన్నారు. సమావేశంలో డీసీటీఎం శ్రీనివాసులు, పీఓ సర్దార్ హుసేన్, ఏటీఎం ప్రసాద్, కర్నూలు–1డీఎం అజ్మతుల్లా పాల్గొన్నారు.
Advertisement